Latest Updates
-
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు! -
అంతర్జాతీయ యోగా దినోత్సవం స్పెషల్.. ఈ యోగాసనాలతో సంతానలేమి సమస్యలకు చెక్.! -
రిలేషన్ షిప్ పై త్రిప్తి డిమ్రి ఆసక్తికర వ్యాఖ్యలు..అది ఉంటే తప్ప వర్కౌట్ కాదంట..! -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం!
కేన్స్ 2వ రోజున రెడ్ కార్పెట్ మీద సందడి చేసిన సెలబ్రెటీల మీద ఒక లుక్కేయండి...
ఎప్పటి నుండో అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుకన్న కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రానే వచ్చింది. 66వ కాన్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ పెస్టివల్ ‘The Great Gatsby'అనే సినిమాతో ప్రారంభం అయింది. ఇటు బాలీవుడ్ అటు హాలీవుడ్ తో ప్రారంభమైన కేన్స్ ఫెస్టివల్ తొలి రోజు మన దేశం నుంచి బాలీవుడ్ తారలు అమితాబ్ బచ్చన్, విద్యా బాలన్, మల్లికా షెరావత్, సోనమ్ కపూర్, ఫ్రిదా పింటో....రెండ్ కార్పెట్‌పై నడిచి సందడి చేసారు. విద్యా బాలన్ ఈ సంవత్సరం తొలిసారిగా కాన్స్ ఫిల్మ్ పెస్టివల్‌కు హాజరైంది.
అంతే కాదు ఆమె ఇందులో జ్యూరీ మెంబర్ కూడా. విద్యా బాలన్ తో పాటు జూరీ మెంబర్లుగా హాలీవుడ్ స్టార్స్ నికోలస్ కిడ్మన్, అంగ్ లీ, క్రిస్టోఫ్ వాజ్, క్రిస్టిన్ ముంగూ, లైనేరామ్‌సే, నియోమి కవాసె, డేనియల్ ఉన్నారు. ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ప్రముఖ దర్శకుడు స్టీవెన్ స్పీల్‌బర్గ్ నేతృత్వం వహిస్తున్నారు. అమితాబ్ బచ్చన్ The Great Gatsby అనే హాలీవుడ్ చిత్రంలో ముఖ్యమైన అతిథి పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అమితాబ్ ఈ చిత్ర నటులు లియోనార్డో డికాప్రియో, టోబే మంగురె తదితరులతో కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.
కేన్స్ ఫెస్టివల్ మొదటి రోజున రెడ్ కార్పెట్ మీద సందడి చేసి అందమైన స్టైల్డ్ సెలబ్రెటీలను చూస్తుంటే చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది. అయితే రెండవ రోజు మెదటి రోజంతా ఆర్భాటంగా లేకపోయినా కేన్స్ ఆఢంబరాలకు తగ్గకుండానే ప్రారంభమైంది. రెండవ రోజున్ సోఫియా కొప్పోల ఎమ్మా వాట్సన్ నటించిన ‘బ్లీంగ్ రింగ్'యొక్క వరల్డ్ ప్రీమియర్ తో ప్రారంభమైంది. ఫోటో కాల్ , చిత్రం యొక్క ప్రకటనలు మరియు స్క్రీనింగ్ తో 2013కేన్స్ ప్రారభం అయింది.
ఎమ్మా వాట్సన్ కేన్స్ 2013 రెడ్ కార్పెట్ మీదకు ఎమ్మా వాట్సన్ ఎప్పుడు ఎప్పుడు నడుస్తుందా అని చూడటానికి చాలా మంది వేచి ఉన్నారు. ఒక సందర్బంలో ఎమ్మా తను ప్రస్తుతం జరిగే కేన్స్ 2013కి చాలా డిఫరెంట్ ఔట్ ఫిట్స్ వస్తానని ముందే చెప్పిన విషయాన్ని చాలా మందే గుర్తుంచుకొన్నట్లున్నారు. ఎదురుచూస్తున్న చిత్రం, బ్లింగ్ రింగ్, ఎమ్మా మరియు ఆమె తారాగనం కలిసి నటించిన కొన్ని ఆహ్లాదకరమైన సీన్స్ ను వీక్షించారు. ముదురు ఎరుపు రంగు దుస్తుల్లో ఎమ్మాక్రిస్టోఫర్ చిన్న అమ్మాయిలా అద్భుతంగా కనిపించారు.
బ్లింగ్ రింగ్ ప్రీమియర్ కాకుండా, ఇంకా జునో మరియు జోలి వంటి ప్రముఖులు కూడా హాజరయ్యారు. ఫ్రెడాఫింటో, విద్యాబాలన్, సోనమ్ కపూర్, లియా కెబేద్ మరియు థైసాఫార్మిగా ప్రిమియర్స్ కు హాజర్ అవ్వడానికి రెడ్ కార్పెట్ మీద నడిచి కొద్దిమంది ప్రముఖులు ఉన్నారు. మరి కేన్స్ 2013 రెండవ రోజున రెడ్ కార్పెట్ మీద సందడి చేసి సెలబ్రెటీల మీద ఒక లుక్కేయండి...

