Latest Updates
-
దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే!
కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో మరోసారి ఐశ్వర్యరాయ్ తళుకుబెళుకులు..
66వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో భారతీయ సినీ స్టార్లు తమ తళుకు బెళుకులతో సందడి చేస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక అంతర్జాతీయ చిత్రోత్సవంలో కనువిందుచేస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. 11 రోజుల పాటు కొనసాగుతున్న కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో బాలీవుడ్‌తో పాటు సౌతిండియా సినిమా ఇండస్ట్రీ నుంచి 15 మంది సెలబ్రిటీలు హాజరవుతున్నారు. అమితాబ్ బచ్చన్‌తో పాటు ఐశ్వర్యారాయ్, విద్యాబాలన్, సోనమ్‌కపూర్, అమీషా పటేల్, రజనీకాంత్, షెర్లిన్ చోప్రా, అనురాగ్ కశ్యప్, నందితా దాస్, నవాజుద్దీన్ సిద్దిఖీ తదితరులు ఈ చిత్రోత్సవంలో పాల్గొంటున్నారు. వీరంతా తమ సినిమాల ప్రమోషన్ లేదా వివిధ ఉత్పత్తుల బ్రాండ్ అంబాసిడర్‌లుగా ఈ చిత్రోత్సవానికి హాజరవుతున్నారు. భారతీయ సినిమాలకు ఈ చిత్రోత్సవంలో ప్రత్యేక గుర్తింపు లభిస్తుండడం విశేషం.
కాన్స్ ఫిల్మ్‌ఫెస్టివల్‌లో ఎక్కువ సార్లు పాల్గొన్న భారతీయ తార ఐశ్వర్యారాయ్. ఆమె 2002 సంవత్సరంలో తొలిసారిగా తాను నటించిన 'దేవ్‌దాస్' చిత్రం ప్రమోషన్‌లో భాగంగా ఈ చిత్రోత్సవానికి హాజరైంది. అప్పటి నుంచి వరుసగా ఈ చిత్రోత్సవంలో పాల్గొంటోంది. ఈసారి ఓ బ్యూటీ బ్రాండ్‌కు అంబాసిడర్‌గా ఈ చిత్రోత్సవంలో సందడిచేసింది.
అందాల తార ఐశ్వర్యరాయ్ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఎలాంటి డ్రెస్‌లో దర్శనం ఇస్తుందో? ఎంత అందంగా కనిపిస్తుందో అని ఎదురు చూస్తున్న అభిమానుల నిరీక్షణకు తెరదింపుతూ ఐష్ ఎంట్రీ అదిరింది. గతంలో కంటే చాలా బరువు తగ్గిన ఐశ్వర్య అందాల దేవతగా రెడ్ కార్పెట్‌పై ఒయ్యారాలు ఒలికించి అందరినీ మంత్రముగ్దుల్ని చేసింది.
కాన్స్‌లో Inside Llewyn Davis చిత్ర ప్రీమియర్ షోకి హాజరైన ఐశ్వర్యరాయ్ బ్లాక్ ఎలీ సాబ్ డ్రెస్ ధరించింది. ఈ డ్రెస్ లో ఐశ్వర్య భువినుంచి దివికి వచ్చిన అందాల దేవతలా ఉందని అభిమానులు అంటున్నారు. అదే విధంగా భారతీయ సినిమా 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గౌరవ అతిథిగా హాజరైన ఐష్ సాబియాసాచి ముఖర్జీ డిజైన్ చేసిన గోల్డెన్ వర్క్ చేసిన బ్లాక్ సారీ ధరించింది.
ఈ సారి కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కి హాజరవడంతో ఐష్ మొత్తం 12 సార్లు కాన్స్ ఫెస్టివల్‌లో పాల్గొన్నట్లయింది. ఐశ్వర్య తొలిసారిగా సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో వచ్చిన ‘దేవదాస్' ప్రీమియర్ షో సందర్భంగా కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అడుగు పెట్టింది. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఐశ్వర్య రాయ్ ఫోటోలను స్లైడ్ షోలో వీక్షించండి..

