Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
మీరు ఎప్పుడైనా లేడీగాగ రియల్ లుక్ చూసారా?
సుదీర్ఘ పాప్ సంగీత చరిత్రలో ఎందరో ధృవతారలు సంగీతాభిమా నులను ఓలలాడించారు. ఇప్పుడు అదే సంగీతాభిమానులను ఓ పాతికేళ్ళ యువతి తన గానామృతంతో మైమరపింపజేస్తోంది. ఎల్లలు లేని ఈ సంగీత ప్రపంచంలో ప్రస్తుతం రారాణిగా వెలుగొందుతున్న ఆ యువ గాయకురాలే లేడీ గాగ. ఆమె మైక్ పట్టుకుందంటే చాలు విశ్వవ్యాప్తంగా అభిమానులు సంభ్రమాశ్చర్యాలకు లోనవుతారు. అనతి కాలంలోనే పాప్ సంగీతానికి దశ-దిశగా ఎదిగిన లేడీ గాగ.. పాప్ అభిమానులకు ఆరాధ్య దేవతగా అవతరించింది. గాగ గొంతు నుంచి జాలువారే ప్రతి పదం ప్రస్తుతం సంగీతాన్నే శాసించగలుగుతోందంటే అతిశయోక్తి కాదేమో...
న్యూయార్క్ సిటీలో జన్మించిన లేడీ గాగ.. అసలు పేరు స్టెఫని జోఅన్నె అంజెలిన జెర్మనొట్ట. పలికేందుకు, గుర్తుంచు కునేందుకు కాస్త ఇబ్బందికరంగా అనిపించే ఈ పేరు..కోట్లాది గాగ అభిమానుల్లో ఏ కొద్ది మందికో కూడా తెలియదు. అశేషమైన అభిమానులం దరికీ లేడీ గాగ పేరుతోనే సుపరిచితురాలైన ఈ పాప్ గాన సుందరి.. తన 19వ ఏటలో కెరీర్‌ను ఆరంభించింది. అద్భుతంగా పాడటమే కాదు..తనే సొంతంగా రాసుకుని పాడే గాగ పేరు.. 2008నాటికి విశ్వ వ్యాప్తంగా మారు మ్రోగింది.
స్వల్పకాలంలోనే విశేషంగా ప్రఖ్యాతిగాంచిన లేడీ గాగ.. అంతే స్థాయిలో వివాదాల్లో చిక్కుకుంది. ఎమ్ టీవి మ్యూజిక్ అవార్డుల్లో గతేడాది పాల్గొన్న గాగ.. పచ్చి జంతు మాంసం కప్పుకుని రావడం సంచలనం కలిగించింది. జంతు ప్రేమికుల నుంచి తీవ్ర నిరసనలను ఎదుర్కొన్న గాగ..ఆ తర్వాత తన ప్రవర్తన చాలా వరకు మార్చుకుని విమర్శకుల ప్రశం సలను పొందింది.
పాప్ క్వీన్‌గా పేరు తెచ్చుకున్న లేడీ గాగాకు ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో కొత్తగా చెప్పనక్కర్లేదు. ఆమె ఏ దుస్తులు వేసుకుంటే వాటిని, ఏ రంగు లిప్‌స్టిక్ వాడితే దాన్ని వాడుతూ గాగా ట్రెండ్‌ను ఫాలో అయ్యే వెర్రి జనాలు చాలామందే ఉన్నారు. అంతే కాదు గాగ ఒక్కసారి కనిపించిన స్టైల్ మరో సారి ఉండదు. ఎప్పుడు ప్రత్యేకంగా కనబడుతూ అందరిని ఆశ్చర్యపరుస్తుంటుంది. ఆమె ధరించే దుస్తులు ఆమె డిజైన్ చేస్తుందంటే ఆశ్చర్యం వేస్తుంది. బహుశా అందుకే కాబోలు ఆమె వెనుక అంత మంది అభిమానులు. మరి ఆమె ఒక్కో సందర్బంలో ఒక్కొరకంగా ఉన్న లేడీ గాగాను ఒక్క సారి చూసి తరించండి...!

1. లేడీ ఇన్ రెడ్ డ్రెస్:
లేడీ గాగ టాప్ టు బాటమ్ రెడ్ కలర్ డ్రెస్స్ లో విచిత్రంగా ఇలా ఫోటోకు ఫోజు ఇచ్చింది.

2. యువరాణి గెటప్ కు చాలా చాలా దూరంగా ఉంది:
నార్నియా యువరాణికి పోటిగా తయారైనట్లు కనిపిస్తోంది. ఈ డ్రెస్ లో భయట్టే విధంగా కనబడుతోంది.

3. థైవాన్ డ్రెస్ లో :
థైవాన్ డ్రెస్ లో లేడీ గాగా, ఈ గెటప్ లో చాలా అందంగా ఉంది. ఈ డ్రెస్ లో లియోపార్డ్ టాక్సీ డ్రైవర్ గా కనబడుతోంది.

4. పీచ్ కలర్:
పీచ్ కలర్ చాలా అందమైన కలర్, అయితే ఈ పీచ్ కలర్ డ్రెస్ లో లేడీ గాగ చూస్తే ప్లాప్ అవ్వాల్సిందే. ఈ పీచ్ కలర్ ఫ్రిల్ గౌన్ కు చుంకూ హీల్స్ అందంగా ఉన్నాయి.

5. మ్యూజిక్ అవార్డ్స్ లో :
ఈ భయంకర గెటప్ లో ఉన్నది లేడీగాగ అని ఎవ్వరూ గుర్తించలేరు .

