For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పండ్లలో ఎన్ని రుచులున్నా...మామిడి పండ్ల రుచే వేరయా...!

|

వేసవికాలం వచ్చిందంటే మామిడి పండ్ల రోజులు వచ్చినట్లే... అందుకే మామిడి పండ్లను సమ్మర్ స్పెషల్‌గా అభివర్ణిస్తారు. అంతేకాదు.. పండ్ల రాజా కూడా మామిడే. బంగారు రంగులో, నోరూరించే తీపితో ఎండాకాలానికే ప్రత్యేకంగా నిలిచే పండు మామిడి. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ ఇష్టపడే అమృత ఫలమిది. పచ్చిది కానీ, పండుగానీ ఏదైనా సరే 'ఆహా ఏమి రుచీ!' అనుకోకుండా ఉండలేరు. ఫలాల్లోనే రారాజుగా నిలిచిన మామిడిలో పోషక విలువలూ కూడా ఎక్కువే. న్యూట్రీషినల్ విలువలున్న మామిడి పండ్లతో ఎన్ని రకాల వంటలు చేయొచ్చో.

మామిడికాయలు ఎక్కువగా వచ్చే సీజన్‌లో మామిడి ఒరుగులు చేసుకుని, తినాలనిపించినప్పుడు పప్పులో వేసుకుని వండుకోవచ్చు. ఇక పచ్చళ్లలోనైతే, మామిడి ముక్కల పచ్చడి, మాగాయ, ఆవకాయ, తొక్క పచ్చడి, అల్లం వెల్లుల్లి, కొబ్బరి వేసి కూడా పచ్చళ్లు పెడతారు. మరి కొంతమంది మామిడికాయ నిల్వ పచ్చడిలో బెల్లం కూడా వేస్తారు. ఒక్కొక్కళ్లది ఒక్కో రుచి! చద్దన్నంలో ఆవకాయ బద్ద, పెరుగన్నంలో మామిడి పండు ముక్కలు వేసుకుని తింటుంటే ఆ మజానే వేరు. ఇక వేడి వేడి అన్నంలో ముద్దపప్పు, నెయ్యి, ఆవకాయ కలిపి తింటే... ఆ రుచి వర్ణించడానికి మాటలు చాలవు. ఇవేనా! మామిడిపండుతో హల్వా, ఐస్‌క్రీములు కూడా తయారు చేస్తారు. ఇక షర్బత్‌లు, జ్యూస్‌ల సంగతైతే సరేసరి. రెడీమేడ్‌గా ఫ్రూటీలు, మాజాలు ఉండనే ఉన్నాయి. ఇన్ని రకాలుగా ఉపయోగపడి, నోరూరించే మామిడిని ఇష్టపడని వాళ్లుంటారా?!

మార్కెట్లో వివిధ రకాల మామిడి పండ్లు అందుబాటులో ఉన్నప్పుడు, మీరు ఏ పండ్లు మంచివి? ఏవి రుచిగా ఉంటాయని గందరగోళం చెందవచ్చు. డిఫరెంట్ వెరైటీ మామిడి పండ్లతో ఇలా చాలా మంది సాధారణంగా పొరబడుతుంటారు. వివిధ రకాల మామిడి పండ్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.

మామిడి పండ్లలోని రకాలు గురించి మీకు తెలియకపోతే? నేను చెబుతాను వినండి. ప్రపంచ వ్యాప్తంగా 20-30 రకాల మామిడి పండ్లున్నాయి. అయితే మన ఇండియాలో మామిడిలో ఎన్ని రకాలున్నా బంగినపల్లి రుచికి ప్రత్యేక స్థానం ఎప్పుడూ ఉంటుంది. ఇంకా వీటిలో నీలం, రసాలు, చందూరా, రుమానియా, రాజమాను, పంచదార కలశ, కోలంగోవా, అల్పోన్సో, బదామీ, దుస్సేరీ, సువర్ణ, రేశ, ఇమాం పసంద్‌, చిలకముక్కు మామిడి, బెంగళూరు మామిడి, మల్గోవ... ఇలా ఎన్ని రకాలో. తన రుచితో రాజులను, చక్రవర్తులను సైతం ఆకట్టుకున్న ఘనత మామిడి పండ్లది. ఈ సీజన్ లో మరి మీకూ డిఫరెంట్ మామిడిపండ్లను తిని రుచిచూసి, ఆనందించాలనుందా..అయితే ఇంకెందుకు ఆలస్యం ఈ క్రింది మామిడి పండ్ల లిస్ట్ ను ట్రాక్ చేయండి...

అల్ఫోన్సో:

ఈ ఖరీదైన వైరైటీ మామిడి పండ్లు అఫోన్స్ డే అల్బుక్యుర్క్ అని పేరు పెట్టబడింది. ఇంకా వీటని aphoos లేదా hapoos అని పిలుస్తారు.

