Latest Updates
-
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు! -
అంతర్జాతీయ యోగా దినోత్సవం స్పెషల్.. ఈ యోగాసనాలతో సంతానలేమి సమస్యలకు చెక్.! -
రిలేషన్ షిప్ పై త్రిప్తి డిమ్రి ఆసక్తికర వ్యాఖ్యలు..అది ఉంటే తప్ప వర్కౌట్ కాదంట..! -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.?
హాని కలిగిస్తాయని తెలిసినా.. మళ్ళీ మళ్ళీ చేస్తారెందుకూ....!
సాధరణంగా ప్రతి మనిషికి కొన్ని హ్యాబిట్స్(అలవాట్లు ఉంటాయి)అందులో మంచి అలాట్లు లేదా చెడ్డ అలవాట్లు రెండూ ఉంటాయి. ఉదాహరణాకు అతి తక్కువ సమయంలో భోజనం చేయడం అనేది మంచి అలవాటు, ఆందోళనగా ఉన్నప్పుడు గోళ్ళు కొరకడం అనేది ఒక చెడు అలవాటు. అటువంటిదే మరొకటి, రెగ్యులర్ గా ప్రొగత్రాగడం, మద్యం సేవించడం మరియు కొన్ని అనారోగ్యకరమైన ఆహారాలను తినడం ఇవన్నీ కూడాను చెడు అలవాట్లే. ఈ చెడు అలవాట్లన్నీ కూడాను ఆరోగ్యానికి హానికలిగించేవే.
ఇటువంటి అలవాట్లను మానుకోవడం కోసం కొన్నినిర్ణయాలు తీసుకొన్న తర్వాత, కూడా మనం తిరిగి ప్రతి రోజూ మనకు తెలియకుండానే ఏదో ఒక సందర్భంలో తిరిగా పునరావృతం అవుతుంటాయి. మన ప్రతి దినచర్యలో కొన్ని పనులు రోజూ చేస్తున్నాకూడా వాటిని మరచి పోతుంటాం. ఉదాహరణకు రోజూ మనం ఉపయోగించే పోన్ నెంబర్లు లేదా పేర్లను మనం తరచూ మరచిపోతుంటాం. ఇది ప్రతి ఒక్కరిలో జరిగే కామన్ హ్యాబిట్. అటువంటి మరికొన్ని కామన్ హ్యాబిట్స్ మనకు చెడు కలిగిస్తాయని తెలిసినా కూడా మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసే అలవాట్లేంటో ఒకసారి చూద్దాం...

చేతులు శుభ్రం చేసుకోకపోవడం: ఈ అలవాటు తరుచూ చాలా మందికి ఉండకపోవచ్చు. ఇది అనారోగ్యకరం అని తెలిసినా కూడా ఇప్పడే కదా కడిగాం, ఏం అయ్యుండదులే అనే నమ్మకం. కాబట్టి చేతుల్లో దాగిఉన్న బ్యాక్టీరీయ, దుమ్ము, ధూళి, క్రిములు వంటి శరీరంలోని ప్రవేశించకూడదనుకుంటే చేతులను శుభ్రం చేసుకోవాలి. చాలా మంది బద్దకస్తులు తినడానికి ముందు కూడా చేతుల కడగరు. ఇలా చేయడం వల్ల హాని కలుగుతుందని తెలిసీ కూడా మరుసటి రోజు తిరిగి అలానే ప్రవర్చిస్తారు. కాబట్టి మంచి అలవాటును వదిపెట్టకండి మీ రెగ్యులర్ దినచర్యగా మార్చుకోండి.

గోళ్ళు కొరకడం: గోళ్ళు కొరకడం చెడు అలవాటని మనందరికీ తెలిసిన విషయమే. అయితే మనం ఎప్పుడేతై టెక్షన్ కు గురియైనప్పుడు గోళ్ళను కొరకడం అలవాటు చేసుకొంటారు. దాన్ని అలాగే కంటిన్యూ చేసి పూర్తిగా చిగుళ్ళ వరకూ తినేస్తుంటారు. అలా చేయడం వల్ల గోళ్ళలో ఉన్న కంటికి కనిపించని సూక్ష్మిక్రిములు పొట్టలోకి చేరి జీవక్రియలకు అంతరాయం కలిగిస్తాయి. దాంతో జీర్ణ సంబంధిత జబ్బులు మొదలవుతాయి.

