Latest Updates
-
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి! -
ఎండల తీవ్రత: ఢిల్లీ స్కూళ్లలో 'వాటర్ బెల్'.. మీ పిల్లలను వడదెబ్బ నుంచి కాపాడుకోవడం ఎలా?
ఐఐజెడబ్ల్యు షోస్టాపర్స్ గా రానా, కాజల్ అగర్వాల్
ఇండియ ఇంటర్నేషనల్ జువెలరీ వీక్ (ఐఐజెడబ్ల్యు)2013 రెండవ రోజున, మరో అద్భుతం.!ఎందుకంటే మోని అగర్వాల్ తన డిజైన్ జువెలరీలతో అద్భుత ప్రదర్శన ఇచ్చారు . గతంలో నిధి మరియు కరణ్ డిజైన్ ఆభరణాలు చాలా ట్రెండీ గా ఉన్నాయి. కానీ ప్రస్తుతం ఆ చాన్స్ మోనీ అగర్వాల్ దక్కించుకున్నారు.
మోని అగర్వాల్ డిజైన్ చేసిన కొన్ని క్లిష్టమైన ఆభరణాలు ఐఐజెడబ్ల్యు 2013ర్యాంప్ మీద ప్రదర్శించారు. అందులో ముఖ్యంగా ముత్యాలు, వజ్రాలు మరియు బంగారు ఆభరణాలలకు సృజనాత్మకతతో తయారు చేయబడ్డాయి. అటువంటి మైండ్ బ్లోయింగ్ ఆభరణాలను ర్యాంప్ మీద కొందరు మోడల్స్ తో పాటు, గ్రేట్ అండ్ టాప్ సెలబ్రెటీలు కూడా ప్రదర్శించారు. మోనీ అగర్వాల్ కేవలం నెక్ లెస్, చెవి పోగులు, బ్రాస్లట్ మరియు మాంగ్ టిక్కా వంటి వాటికి పరిమితం కాలేదు. తన డిజైన్లలో కమర్ బంద్ తో డిజైన్లలో మోనీ అగర్వాల్ సృజనాత్మకతను చూడవచ్చు. ఇంకా ముత్యాలతో తయారు చేసిన రింగ్ బ్రాస్లెట్ మరియు రాళ్ళ ఆభరణాలను కూడా ఐఐజెడబ్ల్యు 2013 లో చూడవచ్చు.
మోనీ అగర్వాల్ డిజైన్ చేసిన అద్భుతమైన ఆభరణాలను, టావుడ్ లో ప్రముఖ సెలబ్రెటీలైన రానా దగ్గుబాటి, కాజల్ అగర్వాల్ మరియు తాప్సీ వంటివారు ధరించి, ఐఐజెడబ్ల్యు 2013 ర్యాంప్ మీద ప్రదర్శణ ఇచ్చారు. ముఖ్యంగా ఈ షోలో తాప్సీ బ్రైడల్ లుక్ తో చాలా అద్భతంగా నిలిచింది. ఆమె ధరించిన భారీ ఆభరణాలే ఆమెకు అంతటి ఆకర్షణను కల్పించి, ఒక యువరాణిలా కనబడేలా చేసింది. మరో పక్క కాజల్ అగర్వాల్ ఒక కొత్త లుక్ తో మోడ్రన్ పెళ్ళికుమార్తెలా కనిపించింది. కాజల్ అగర్వాల్ స్ట్రాప్ లెస్ బాల్ రూమ్ గౌన్ లో చాలా సెక్సీగా కనిపించింది. మరి వారు ధరించిన మోనీ అగర్వాల్ కలెక్షన్స్ ను ఐఐజెడబ్ల్యు ర్యాంప్ మీద ప్రదర్శనలు మీరూ చూడాలనుకుంటున్నారా. మరి అయితే ఇంకెందు ఆలస్యం ఈ క్రింది వాటిని పరిశీలించండి...

డైమండ్ అండ్ రూబీ:
గత రెండు రోజులుగా డైమండ్ మరియు రూబీ నెక్ లెస్ లను ఐఐజెడబ్ల్యు ర్యాంప్ మీద చూస్తున్నాం. కానీ, ఈ రెండు రోజుల ప్రదర్శనలో ముత్యాలు మరియు గోల్డెన్ కమర్ బంద్ కంటే అద్భుతంగా నిలిచాయి డైమండ్ అండ్ రూబీ ఆభరణాలు.