6. రెడ్ మాస్క్ :
లేడీగాగ ఒక రెడ్ కలర్ లేస్ మాస్క్ లో తన సహజ అందాన్ని ఎందుకు కంప్పించు ఉన్నదో అర్ధ కావడం లేదు.

7. మీట్ డ్రెస్:
లేడీ గాగా ఇలా రెడ్ కలర్ మీట్ మరియు ఫిష్ కలర్ డ్రెస్స్ లో ఇలా ఫోజ్ ఇచ్చినిలబడటం. బహుశా ఇది ఆమె వెజిటేరియన్ కు మారిందనడానికి నిదర్శనమా..?

8. బుడగలు డ్రెస్ లో వెరైటీగా:
లేడీగాగ ఎప్పుడా ఒక ప్రత్యేకతను కోరుకుంటుంది. ఎప్పుడు జనాల్లోకి వచ్చినా ఆమెను గుర్గించని విధంగా విచిత్ర వేశధారణలతో అభిమానులను మరింత ఆకట్టుకుంటున్నది.

9. బ్లాక్ వెయిల్:
ఈ గెటప్ లో లేడీ గాగను చూస్తే, ఆమె ఫ్యూనెరల్ లేదా వెడ్డింగ్ సెర్మనీకిు హాజరయినట్లుగా కనిపిస్తోంది. బ్లాక్ వేల్ ధరించి ఇలా పోటోలకు పట్టుబడింది.

10. హెలో కిట్టీ:
హెలో కిట్టీ క్వీన్ గా లేడీ గాగ, ఆమె శరీరాన్ని పూర్గిగా బొమ్మలతో అలంకరించుకొన్నది. ఈ డ్రెస్ ను ఆమె 35ఏళ్ళలో తన బర్త్ డేకు ఇలా డ్రెస్ చేసుకుండి.

11. సిస్టర్ లాగా:
ఈ గెటప్ లో లేడీ గాగను చూస్తే మూవీలో సిస్టర్ యాక్ట్ గెటప్ వేసినట్లు కనిపిస్తోంది. ఈ గ్రేట్ సింగర్ ఎటువంటి దుస్తులు ధరించినా అందంగానే కనిపబడుతోంది.

12. అలియనేటెడ్:
ఈ డ్రెస్ లో లేడీగాగను చూసి ఆశ్చర్యపడాల్సిందే. ఈ డ్రెస్ లో లేడీగాగను ఏమని పిలవాలో కూడా తెలియడం లేదు.

13.బార్బీ హెయిర్:
రియల్ లైఫ్ బార్బి, లేడీగాగ. ఈ గ్రేట్ సింగర్ లెదర్ బ్లాక్ క్యాట్ అవుట్ ఫిట్ లుక్ తో సింపుల్ గా, బార్బీ హెయిర్ స్టైల్లో అందంగా ఉంది.

14. బబుల్ గమ్ లుక్:
ఈ సింగర్ తను ఈ బబుల్ గమ్ లుక్ లో ఉంటానని ఎక్స్ ప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లుంది. లేడీ గాగ ఇక్కడ ఒక బ్లూ కలర్ దాని మీద ఒక పింక్ బబుల్ కలర్ అవుట్ ఫిట్ ధరించినట్లు ఉంది.

15. బ్లాక్ లేస్:
మీరు బ్లాక్ కలర్ ఫ్లోర్ లేస్ గౌన్ లో పోటోలకు పట్టుబడింది. ఇలా చూస్తుంటే, లేడీ గాగకు లేస్ డ్రెస్ లు వేసుకోవాలంటే ఎక్కువ ఇష్టమేమో అనిపిస్తున్నది .

16. సర్కిల్ టైమ్:
లేడీగాగ ఒక సర్కిల్ షేప్ టైటిల్ డ్రెస్ లో పట్టు డిఫరెంట్ లుక్ తో కనిపించారు. ఈ డ్రెస్ లో సింగర్ ఫర్ ఫెక్ట్ షేప్ గా కనబడుతున్నారు.

17. ఈకె గ్రీన్ :
గ్రీన్ లవ్లీ కలర్, అందుకే ఈ కలర్ లో లేడీ గాగ దర్శనమించింది. అయితే ఈ డ్రెస్ అంత అందగా అనిపించలేదు, గ్రీన్ కరల్ హెయిర్, గ్రీన్ డ్రెస్, గ్రీన్ షూ అంతా వెరైటీనే.

18. ఫ్రూటీ లుక్:
లండన్ లో ఓ ప్రోగాంకు వచ్చిన గాగ, డార్క్ ఆరెంజ్ ఫ్రూట్ కలర్ డ్రెస్ లో పోటోలకు పట్టుపబడ్డారు. వదులుగా ఉండే బ్లాక్ బెల్ట్ ఒక అందమైన గొడుగుతో ఫోటోలకు చిక్కింది.

19. హానర్:
గ్రామీ అవార్డ్ ఫంక్షన్ లో లేడీగాగ, ఇలాంటి వెరైటీ లుక్ డ్రెస్ లో వెళ్ళాలని నిర్ణయించుకుంది.

20. కాంటెంపరెరీ లుక్:
పైన చూసిన అన్ని విచిత్రమైన డ్రెస్సుల్లోకి ఈ అవుట్ ఫిట్ అందంగా, సెక్సీగా కనబడేలా అలకంరించుకుంది. ఒక పాప్ సింగర్ గా ఈ డ్రెస్ లో క్లియర్ గా తన రియల్ లుక్ తో కబడుతున్నది.



Click it and Unblock the Notifications











