Latest Updates
-
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా?
వేసవిలో మనసుకు హాయినిచ్చే మల్లెపూలు, వంటికి హాయినిచ్చే కాటన్ చీరలు!
చీరలంటే ఇష్టపడని మగువ ఉంటుందా? అందులోనూ కాటన్ చీరలు.. మనసుకు హాయినిచ్చే మల్లెపూలు, వంటికి హాయినిచ్చే కాటన్ చీర! వాహ్.. భలే కాంబినేషన్ కదా! తలుచుకుంటేనే వేసవి తాపం సగానికి పడిపోతుంది.
కాటన్ చీరలంటే చాలా మంది మహిళలకు ఎక్కవ ఇష్టం. ముఖ్యంగా మన భారతీయులు చాలా మంది కాటన్ చీరలను, కాటన్ దుస్తులను ధరించడానికి ఆసక్తి చూసిస్తున్నారు. వేసవిలో శరీరానికి చల్లదనాన్ని ఇస్తూ వంటికి హాయిని కలిగించేవి కాటన్ దుస్తులు. ఆ మాటకొస్తే ఏడాది పొడవునా కాటన్ దుస్తులు ధరించడానికి అనువుగానే ఉంటుంది. మన దక్షిణ భారతంలో వాతావరణం మిగతా కాలాల్లో ఎలా ఉన్నా వేసవి నాలుగు నెలలూ కాటన్ దుస్తులు మాత్రమే వాడుతుంటారు చాలా మంది.
ఎండవల్ల కలిగే ఉక్కపోతని, చెమటవల్ల వచ్చే చికాకుని తప్పించుకోవటానికి కాటన్ దుస్తులని ధరించడం ఎక్కువ. టీనేజ్ నుండి మధ్య వయస్సు వారికీ వయస్సు మళ్లిన వారికీ అందరికీ అన్ని సమయాల్లో నచ్చేవి కాటన్ డ్రస్లులే. అందులోనూ వేసవిలో ప్రతి ఒక్కరి చూపూ కాటన్ దుస్తులవైపే. లైట్ వెయిట్, క్రేప్, డెనిమ్, స్టోన్ వాష్ డ్రస్ లిచ్చే అందం ఒక ఎత్తయితే, కాటన్ తో వచ్చే అందం దానికిదే సాటి. కాటన్ దుస్తులలోనే హుందాతనం లభిస్తుందంటే అతిశయోక్తి కాదేమో.
ఇండియాలో ఉపయోగించే కాటన్ చీరల్లో చాలా వరకూ ఖాది కాటన్ ఉపయోగిస్తారు. ఇది నిజమైన కాటన్. ఇది రఫ్ గా ఉండే చేనేత వస్త్రం. అయితే దీన్ని ధరించినప్పుడు స్టిప్ గా ఉంటుంది. మహాత్మాగాంధీ స్వాతంత్ర పోరాటంలో బ్రిటిష్ వస్త్రాల దిగుమతిని ఆపడానికి స్పిన్నింగ్ ఖాదీ ను ప్రారంభించారు. అందుకే ఇప్పుడు ఈ ఖాదీకి జాతీయ స్వాతంత్ర్య చిహ్నంగా నిలిచింది. ఇతర పేమస్ ఇండియన్ చీరలు పోచం పల్లికాటన్ మరియు ఒరిస్పాలోని సంబల్ పురి కాటన్ చీరలు చాలా పేరుగాంచాయి.
ఇండియన్ కాటన్ చీరల్లో కూడా ఎంబ్రాయిడరీ, హాండ్ లూమ్స్ స్టైల్స్ మరియు విభిన్న నమూనాలు కలిగిన కాటన్ చీరల రకాలు ఉన్నాయి. మరి మీకు నచ్చే..మీరు మెచ్చే కాటన్ శారీల లిస్ట్ ను మీకోసం అందిస్తున్నాం. వీటిని సమ్మర్ లోనే కాదు, ఇతర సీజన్ లో కూడా దరించి అందంగా ఎంజాయ్ చేయండి...

టాంట్: టాంట్ బెంగాలీ చీర. ఇది స్ఫుటమైన నిర్మాణం కలిగి ఉంది. టాంట్ చీరల్లో వివిధ రకాల డిజైన్లలో అందుబాటులో ఉన్నాయి. అయితే టాంట్ చీర యొక్క అందం మాత్రం ఎప్పుడూ ఎవర్ గ్రీనే. స్టిఫ్ గా అందంగా కనబడుతాయి.

ఖాదీ: చీరలను ముతక ఖాదీతో తయారుచేస్తారు కాబట్టి ఇవి అంతగా పేరుగాంచాయి. ఖాదీ సారీలు చూడటానికి తెలుపు మరియు గోధుమ రంగులో ఉండి స్టైలిష్ గా కనబడుతుంది.