స్టెప్ బై స్టైప్ ముత్యాల హారం:
ర్యాంప్ మీద ప్రదర్శణగా నిలబడ్డ మోడల్ ధరించిన స్టెప్ ముత్యాల హారం, ముత్యాల హారం ప్రతి స్టెప్ లో రూబీ డాలర్లు చూస్తుంటే ఒక రాయల్ టచ్ ఇచ్చిన విధంగా ఉంది. నెక్ లెస్ తో పాటు ముత్యాలతో తయారు చేసిన బ్రాస్లెట్ కూడా అద్భుతంగా ఆకట్టుకుంటున్నది.

జుమ్కాస్(jhumkas):
ఐఐజెడబ్ల్యు2013 ర్యాంప్ మీద మోడల్స్ ధరించిన జుమ్కాలు. సాప్రధాయంగా ఉన్న ఈ జుమ్కాలు చాలా ముచ్చటగా ఉన్నాయి. ముత్యాలతో తయారు చేసిన హారంకు మ్యాంచింగ్ గా తయారు చేశారు.

డైమండ్ మరియు పచ్చ రాయితో పొదిగిన రాణి హారం:
ఇది చోకర్ నెక్ లెస్. దీన్ని చూస్తుంటే రాణీ హారంలా అనిపిస్తుంది. ఎందుకంటే ఒక పెద్ద పచ్చరాయి సెంటరాఫ్ అట్రాక్షన్ గా మద్యలో చుట్టూ డైమండ్స్ తో డిజైన్ చేయబడి ఉన్నాయి.

డైమండ్ డ్రాప్ నెక్ లెస్:
చోకర్ డైమండ్ నెక్ లెస్. డైమండ్స్ తోనే పూర్తింగా డిజైన్ చేయడం వల్ల చాలా ప్రకాశవంతంగా మెరుస్తున్నది.

డైమండ్ మరియు ముత్యాలతో డిజైన్ చేసిన నెక్ లెస్:
మీరు కూడా ఇలా డైమండ్ మరియు ముత్యాల కాంబినేషన్ లో ఆభరణాలు ఇష్టమైతే ఇలా చేయించుకోవచ్చు. మోడల్ ధరించిన మ్యాచింగ్ భారీ చెవిపోగులు కూడా ముత్యాలు డైమండ్స్ తో తయారుచేసినవే.

డైమండ్, ముత్యాలు మరియు రూబీ నెక్ లెస్:
ఐఐజెడబ్ల్యు 2013లో ఒక అద్భుతమైన ప్రదర్శనలో ఇదికూడా ఒకటిగా నిలిచిన మోని అగర్వాల్ డిజైన్ ఆభరణాలు.

కాజల్ అగర్వాల్:
ఐఐజెడబ్ల్యు 2013 షోస్టాపర్ గా నిలిచిన స్టార్ సెలబ్రెటీ, మోనీ అగర్వాల్ బెస్ట్ డిజైన్డ్ ఆభరణాలతో ఇలా ర్యాంప్ వాక్ చేశారు. డైమండ్ చోకర్ నెక్ లెస్ తో పాటు, ఒక భారీ ఇయర్ రింగ్స్ కూడా అద్భుతంగా ఆకట్టుకుంటున్నాయి.

తాప్సీ పన్ను:
ఈ యాక్టర్స్ చూస్తుంటే సాంప్రదాయ పెళ్ళి కుమార్తెలా కనబడుతోంది. తాప్సీ భారీ ఆభరణాలు అంటే డైమండ్ రాణి హారం, స్టెప్డ్ ముత్యాల హారం, రింగ్ బ్రాస్లెట్ మరియు ముత్యాలతో అలంకరించిన హెయిర్ ఆభరణం చాలా అద్భుతంగా ఆకట్టుకున్నది.

రానా దగ్గుబాటి:
ఐఐజెడబ్ల్యు 2013 లో మోనీ అగర్వాల్ కలెక్షన్స్ తో ర్యాంప్ మీద ఒక అందమైన యాక్టర్ రానా దగ్గుబాటి ఇలా షో స్టాపర్ గా నిలిచారు. భారీ ముత్యాల హారం ధరించి రానా ఒక ప్రిన్స్ లా కనిపించారు. ఈ ముత్యాల హారంలో రూబీ పెండెంట్ మరింత ఆకర్షణీయంగా కనిపబడుతోంది.



Click it and Unblock the Notifications