ఏలీ సాబ్: ఐస్ రెడ్ కార్పెట్ మీద తన దేవదాస్ ప్రీమియర్ షో తో దర్శనమిచ్చింది బ్లాక్ షిమ్మరి సీక్వెన్స్ ఎంబ్రాయిడరీ లేస్ గౌన్ తో 2013ట్రెండ్ కు తగ్గట్టుగా అలరించింది.

జానే మరియు మౌడీ కోయస్ నాడీ: ఐశ్వర్య రాయ్ జానె ఫండా మరియు ఇండోనేషియా యాక్టర్స్ లోరియల్ అంబాసిడర్ మౌడీ ఇద్దరితో కలిసి ఇలా ఫోటోలకు ఫోజులిచ్చింది.

10వ సారి కాన్స్ ను సందర్భించిన యాక్టర్స్ ఐష్ : ఆమె 2002 సంవత్సరంలో తొలిసారిగా తాను నటించిన 'దేవ్‌దాస్' చిత్రం ప్రమోషన్‌లో భాగంగా ఈ చిత్రోత్సవానికి హాజరైంది. అప్పటి నుంచి అంటే పది సంవత్సరాలుగా వరుసగా ఈ చిత్రోత్సవంలో పాల్గొంటోంది. ఈసారి ఓ బ్యూటీ బ్రాండ్‌కు అంబాసిడర్‌గా ఈ చిత్రోత్సవంలో సందడిచేసింది.

ఇంటర్వ్యూ సమయంలో: ఐశ్వర్య రాయ్ మంచి హాపీ మూడ్ తో మీడియా వారితో ఇలా ఇంటర్వ్యూలో పాల్గొన్నది.

ప్రెగ్నెన్సీ వెయిట్: ఐశ్వర్య రాయ్ ఇప్పటికీ కొద్దిగా ప్రెగ్నెన్సీ వెయిట్ అలాగే ఉన్నట్లు ఉన్నది. అందుకే కాబోలు ఈ పొడవాటి ఎలైస్ సాబ్ గౌన్ లో కొంచెం బొద్దుగా కూడా కనిపిస్తోంది.

బ్లాక్ క్లచ్: ఐశ్వర్య రాయ్ తన అందమైన కళ్ళతో, బ్లాక్ డ్రెస్ లో అక్కడి వారిని ఆకట్టుకొన్నది. ఆమె ధరించిన డ్రెస్ మీదకు చిన్న బంగారు ఆభరణాలతో పాటు బ్లాక్ క్లెచ్ ధరించింది.

హాయ్: ఐశ్వర్య రాయ్ కాన్స్ రెడ్ కార్పెట్ మీద 5వ రోజును ఇలా దర్శనమిస్తూ హాయ్ అంటూ అందరినీ పలకరించి సందడి చేసింది.

మార్మైడ్: ఐస్ ధరించిన వైట్ షర్ట్ మరియు బ్లాక్ మెర్మైడ్ స్కర్ట్ ధరించి జాక్ ఫోజ్ లో అద్భుతంగా నిలిచారు.

సినిమా గాల: వంద సంవత్సరపు సినిమా గాలలో ఇలా బ్లాక్ లెహంగా శారీలో కళ్ళు మిరిమిట్లు గొలిపేలా దర్శనమిచ్చారు.

సబయసాచి: ఈ సబయసాచి అనే డ్రెస్ ఒక్కసారైనా ధరించకుండా తన కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్స్ ను పూర్తి చేసుకోదు ఈ ఐశ్వర్య రాయ్. లేస్ వెల్ వెట్ బ్లాక్ కలర్ లెహంగా శారీ, దాని మీదు గోల్డ్ ఎంబ్రాయిడరీ శారీలో ఆశ్చర్య పరిచింది.

ఈ సారితో ఆమె 12 సార్లు కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో హాజరైనట్లయింది.

66 కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ గురించి రాజీవ్ మసంద్‌తో మాట్లాడుతున్న ఐశ్వర్య

లూజ్ హెయిర్, తక్కువ మేకప్‌తో చాలా అందంగా కనిపించింది.

ఐశ్వర్య స్మైల్ అదిరింది కదూ...

ఈ సారి కాన్స్ ఫిల్మ్ ఫెస్ట్‌కి ఐశ్వర్య తన కూతురుతో కలిసి హాజరైంది.



Click it and Unblock the Notifications