Latest Updates
-
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే..
2023-pongal : సంక్రాంతి మొదటి రోజు ‘భోగి’ భాగ్యాల విశిష్టత
పండుగల్లో అతి పెద్దగా జరుపుకొనే పండుగ సంక్రాంతి. సంక్రాంతి వచ్చిందంటే చాలు పల్లె వాతావరణానికి కొత్త కాంతి వచ్చినట్లే. ఎక్కడ చూసినా ఆనందం, సంతోషం వెల్లువిరుస్తుంటుంది. పండగ సంబరాలు కనిపిస్తుంటాయి. మనకు ఉన్న చాలా పండుగలు ఒకటి రెండు రోజుల మాత్రమే జరుపుకుంటారు. అయితే సంక్రాంతిని మాత్రం మూడు... నాలుగు రోజులు జరుపుకుంటారు. మొదిటి రోజు భోగి, రెండవ రోజు సంక్రాంతి, మూడవ రోజు కనుక అయితే మరికొందరు నాలుగవ రోజుకూడా ముక్కనుమ పేరుతో సంబరాలు జరుపుకుంటారు.
మొదటి భోగి రోజు ప్రత్యేకత తెలుసుకుందాం...భోగి రోజు తెల్లవారు జామునే ఇంటిలోని వారంతా తలంటుస్నానం చేయటం, కొత్త బట్టలు ధరించటం, అడుతూ, పాడుతూ గడపటం పరిపాటి. ఉదయం పూట భోగి మంట ఓ మధురాను భూతి కలిగిస్తుంది. ఈ భోగి మంటకు పిల్లలు పెద్దలు అందరూ ఉండి సంతోషంగా భోగి మంటలు వేసుకొంటారు. భోగి రోజు ఉదయాన్నే ప్రతి ఇంటి ముందూ భోగి మంట మండాల్సిందే. అందరూ తమ ఇళ్ళలోని పాత వస్తువులు, వాడకంలో లేని పలు సామాగ్రిని పోగుపెట్టి భోగి మంటగా వేస్తారు.

'భగ' అనే పదం నుండి 'భోగి' అన్న మాట పుట్టిందని చెబుతారు. భగ అంటే మంటలు లేదా వేడిని పుట్టించడం అని అర్థం. దక్షిణాయనంలో ప్రజలు తాము పడిన కష్టాలను, బాధలను అగ్ని దేవుడికి ఆహుతిచేస్తూ రాబోయే ఉత్తరాయణంలో సుఖసంతోషాలను ఇమ్మని కోరుతూ వేసే మంటలు 'భోగి మంటలు'
మకర సంక్రాంతి నెలంతా కన్నెపిల్లలు తమ ముంగిళ్ళలో ఆవుపేడతో పెట్టిన గొబ్బిళ్ళను పిడకలుగా చేసి, ఆ పిడకలతో భోగి మంట వేస్తారు. ఇది భోగి మంట ప్రాధాన్యత. ఆవు పేడలోని ఔషధగుణాలు కారణంగా మంటల నుండి వెలువడిన పొగ వాతావరణ కాలుష్యాన్ని నివారిస్తుంది. భోగి రోజు ఉదయాన్నే అభ్యంగన స్నానాలు చేసి భోగి మంటలపై వండిన మధుర పదార్ధాల్ని తింటారు. ఈ రోజు సాయంత్రం పిల్లలకు భోగిపళ్ళు పోస్తారు. ఇలా చేయడం వలన పిల్లలకు దృష్టి దోషం తొలుగుతుందని భావిస్తారు.
కుటుంబంలోని వారందరూ తలస్నానాలు చేసి "సంక్రాంతి లక్ష్మి" ని పూజిస్తారు. కొత్త బట్టలు కట్టుకుంటారు. భోగి రోజు మూడు లేక ఐదు కూరగాయలను కలిపి కూరగా వండుతారు. దీన్ని "కలగూర" అంటారు. "నువ్వు పులగం, పొంగలి", ప్రధాన వంటకాలు. సాయంత్రము చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోసి పేరంటము జరుపుతారు. బొమ్మల కొలువును ఏర్పరచడం కూడ వుంటుంది. బొమ్మలకు హారతి యిచ్చి, పేరంటం చేస్తారు. ఇదే భోగి యొక్క విశిష్టత.



Click it and Unblock the Notifications