Latest Updates
-
నోరూరించే దహీ ఇడ్లీ.. ఈ సమ్మర్ లో మీ ఫ్యామిలీకి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్..ఎలా చేసుకోవాలంటే.. -
ఒక రోజులో ఎంత బీరు తాగితే సేఫ్? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన చేదు నిజం! -
కేవలం 5 నిమిషాల్లో ఇంట్లోనే టేస్టీ ద్రాక్ష రసం..ఎలా తయారు చేసుకోవాలంటే.. -
వేసవిలో చలవ చేసే బార్లీ లడ్డూ.. పాకం పట్టే పనే లేకుండా ఇలా ఈజీగా చేసేయండి! -
వృద్ధాప్యంలో శృంగారం.. ఈ 5 విషయాలు పాటిస్తే మీ బంధం మరింత మధురం! -
పాలు లేకుండానే కమ్మటి వెన్న.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా..100% ప్యూర్, 0% కొలెస్ట్రాల్! -
చపాతీ, పరోటాలోకి శరవణ భవన్ వైట్ కుర్మా.. ఒక్కసారి తిన్నారంటే టేస్ట్ దద్దరిల్లిపోవాల్సిందే! -
గ్యాస్ కష్టాలకు చెక్: పొయ్యి వెలిగించకుండానే వేడి వేడి ఇడ్లీ, టేస్టీ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఓరల్ శృంగారం చేస్తున్నారా? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజాలు! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..కర్ణాటక స్పెషల్ అక్కి రోటీ..రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు!
తల్లైన తర్వాత కూడా ఫిట్ గా సెక్సీగా ఉండే టాప్ 15 సెలబ్రెటీలు..!
మాతృత్వం వల్ల శరీరాకృతి చెడి పోయి, ఊబకాయం వచ్చే రోజులు పోయాయి. పిల్లలు పుట్టాక కూడా తమ అందాన్ని కాపాడుకున్న ఈ బాలీవుడ్ తల్లులు చాలా మంది గృహిణులకు, ఉద్యోగినులకు ప్రేరణగా మారారు. గర్భం దాల్చడం, పిల్లలు పుట్టడం అంటే బరువు పెరగడం కాదని వారు నిరూపించారు. నిజానికి వారు అంతకు ముందు కన్నా అందంగా వున్నారు. బాలీవుడ్ లోని 15 మంది చురుకైన తల్లులను కలుద్దాం రండి.

శిల్పా శెట్టి :
చురుగ్గా వుండే ఈ తల్లి ప్రసవించిన తరువాత కూడా ఒక్క కిలో కూడా పెరగలేదు, ఇదంతా ఆమె ఆరోగ్య ప్రణాళిక వల్ల సాధ్యం అయింది. ఆమె నిరంతరం వ్యాయామం చేస్తూ వుంటుంది, చాలా వ్యాయామం డివిడి లు కూడా విడుదల చేసింది. యోగా వల్లనే తన శరీరాకృతి బాగుందని ఆమె చెప్తుంది.

లారా దత్తా :
ఒకప్పటి మిస్ యూనివర్స్ కూడా అయిన ఈ అందమైన తల్లి ఆరోగ్యంగా వుండాలని అనుకుంటుంది. ప్రసవానికి ముందు, తరువాతా కూడా ఫిట్ నెస్ వీడియో లను ఆమె విడుదల చేసింది. ప్రసవం తరువాత, ఆమె బరువు తగ్గి మరింత నాజూగ్గా తయారయింది.

మలైకా అరోరా ఖాన్:
బాలీవుడ్ లోని చురుకైన తల్లుల్లో ఒకరు ఈమె. ఐటెం నృత్యాల రాణి కూడా అయిన మలైకా ఫిట్ గా వుండడం అంటే - సెక్సీ గా, ఆకర్షించేలా, బలాన్నిచ్చేదిగా - ఇలా చాలా విషయాలు గుర్తుకు తెస్తుంది. నిత్యం యోగా, జిమ్ లో వ్యాయామం వల్ల శరీరాకృతి బాగుంటుందని ఆమె అంగీకరిస్తుంది.

కాజోల్:
కూతురు నైసా తరువాత ఏడేళ్లకు రెండో సారి కొడుకు యుగ్ ను కని మరో సారి తల్లి అయింది కాజోల్. ఇద్దరు పిల్లలను కన్నాక కూడా కాజోల్ ఇప్పటికీ అందంగానే వుండి మరోసారి తెరపైకి వస్తుందని అనుకోవచ్చు.

సెలీనా జైట్లీ:
మాజీ బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ మగ కవలలకు జన్మనిచ్చినా ఒక్క అదనపు కిలో కొవ్వు కూడా ఆమెను తాకలేక పోయింది. బాలీవుడ్ చిత్రాల్లో ఆమె ఈ మధ్య నటించకపోయినప్పటికీ ‘జనాషీన్ సినిమాలో ఆమె బికినీ ధరించిన వేడి వేడి దృశ్యాలను ఎవరైనా ఎలా మరిచిపోగలరు.

