Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
వేడి వాతావరణంలో పర్వతారోహణ కోసం ఎటువంటి దుస్తులు ధరించాలి!
కఠినమైన మైదానాలు, కొండలు, తీవ్రమైన వాతావరణ పరిస్థితులు లేదా ఒక రోజు కంటే ఎక్కువ సమయం పట్టే పర్వతారోహణ వంటి తీవ్రమైన సవాళ్ళు ఇమిడి ఉంటాయి. ఇందుకోసం మీరు బయలుదేరేముందు ఇటువంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండటం ముఖ్యం. మీరు సరైన దుస్తులను కలిగి ఉండకపోతే ఈ విహార యాత్ర మీకొక పీడకలగా మారవచ్చు.
సూచనలు:
1. ఒక పొట్టి చేతుల చొక్కా మీద ఒక పొడవు చేతుల చొక్కాను ధరించండి. రెండూ తక్కువ బరువు, వదులుగా, లేత రంగుతో సూర్యకిరణాలు పరావర్తనం చెందేటట్లు ఉండాలి. వాతావరణం వేడిగా ఉన్నందున మీరు నడకలో చాల వరకు పొట్టి చేతుల చొక్కాతోనే గడుపుతారు. అయితే సూర్యుని నుండి కీటకాల నుండి పొడవు చేతుల చొక్కా మిమ్మల్ని రక్షిస్తుంది. రాత్రి వేళ్ళల్లో ఉష్ణోగ్రత తక్కువగా ఉన్నప్పుడు కూడా మీకు పొడవుచేతుల చొక్కా సహాయంగా ఉంటుంది. సింథటిక్ మెటీరియల్ తో తయారు చేసిన చొక్కాలను ఎంపిక చేసుకొంటే అవి ఊలు లేదా కాటన్ కంటే త్వరగా ఆరుతాయి.
2. లేత రంగులో ఉండే పొడవైన ప్యాంట్లు లేదా పొట్టివి సూర్యుని ఎండనుండి రక్షణ కోసం ధరించండి. ఒక వేళ అది చలి కాలమైతే మీ కాళ్ళను కాట్ల నుండి రక్షించుకోవడానికి ప్యాంట్లను వాడండి. లేదంటే ఈ వాతావరణానికి షార్ట్ లు ఎంతో తగినవి. మోకాళ్ళ చుట్టూ పైకి మడచి పొట్టిగా చేయదగినవి ఉత్తమమైన ప్యాంటులు ; నైలాన్ పాప్లిన్, వంటి త్వరగా ఆరే సున్నితమైన తక్కువ బరువు గుడ్డతో తయారై అనేక పరిస్థితులకు పని చేసేవి.

3. హైకింగ్ బూట్లు, గాలి ఆడే మేజోళ్ళు ధరించండి. వేడి వాతావరణంలో హైకింగ్ కోసం ప్రత్యేకంగా తయారైన నైలాన్ మేజోళ్ళను కొనండి. వాటర్ ప్రూఫ్ బూట్లు గాలి బాగా ఆడనివ్వవు ; మీ హైకింగ్ లో నీరు అడ్డం వచ్చే పనిలేక పోతే మీరు వీటిని దూరంగా ఉంచండి.
4. వెడల్పాటి అంచులు గల టోపిని ధరించండి. గాలి ఆడే సింథటిక్ పదార్ధాల్తో తయారైనా లేత రంగు టోపిని ఎంపిక చేసుకోండి. హైకింగ్ లో మీ శరీరంలోని భాగాలలో మీ తలే సూర్యుని వేడికి కాలడానికి సులువుగా ఉంటుంది, అందువల్ల దీనిని తప్పనిసరిగా కాపాడుకో౦డి.
చిట్కాలు & హెచ్చరికలు
ఒక వేళ వాతావరణంలో తడి ఉంటె తక్కువ బరువైన వర్షపు జాకెట్ ను మీ వీపుకు కట్టుకొండి. తగినంత నీటిని, సరుకులను కల్గి ఉండటం, తోడుగా ఎవరైనా ఉండటం, మీ తోటివారికి మీరు ఎక్కడికి వెళ్తున్నారో ఎప్పుడు తిరిగి వస్తారో తెలియ జేయడం వంటి సురక్షితమైన హైకింగ్ సూచనలను ఎల్లప్పుడు పాటించండి.



Click it and Unblock the Notifications