Latest Updates
-
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.! -
గ్యాస్, అసిడిటీకి తక్షణమే చెక్ పెట్టే అద్భుతమైన వాము పరాఠా.. ఎలా చేయాలో తెలుసా? -
తొలి ఏకాదశి తేదీ, తిథి, పూజా విధానం, ఉపవాసం ఎలా విరమించాలి.. పూర్తి వివరాలు.! -
టమాటా తింటే కిడ్నీలో రాళ్లు వస్తాయా? యూరాలజిస్ట్ చెబుతున్న అసలు నిజం ఇదే! -
వృశ్చికంలోకి చంద్రుడు.. రానున్న మూడు రోజులు ఈ రాశుల వారి గోల్డెన్ డేస్.! -
హిమాచల్ ప్రదేశ్ ఫేమస్ కధి పకోడి..వేడి వేడి అన్నంతో తింటే అమృతమే..ఈజీగా చేసుకోండిలా.. -
నాన్‌వెజ్ రుచిని మరిపించే మష్రూమ్ కర్రీ.. గ్రేవీ ఇలా చేశారంటే అద్భుతః అనాల్సిందే.! -
మీరు ఏ వంట నూనె వాడతారు.. ఆరోగ్యానికి ఎక్కువ ఏది మేలు చేస్తుందో తెలుసా.? -
ఆన్లైన్లో విపరీతంగా ఆభరణాలు కొంటున్నారా.. 'మెరిసే' నగలతో మోయలేని ఆరోగ్య సమస్యలు.! -
మీ భాగస్వామి ఈ విషయాల్లో మీకు దూరంగా ఉంటున్నారా.. ఈ సంకేతాలతో చాలా డేంజర్.!
హాలిడేస్:తిరిగి ఉత్సాహంగా ఆఫీస్ కు వెళ్ళే టిప్స్&ట్రిక్స్
సాధారణంగా బిజీ షెడ్యూల్స్ తో పనిచేసే ఉద్యోగస్తులకు ఒక చిన్నలేదా సుదీర్ఘ విరామం దొరికితే చాలు తిరిగి వారు సాధారణ జీవితం పొందడానికి నిజంగా కష్టంగానే భావిస్తారు. సెలవుల తర్వాత ఆఫీస్ కు రావాలంటే బద్దకించడం చాలా మందిలో ఉన్న అలవాటు. కొన్నిసార్లు విరామం తర్వాత ఆఫీసుకు తిరిగి వెళ్ళాలంటే చాలా మందికి సోమరితనం, భయపడటం మరియు కొన్నిసందర్భాల్లో ఒత్తిడిని గురైయ్యారన్న అనుభూతిని కలిగి ఉంటారు. వారంతంలో వచ్చే చిన్నవిరామ సెలవులు కూడా థ్రిల్లింగ్ మరియు ఆనందం కలిగించేవిగా ఉంటాయి. అయితే , వీకెండ్ హాలీడే తర్వాత, సోమవారం తిరిగి ఆఫీసులో పరిస్థితి ప్రభావం ఎలా ఉంటుందో మనకు తెలుసు!
వీకెండ్ హాలిడేస్ కు, పబ్లిక్, లేదా గౌర్నమెంట్ హాలిడేస్ కలిసి వచ్చినప్పుడు ఆ ఆనందం అంతా ఇంతా కాదు. ఉద్యోగస్తులకు మరింత ఉత్తేజితులను చేస్తుంది. అయితే, హాలీడేస్ ముగుస్తున్నసమయం దగ్గరపడుతుండటంతో, మనం అందరమూ బ్లూస్ పొందుతాం. ఒక దీర్ఘ లేదా ఒక చిన్న విరామం తర్వాత తిరిగి ఆఫీస్ కు చేరడానికి మనకు నీరసమైన అనుభూతి కలిగిఉన్నామన్న విషయం స్పష్టమౌతోంది. మీరు నార్మల్ లైఫ్ స్టైల్ తో తిరిగి ఆఫీసుకు వెళ్ళడానికి సిద్ధంగా లేకపోతే, హాలిడే బ్రేక్ తర్వాత తిరిగి ఆఫీసుకు కొత్త లైఫ్ స్టైల్ తో వెళ్ళడానికి ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి. వాటిని పరిశీలించండి..