ఉతకని దుస్తులు ధరించడం: చాలా మందికి ఇటువంటి అనారోగ్యకరమైన రోజువారి అలవాటు ఉంది. కొంత మంది నిన్నే కదా వేసాం ఈ రోజు వేసుకుంటే ఏం కాదులే అనే ధీమాను వ్యక్తం చేస్తారు. అదే అలవాటుగా మార్చుకుంటారు. ముఖ్యంగా జీన్స్ విషయంలో వాటిని ఉతకలేకో లేదా త్వరగా మాసిపోవనో ఏదో ఒక కారణం చేత ఇలా చెడు అలవాటు రెగ్యులర్ గా చేస్తుంటారు. ప్రతి రోజూ ఉతికిన దుస్తులను ధరించడం వల్ల కొన్ని రకాల చర్మ అలెర్జీలను మరియు అంటువ్యాధులను నివారించవచ్చు.

లేటుగా నిద్రపోవడం: సరైన నిద్రలేకపోవడం వల్ల మన ఆరోగ్యానికి హాని కలుగుతుందని తెలిసీ కూడా ప్రతి రోజూ అదే విధంగా లేట్ గా నిద్రకు ఉపక్రమిస్తుంటారు. దాంతో మరసుటి రోజు ఉదయం నిద్రలేవడానికి బద్దకిస్తుంటారు. ఒక వేళ లేచినా ఆరోజంతా బద్దకంగా గడుస్తుంది. కాబట్టి ప్రతి రోజూ వేళకు నిద్రపోవడం చాలా ఆరోగ్య కరం. అందం.

పేర్లను మర్చిపోవడం: చాలా మందికి వారికి తెలసిన వ్యక్తులు పేర్లు మరియు ఫోన్ నెంబర్లను మర్చిపోయే అలవాటు ఉంటుంది. కాబట్టి ఇటువంటి అలవాటు తిరిగి పునరావతం కాకూడదనుకుంటే ముఖ్యమైన పేర్లు, లేదా నెంబర్లను ఒక డైరీలో లేదా, పేపర్ మీద వ్రాసి ఉంచుకోవడం చాలా అవసరం.

తల దువ్వకపోవడం: ముఖ్యంగా పురుషులు వారి కేశ సంరక్షణలో చాలా బద్దకస్తులు. కొంత మంది ఆ కురుచ జుట్టును దువ్వుకోవడానికి కూడా బద్దకిస్తుంటారు. జుట్టు రాలిపోవడానికి ఇదొక చెడు అలవాటుగా గుర్తించి ఎప్పటికప్పుడు తలదువ్వుకొనే మంచి అలవాటు ప్రయత్నించండి.

తరచూ పెదాలను తడపడం: పొడిబారిన లేదా తడి ఆరిన పెదాలు నిజంగా చిరాకును కలిగిస్తాయి. చాలా మంది నాలుకతో వారి పెదాల మీద తడి చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల పెదాలు పొడిబారి, పెదాలు నల్లగా మారే అవకాశం ఉంది. కాబట్టి ఈ చెడు అలవాటును మానుకోవడం మంచిది.

కాళ్ళు ఊపడం: ఇది మరొక చెడు అలవాటు. చాలా మందికి ఈ అలవాటు ఉంటుంది. ఎదుటి వారికి చాలా ఇబ్బంది కలిగిస్తుంది. కొంత మంది ఒత్తిడి వల్ల లేదా అలవాటు వల్ల అలా చేస్తుంటారు. అయితే అది చూసే వారికి చాలా ఇబ్బంది కరంగా ఉంటుంది. కాబట్టి అలవాటును మార్చుకొంటే మంచిది.



Click it and Unblock the Notifications