Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఇండియాను ద్వేషించడానికి ఇవే ప్రదాన కారణాలా?
సాధారణంగా కొంత మంది వ్యక్తులు కొత్త ప్రదేశాలకు వెళ్ళాలన్నా..కొత్త విషయాలు తెలుసుకోవాలన్నా అమితమైన ప్రేమ కలిగి ఉంటారు. అంతే కాదు కొత్తప్రదేశాలు, అక్కడి ఆహారాలు రుచి చూడాలనే కోరిక, సంస్కృతి మరియు అక్కడి ప్రజలను చూడటానికి చాలా ఇష్టపడుతుంటారు. మన భారత దేశం అత్యధిక జనభా కలిగి దేశాల్లో రెండవదిగా నిలిచింది. ఇక్కడ అనేక విషయాలు, ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. సందర్యకుల కోసం అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. అంతే కాదు రాయల్ డెకరేటెడ్(రాచమర్యాదలతో అందంగా అలంకరించిన హోటల్స్) ప్రదేశాలు కూడా మన ఇండియన్ కల్చర్ లో ఉన్నాయి. ఇటువంటి ప్రదేశాలను ఒక్క సారైనా సందర్శించాలని అనుకుంటాం.
అయితే మన భారతదేశం గురించి తెలుసుకోవాలంటే నాణ్యానికి రెండు వైపుల వేరు వేరుగా ఉన్నట్లు మన ఇండియా గురించి కొన్ని మంచి మరియు కొన్ని చెడు విషయాలు రెండూ ఉన్నాయి. అవితెలుసుకోవాలంటే చాలా ఆత్రుతగా ఉంటుంది. ఉదాహరణకు: కొన్ని చారిత్రక ప్రదేశాలు మనల్ని టెప్ట్ చేస్తాయి కానీ, మురికి రోడ్లు లేదా హీనమైన రవాణా సదుపాయాలు, భారీ మలుపులు ఉంటాయి!కాబట్టి మీరు భారతదేశంలో వివిధ ప్రదేశాలు(రాష్ట్రాలు)సందర్శించాలని కోరుకుంటున్నట్లైతే, మీరు ఖచ్చితంగా ఆప్రదేశాల గురించి మంచి విషయాల గురించి తెలుసుకోవడం చాలా అవసరం. అయితే మీకు తెలియని కొన్ని చెడు విషయాలు?అంటు వంటివి మన భారతదేశంలో కొన్ని చెడు విషయాలను ఇక్కడ గమనించండి..

వీధుల్లో అడుక్కునే వారు: మీరు ఎక్కడకి వెళ్ళినా ఫుట్ పాత్ ల మీదు.. రోడ్డ్ సిగ్నల్స్ వద్ద అడుక్కొనే వారిని కనుగొంటారు.

ట్రిపిలింగ్: మన భారత దేశంలో ఒక్క బైక్ మీ ముగ్గరు నలుగు కూర్చొని వెళుతుంటారు. ఇది ఇల్లీగల్ అయినప్పటికీ, చాలా మంది ఇప్పటికీ ఈ నియమాలను పాటించరు. మరీ ముఖ్యంగా హెల్మెట్స్ లేకుండా ప్రయాణం చేయడం వంటి విషయాల్లో ఇక్కడి ప్రజలను ద్వేషించాల్సి వస్తుంది.

ఆవులు: సరైన నిర్వహణ లేకపోవడం వల్ల ఆవులు రోడ్ల మీద అడ్డంగా నిల్చోవడం వల్ల అనవసరపు ట్రాఫిక్ జామ్. ప్రయాణికులకు ఇక్కట్లు ఇటువంటి విషయాల్లో ఇండియాని ద్వేషిస్తుంటారు.

అధిక ప్రయాణికులతో వ్యానులు/ బస్సులు: ఇటువంటి దృశ్యాలు మన ఇండియాలో చూడటం ఆశ్చర్యమేమి కాదు. ఏ రాష్ట్రంలో చూసినా ఇదే దుస్థితి. బస్సుల్లో ఆటోల్లో ప్రయాణికుల పట్టే సామర్థ్యం కంటే ఎక్కువగా నింపడం వల్ల అనేక ప్రమాదాలకు దారితీస్తుంది.

చెత్త చెదారం-మురికితో కూడిన మరియు ధ్వనించేటటువంటి రోడ్లు: ఇండియాలో కొన్ని ప్రదేశాల్లో మాత్రమే రోడ్లు శుభ్రం మరియు నిర్వహణ కార్యక్రమాలు చక్కగా ఉన్నాయి. అయితే మిగిలిన ప్రదేశాల్లో చెత్త చెదారం, మురికితో నిండి ఉన్నాయి. వీటికి తోడు అత్యధిక రద్దీతో కూడిన వాహణాలు, ధ్వనించే రోడ్లను చూస్తే ఒక్కోసారి ఇండియాని ద్వేషించక తప్పదు.

ట్రాఫిక్: ప్రయాణించాలంటేను దడ పుట్టించే ట్రాఫిక్ జామ్ తో చాలా మంది ఇండియాను ద్వేషించేట్లు చేస్తున్నాయి.

సభ్యత లేని ఆటో డ్రైవర్లు: ప్రజలు భారతదేశాన్ని ద్వేషించడంలో ఇది కూడా ఒక కారణం కావచ్చు. ఆటో డ్రైవర్ల యొక్క సభ్యత లేకుండా ప్రవర్థించడం వల్ల అనే పర్యాటక ప్రదేశాల్లో ప్రయాణికులు, సందర్శకులు పరుగు తీసేలా చేస్తున్నారు.

ఉమ్మివేయడం: గుట్కాలను నమలడం లేదా పాన్ పరాగ్ వంటి చెడు వ్యసనాలు ఇండియాలోనే అధికం. వీటిని తిని ప్రాణహాని కొని తెచ్చుకోవడమే కాకుండా ఎక్కడ పడితే అక్కడ ఉమ్మివేయడం వల్ల ఇతరులకు కూడా హాని తలపెడుతున్నారు. ఇక్కడ ఇండియాను ద్వేషించక్కర్లేదు ఇండియాలో ఇటువంటి ప్రజలు ఉన్నందుకు సిగ్గుపడాలి.

వీధుల్లో అమ్మేవారు: ఇప్పటికే వివిధ చెత్త చెదారం, వాహనాలతో నింపిబడ్డ రోడ్ల మీద మేము కూడా ఉన్నా ట్రాఫిక్ జామ్ చేయడానికి అంటూ స్ట్రీట్ వెండర్స్ ఇండియాన్ ద్వేషించేలా చేస్తున్నారు.

ఇంటి చెత్త: చెత్త పారవేయడానికి ఒక మంచి పద్దతి ఉంది. అయితే, మన ఇండియాలో మాత్రం, రోడ్ల మీద ఎక్కడ బడితే అక్కడ చెత్త కుప్పలు గా వేయడం వల్ల బ్యాక్టీరియాలను నివాసలవుతూ అనేక రోగాలకు దారితీస్తున్నాయి. అంతే కాదు ఈ చెత్త వల్ల బ్యాక్టీరియాతో పాటు దోమలు, మరియు క్రిమి కీటకాలు ఎక్కువవుతూ ప్రజల వ్యాధులకు కారణం అవుతున్నాయి. ప్రాణాంతకంగా మారుతున్నాయి.



Click it and Unblock the Notifications