బదామి:

బదామి ఇండియన్ మ్యాంగో అద్భుతమైన రుచిగా, స్వీట్ గా మరియు గుజ్జుగా ఉంటుంది. ఈ మామిడి పచ్చివి మరియు పండువి మరియు షేక్స్ రూపంలో మనకు అందుబాటులో ఉంటాయి.

బంగినపల్లి:

పసందయిన పండు.ఆంధ్రుల అభిమాన ఫలం ,కోత పండు. సాధారణంగా ఈ పండ్లను హిందీలో బేనిషా అంటుంటారు. ఈ వెరైటీ మామిడి పండ్లు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ లో పండిస్తారు.

Dussehri:

ఈ టైప్ మామిడి పండ్లు బాగా పండినప్పుడు పూర్తి పసుపు వర్ణంలోనికి మారుతాయి. మరియు ఈ పండ్ల యొక్క అవటర్ స్కిన్ చాలా మందంగా ఉంటుంది. ఇది చాలా తియ్యంగా ఉంటాయి.

కేసర్:

మామిడి పండ్లలో ఇది చాలా పాపులర్ అయినటువంటి పండ్లు. ఇవి పచ్చివిగా ఎక్కువగా ఉపయోగిస్తారు. ముఖ్యంగా ఆమ్ రస్(మమామిడి రసాలను)ఈ వెరైటీ మామిడి పండ్లతోనే తయారు చేస్తారు. ఈ కేసర్ మామిడి పండ్లు అహ్మాదాబాద్ నుండి దిగుమతి చేయబడుతాయి. ఇంకా వీటిని గుజరాత్ కేసర్ మ్యాంగ్ అని కూడా అంటుంటారు.

మల్గోబా:

ఈ వెరైటీ మామిడి పండ్లు పచ్చిగా ఉన్నప్పుడు చాలా పుల్లగా ఉంటాయి కాబట్టి వీటిని తినలేం. వీటితో ఊరగాయలు, మాగాయలు మరియు మ్యాంగోషేక్స్ ను ఎక్కువగా తయారు చేయవచ్చు. ఇదీ కోత పండే కాని ,ఎరుపు ఆకు పచ్చ ,పసుపు వర్ణాలు కలిపి వుంటుంది . తీపిగా,రుచిగా వుంటుంది.కోత పండు.

మల్లిక:

ఈ మామిడి పండ్లు ఇండియాలో కాసేటివే అయినా..ఇవి నీలం మరియు దుస్సేరికి హైబ్రీడ్ పండ్లు గా ఉంటాయి.

రస్పురి:

ఈ పండ్లు చూడటానికి ఓవెల్ షేప్ లో ఉంటాయి. మరియు వీటి కలర్ రాడిష్ ఎల్లో కలర్ ను కలిగి ఉంటాయి. ఈ పండ్లు ఇండియాలో సౌంత్రన్ స్టేట్స్ లో చాలా పాపులర్.

సిందూర:

పసుపు పచ్చవర్ణంలో ఉండే ఈ మామిడి పండ్లు చాలా స్వీట్ గా పల్పీగా ఉంటాయి.

హిమాం పసందు:

పేరెందుకు వచ్చిందో కాని అందరికీ పసందయినదే, కోత పండు.

పెద్ద రసం:

చిన్న వాళ్ళనుండి పెద్ద వాళ్ల వరకు యీ పండంతే పడి చస్తారు.కోతకు పనికి రాదు ,రసం జుర్రుకోవల్సిందే. చిన్న రసం : మహాధ్భుత ఫలం పుట్టిన ప్రతి వాడు తిని చావ వలసిదే ఒక్క సారయినా.ఇదీ రసం జుర్రుకొనే పండే.పెరుగు అన్నం లోకి మహా రంజయిన పండు.

 చెరుకు రసం :

ఇదీ రసం కోవలోనిదే అధ్భుతమైన రుచి.

కలక్టరు మామిడి:

ఇది కూదా కోత పండే.

చిత్తూరు మామిడి :

ఇది అన్ని రకాల మామిడి పళ్ళు అయిపోయిన తరువాత అందుబాటులోకి వస్తుంది.త్వరగా చెడి పోవు.ఇది కోత కాయ. పచ్చిది కూడా తియ్యగా వుంటుంది.

తెల్ల గులాబి :

ఇదీ కండ కలిగి ఆవకాయకు బాగా పనికొచ్చే రకమే. పండితే తియ్యగా వుంటుంది.

English summary

Different Types Of Mangoes In India

We all wait for the summers to come. It is not just for the craze to hit the beach, or dip into the swimming pool, but also to enjoy the fruit of the season, Mangoes! Mangoes are entitled as the King of all fruits. The juicy fruit can be consumed raw or made into delicious smoothies. There are numerous mango recipes that can be prepared using this seasonal fruit.
Desktop Bottom Promotion