1. ఒకటి రెండు రోజుల ముందు షాపింగ్ చేయండి: హాలిడే బ్రేక్ తర్వాత, తిరిగి ఆఫీస్ కు వెళ్ళడానికి ఇది ఒక ఉత్తమమైన మార్గం. ఆఫీసుకు ధరించి వెళ్ళడానికి మంచి దుస్తులును, లేదా మీకు ఇష్టమైన వస్తువులను కొత్తగా కనిపించేలా ఉండే వాటిని కొనుగోలు చేయండి. ఆఫీస్ కు వెళ్ళే రోజు ఇలా కొత్తవాటిని ధరించడం వల్ల కొంత ఉత్సాహం మీలో నింపుడమే కాదు, హాలిడేస్ తర్వాత మీరు ఆఫీస్ కు వెళ్ళలనే నిరుత్సాన్ని, సోమరితనాన్నిఅధిగమించడానికి సహాయపడుతుంది.
2. మృదువుగా..మరింత సున్నితంగా: సెలవులు ఆయిపోతున్నాయనగానే మీరు చాలా సౌకర్యవంతంగా ఉండాలి. కాబట్టి, హాలిడే బ్రేక్ తర్వాత మీరు తిరిగి ఉద్యోగంలో చేరడానికి శారీరకంగా మరియు మానసికంగా సౌకర్యవంతంగా ఉండేలా, మిమ్మల్ని మీరు సిద్దం చేసుకోవడం వల్ల, విరామం తర్వాత మొదటి రోజున ఉత్సాహంగా పనిని స్వాగతం పలకడానికి సిద్దంగా ఉండాలి.
3. మెయిల్స్ ను చెక్ చేయాలి: విరామ సమయాల్లో చాలా మంది ఎక్కువగా మెయిల్స్ లేదా మెసేజ్ లను తనిఖీ చేయడం చాలా మంది అలవాటు ఉంటుంది. హాలిడేస్ లో కూడా అప్పుడప్పుడు మెయిల్స్ లేదా మెసేజ్ లను చెక్ చేస్తూ ఉండటం వల్ల మీకు చాలా మంచిది. ఇలా చేయడం వల్ల విరామం తర్వాత మీరు బద్దకంగా మారే అవకాశం ఉండదు. మెయిల్స్ చెక్ చేయడం, ఆఫీస్ వర్క్ చేయడం వల్ల ఆఫీస్ కు వెళ్ళాలనే మూడ్ ను తిరిగి మీలో ఉత్సాహాన్ని నింపుతుంది.
4. నిద్రించే సమయం: బాగా నిద్రపోవడానికి ఈ రోజే చివరి రోజు అని మీరు హాలీడే చివరి రోజున మీరు అనుకోవచ్చు. సరే, ఈ ఆలోచన బాగుంది కానీ, ఈ విషయం మీలోనీరసం మరియు తదుపరి రోజు సోమరితనం అనిపించవచ్చు. అధికంగా నిద్రించడం వల్ల ఆరోగ్యానికి మంచిది కాదు మరియు ఆరోజంతా మిమ్మల్ని సోమరితనంగా మరియు అలసటకు గురిచేస్తుంది. కాబట్టి మీ నిద్రించే సమయాన్ని షెడ్యూల్ చేసుకొని, ఆఫీస్ కు వెళ్ళి, ఉత్సాహంగా మరియు ఫ్రెష్ గా కనబడండి.
5. సహోద్యోగులతో : మీరు హాలీడే బ్రేక్ లో ఉండి మరుసటి రోజున మీరు ఉద్యోగంలో చేరేటప్పుడు, మీ సహోద్యోగులతో కొత్తవిషయాలను, ముఖ్యవిషయాలను అడిగి తెలుసుకోవండి. తదనుగుణంగా, మీరు జాయిన్ అయ్యే మొదటి రోజుకు ప్లాన్ చేసుకోండి. ఎవరైతే ఇటువంటి ప్లాన్స్ ను ముందుగానే ఏర్పాటు చేసుకొంటారు, వారు తక్కువ ఒత్తిడిని కలిగి ఉండటమే కాదు, ఉద్యోగం మీద ఎక్కువగా కేంద్రీకరించబడి ఉంటారు. !
హాలిడే బ్రేక్ తర్వాత, ఆఫీస్ కు వెళ్ళడానికి ఈ కొన్ని మార్గాలున్నాయి. వీటిని మీరు పాటించినట్లైతే మీరు బ్రేక్ తర్వాత కూడా ఉత్సాహంగా పనికి వెళ్ళడానికి అనుకూలంగా, సౌకర్యవంతంగా ఉంటుంది.



Click it and Unblock the Notifications