డాకై: డాకై సారీలను ఒరిజినల్ గా ఢాకాలో తయారు చేయబడినవి. అయితే చీరల మీద అమేజింగ్ ఎంబ్రాయిడరీ తో అద్భుతమైన లుక్ ను అందిస్తాయి. కాబట్టే ఇవి కోల్ కత్తాలో చాలా ఫేమస్.

లక్నోయీ చికాన్: లక్నోయీ చికాన్ అంటే చిల్లులుతో ఎంబ్రాయిడరీ చేయడం అక్కడి ప్రత్యేకం. ఈ రకమైన కాటన్ చీరులు బాగా ప్రసిద్ది. ఈ చీరలు నేయడానికి సాధారణంగా వాడే దారాలతో వ్యతి రేక కలర్ కాంబినేషన్స్ తో తయారు చేస్తారు.

సంబల్ పురి: ఒడిషాలో సంబల్ పురి చీరలు చాలా ఫేమస్. ఈ చీరలు లేత రంగులు కలిగి ప్రధాన ఆకర్షణ కలిగి ఉంటాయి. చీర పల్లూ చాలా ప్రత్యేక డిజైన్లతో తయారు చేయబడి, కష్టమైన ఎంబ్రాయిడరీ చేయబడం ఉంటాయి.

కాంచీవరం: తమిళనాడులోని కాంచీపురం నుండి ఈ కాంచీవరం చీరలను తయారు చేస్తారు. ఇవి ఇండియాలో చాలా ఫేమస్. అంతే కాదు కాంచీవరం పట్టుకు ఎక్కువ జనాధరణ ఉన్నప్పటికీ కొన్ని రకాల కాంచీవరం కాటన్ చీరలకు కూడా డిమాండ్ ఎక్కువ ఉంది.

కొట్కీ: కొట్కీ అనేది బెంగాళీ డిజైన్. టెంపుల్ బాడర్స్ వీటి ప్రత్యేకత. ఈ చీరలు ఎక్కువగా మ్యూట్ షేడ్స్ లో వస్తాయి. ఇవి ప్రతి రోజూ ధరించడానికి కూడా చాలా బాగుంటాయి.

బొమ్కై: ఒడిషాలోని సంబల్ పురి జిల్లాలో నేచే చేనేత చీరల్లో ఇది మరో రకం. ఇవి బాగా పేరుగాంచాలియ. ఈ చీర యొక్క పల్లూ చాలా టిపికల్ గా ఉంటాయి. చీర మొత్తం ఎంబ్రాయిడరీ మరియు ఒక సన్నని అంచు చిన్న చుక్కలు కలిగి ఉంటుంది.

పోచం పల్లి: పోచం పల్లి కాటన్ శారీస్ సౌత్ ఇండియాలో చాలా ఫేమస్. వాటి ప్యాట్రన్ తో వివిధ రంగుల డిజైన్లతో చాలా ఫేమస్. వీటిని సౌత్ ఇండియాలో ఎక్కువగా ఉపయోగిస్తారు.

జమ్ దాని: ఇవి స్పెషల్ ఎంబ్రాయిడరీ మరియు థ్రెడ్ వర్క్ తో ప్రత్యేకంగా తయారు చేయబడి ఉంటాయి. ఎక్కువగా ఈ రకమైన చీరలకు గోల్డెన్ థ్రెడ్ లేదా అంచును తయారు చేస్తారు.

పసపల్లి: ఒడిషాలోని బర్గర్ జిల్లాలో ప్రత్యేకంగా నేస్తారు. ఇవి బాగా పేరుగాంచాయి. ఈ చీరలు పూర్తిగా చేత్తో అల్లిక చేయబడి ఉంటాయి. అందుకే ఈ చీరలు ఉత్పత్తి చేయడానిక చాలా నెలలు పడుతుంది.

ఛందేరి: చందేరి చీరలకు ఇండియా యొక్క కేంద్ర భిందువు అని చేప్పొచ్చు. ఈ చీర సెమీ ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. చందేరీ కాటన్ చీరలు చాలా సులువగా మరియు ప్రకాశవంతమైనవిగా ఉంటాయి. అందుకే వీటికి డిమాండ్ ఎక్కువ.

సూపర్ నెట్: సూపర్ నెట్ చీరలు సెమీ ట్రాన్స్పరెంట్ గా ఉండటం వల్ల ఇవి చాలా ప్రజాదరణ పొందినాయి.

కోటా: కోటా ఇది రాజస్థాన్ యొక్క స్పెషల్ కాటన్ చీర. ఈ కోటా శారీలను సాధారణంగాను మరియు అకేషనల్ గాను మరియు పెళ్ళిళ్ళు, పూజలు వంటి కార్యక్రమాలకు ప్రత్యేకంగా ధరించవచ్చు.



Click it and Unblock the Notifications