మాధురి దీక్షిత్ నెనే:
90 లలో ఆమె వెండి తెర వేల్పుగా వెలిగింది. 2002 లో ఆమె బాలీవుడ్ ను వదలి వైవాహిక జీవితం లోకి వేల్లాలనుకుంది. అయిదేళ్ళ తరువాత ‘ఆజా నచ్ లే' సినిమాతో తిరిగి తెరపై కనపడినా, ఇప్పుడు కూడా ఆమె సినిమాల్లో చురుగ్గా నటించడం లేదు.

ట్వింకిల్ ఖన్నా:
ట్వింకిల్ ఖన్నా తెరపైకి వచ్చిన తొలినాళ్ళలో పెద్ద చూపరి ఏమీ కాదు. కానీ ఇప్పుడు కథ మారిపోయింది. మాతృత్వం, తెర బయటి ఆమె జీవితం ఆమెను అందంగా మార్చివేశాయి. ఈ అందమైన తల్లి గృహాలంకరణ చేస్తూ బిజీ గా లేకపోతె తన కొడుకు ఆరవ్ తో ఎక్కువ సమయం గడుపుతుంది.

కరిష్మా కపూర్:
ప్రపంచానికి పెద్ద నేరమైనప్పుడే సెక్సీ, సెక్సీ అనే మాట పలికింది కరిష్మా కపూర్ అన్నది నిజమే. కానీ ఆమె ఇప్పటి దాకా పెద్ద బాంబ్ గా మారలేదు. ఆ కీచు గొంతు, ఒత్తైన జుత్తు లేకపోతె ఆమెను గుర్తే పట్టలేం. అవును ఆమె ఇప్పుడు అంత బాగుంది.

రవీనా టాండన్:
ఈమె అద్భుతమైన డ్రస్సులు వేయకపోవచ్చు. ఆవిడ వార్డ్ రోబ్ లో కూడా హిట్ జతల కంటే ఫ్లాప్ జతలే ఎక్కువ. అయితే దీంతో సంబంధం లేకుండా ఆమె ఇద్దరు పిల్లలకు తల్లయ్యాక కూడా చక్కటి శరీరాకృతి కలిగి వుంది.

సోనాలీ బెంద్రే:
మీరు సోనాలీ బెంద్రే ను చూస్తె ఆమె తెర మీద తళుక్కుమన్నప్పటికన్నా ఒక్క రోజు కూడా ఎక్కువ వయసుండదనుకుంటారు. నటీ, మోడల్ కూడా అయిన ఈమె మంచి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఇప్పటికీ యవ్వనంగా చురుగ్గా కనపడుతుంది.

సుజాన్ ఖాన్:
భర్త హృతిక్ రోషన్ నీడలో ఆమె ఎప్పుడూ లేదు. ఒక ఇంటీరియర్ డిజైనర్ గా తనదైన పేరు తెచ్చుకుంది ఈమె. ఆరోగ్యంగా వుంది, మంచి శరీరాకృతి కలిగి వుండడం ఇద్దరు పిల్లల ఈ తల్లికి చాలా ముఖ్య౦.

మెహెర్ జేస్సియా:
మెహెర్ జేస్సియా ను చూసినప్పుడల్లా గుండె హబ్బా హబ్బా అని కొట్టుకుంటుంది. ఈ సూపర్ మోడల్ ఇద్దరు కూతుళ్ళ తల్లి. ఈత, బాడ్మింటన్ అంటే చాల ఆసక్తి కల ఈ సూపర్ తల్లి బహుశా అందుకే ఇప్పటికీ మంచి శరీరాకృతితో వుంది.

నందితాదాస్:
నటి, సినీ నిర్మాత నందితా దాస్ తన వ్యక్తిత్వానికి మరింత వన్నె తెచ్చుకుంది. ఆవిడ మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్నట్టు వుంది.

శ్రీదేవి:
ఈ జాబితా లో శ్రీదేవి ఉండాల్సిందే. నలభైవ పడి లోని ఈ అందమైన భామ వయసంటే ఒక అంకె మాత్రమే అనే సిద్ధాంతాన్ని గుర్తు చేస్తుంది. ఈ నటి ఎప్పుడూ ముగ్ధ మనోహరమైన అందకత్తే. కానీ ఇప్పుడు మరింత అందంగా వుంది. ఈమధ్యే పద్మశ్రీ అందుకున్న ఈ తార ఇప్పటికీ తెర మీద కొత్తగా వచ్చిన నటీమణులకు పోటీ ఇవ్వగలదు.

ఐశ్వర్యారాయ్ బచ్చన్:
నిజమే, ఎప్పుడూ జనం దృష్టిలో వుండే అందరికన్నా సుప్రసిద్ధ బాలీవుడ్ తల్లి ఐశ్వర్యా రాయ్ బచ్చన్. ఈవిడను బాలీవుడ్ తల్లుల్లో నెంబర్ 1 గా చెప్పుకోవచ్చు.



Click it and Unblock the Notifications