ఎమ్మా వాట్సన్: బ్లింగ్ రింగ్ ప్రీమియర్ ప్రదర్శించడానికి చానల్ కోచర్ గౌన్ లో రెడ్ కార్పెట్ మీద దర్శనమిచ్చారు. ఆఫ్ వైట్ సిల్క్ గౌన్ బ్లాక్ ఎంబ్రాయిడర్ టాప్ అద్భుతమైన లుక్ ను ఇచ్చింది.

సోనమ్ కపూర్: లోరియల్ బ్రాండ్ కు అంబాసిడర్ బాలీవుడ్ సెక్సీ సెలబ్రెటీ కేన్స్ 2013 రెండవ రోజున ప్రిన్సెస్ లా వేసవిలో అలరించారు. బొమ్మలాంటి మేకప్ ఫ్లవర్స్ తో తయారు చేసిన గౌన్ లో అద్భుతంగా రెడ్ కార్పెట్ మీద నడిచారు.

విద్యాబాలన్: విద్యాబాలన్ మొదటి రోజున అలాగే రెండవ రోజున కూడా తన సాంప్రదాయ దుస్తుల్లో సందడి చేశారు. మొదటి రోజున ముక్కు పుడక ధరించడం సోనమ్ కపూర్ అయితే రెండవ రోజున విద్యా వంతు. పుడకలో అద్భుతమైన స్మైలింగ్ తో అక్కడి వారిని పలకరించారు.

ప్రిడా ఫింటో: తను చెప్పిన విధంగానే ఫ్రిడా ఫింటో వెరైటీగా తన రైట్ అండ్ లెఫ్ లెగ్ కనిపించే విధంగా కట్స్ డిజైన్ చేసి సింకీ గౌన్ లో ఇలా దర్శనమిచ్చారు.

సోనమ్ కపూర్: సోనమ్ ఈ డ్రెస్ లో చూడటానికి చాలా అద్భుతంగా దేశీ లుక్ ను అంధించింది. ప్రిన్సెస్ లుక్ తర్వాత సోనమ్ స్టైలిష్ సాంప్రదాయ దుస్తులను ధరించింది.

లోరియన్ బ్రాండ్ అంబాసిడర్: ఫిదా మరియు సోనం ఇద్దరూ ఒక చిన్న మూమెంట్ తో ఒక అందమైన ఫోజులో ఫోటోలకు ఫోజులిచ్చారు.

పారిస్ హిల్టన్: బింగ్ రింగ్ ప్రదర్శన తర్వాత పారిస్ హిల్టన్ కూడా డెలివిజ్ఝే తో దర్శనమిచ్చారు.

క్రిస్టియన్ లుబోటిన్ తో కలిసి పారిస్: పారిస్ క్రిస్టియన్ లుబోటిన్ ను కలిసినప్పుడు తీయించుకొన్న ఫోటో.

బ్లింగ్ రింగ్ ఫోటో కాల్: ప్రీమియర్ ప్రదర్శనకు ముందు అందులో నటించిన తారమణులు ఇలా ఫోటోలకు ఫోజులిచ్చారు.



Click it and Unblock the Notifications