Latest Updates
-
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.!
‘మిస్ అమెరికా' కిరీటాన్ని సొంతం చేసుకొన్నతొలి ప్రవాస భారతీయురాలు
అమెరికా అందాల పోటీల్లో ప్రవాస భారతీయురాలు, అందులోనూ ఆంధ్రా అచ్చ తెలుగు అమ్మాయి, మిస్ న్యూయార్క్ నీనా దావులూరి(24) మెరిసింది. మిస్ అమెరికా 2014 అందాల పోటీలో విజేతగా నిలిచి రికార్డు సృష్టించింది. యువతి మిస్ అమెరికా కిరీటాన్ని దక్కించుకున్న తొలి ప్రవాస భారతీయ యువతిగా ఆమె నిలిచింది. మిస్ న్యూయార్క్గా ఎంపికయిన రికార్డు కూడా ఆమె పేరిటే ఉంది.
అట్లాంటా నగరంలో నిర్వహించిన పోటీలో 15 సెమీ ఫైనలిస్టులను వెనక్కు నెట్టి ఆమె మిస్ అమెరికా కిరీటాన్ని అందుకుంది. ఈ పోటీ ఫైనల్‌కు మొత్తం 15 మంది చేరగా, వారిని అధికమించిన ఈ బ్యూటీ ఈ కిరీటాన్ని సొంతం చేసుకుంది. 'మిస్ అమెరికా' కిరీటాన్ని సొంతం చేసుకున్న తొలి ప్రవాస భారతీయురాలు దావూలూరి నీనా. ఇందులో మొత్తం 53 మంది అందెగత్తెలు పోటీలో పాల్గొనగా వారందరినీ వెనక్కి నెట్టి నీనా 'మిస్అమెరికా కిరీటాన్ని గెలుచుకున్నారు. బ్రాడ్వాక్ హాలులో జరిగిన ఈ పోటీని అమెరికా అంతటా టీవీలో ప్రసారం చేశారు. అంతకుముందు 2013లో మిస్ న్యూయార్ టైటిల్ అందుకున్న మాజీ మిస్ న్యూయార్క్ మాలోరి హాగన్.. నీనాకు కిరీటం అలంకరించింది. విజేతగా నిలిచిన నీనాకు 50 వేల డాలర్లు ఉపకార వేతనంగా అందుతాయి.
టాలెంట్ విభాగంలో ఆమె చేసిన 'బాలీవుడ్' డాన్స్ అలరించింది. ఈ డ్యాన్స్ కోసం ఆమె ధరించిన బ్రైట్ రెడ్ అండ్ బ్యూల కలర్ అవుట్ ఫిట్ అద్భుతంగా ఆకట్టుకొన్నది. ప్రస్తుతం న్యూయార్క్ లో సిరక్యూస్ లో నివాసం ఉంటున్న నీనా, తన తండ్రిలాగే తాను కూడా డాక్టర్ కావాలనుకుంటున్నట్టు చెప్పింది. నీనా దావులూరి తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా విజయవాడకు చెందినవారు.
ప్లాస్టిక్ సర్జరీపై అడిగిన ప్రశ్నకు ఆమె ఇచ్చిన సమాధానం జడ్జిలను ఆకట్టుకుంది. ప్లాస్టిక్ సర్జరీకి తాను వ్యతిరేకమని, జన్మతః వచ్చిన అందంతో పాటు ఏ సర్జరీకి తలవంచని మానసిక అందమే గొప్పదని ఆమె సమాధానమిచ్చింది. ఒకసారి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటే నచ్చినా, నచ్చకున్నా అలాగే ఉండాలని... కానీ ప్రకృతి పరంగా పుట్టుకతో వచ్చే శారీరక అందం ఇచ్చే మానసికానందం అన్నింటికన్నా గొప్పదన్న నీనా సమాధానమే ఆమెకు కిరీటాన్ని తెచ్చిపెట్టింది.!

నీనాకి మిస్ అమెరికా కిరిటం
మిస్ అమెరికా 2014: ప్రవాసభారతీయురాలు నీనా దువులూరి మిస్ అమెరికా 2014 కిరీటాన్ని కైవసం చేసుకొన్నారు. ఈ బ్రూక్లీనైట్ హాగన్ నేషన్స్ మోస్ట్ బ్యూటిఫుల్ అంబాసిడర్ గా నీనా అట్లాంటిక్ సిటీ కిరీటాన్ని దక్కించుకొన్నది.

నీనాకి మిస్ అమెరికా కిరిటం
మిస్ న్యూయార్క్: నీనా రెండవ వరుస మిస్ న్యూయార్క్ గా మిస్ అమెరిక టైటిల్ ను పొందింది.

నీనాకి మిస్ అమెరికా కిరిటం
భారతీయ అమెరికన్ నివాసస్థానం: నీనా సైరాకస్ లో స్థిరపడ్డారు. ఈ పోటీలో గెలిచిన మొదటి భారతీయ మహిళ నినా. నినా స్వస్థల, భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, క్రిష్ట జిల్లాకు చెందిన విజవాడ అమ్మాయి.

నీనాకి మిస్ అమెరికా కిరిటం
మిస్ అమెరికా కిరీటాన్ని ధరిస్తూ: 2013లో మిస్ అమెరికా కిరీటాన్ని పొందిన మెలొరీ హాగన్, నినాకు మిస్ అమెరికా 2014 కిరీటాన్ని ధరించారు.

నీనాకి మిస్ అమెరికా కిరిటం
డ్యాన్స్: 2014మిస్ అమెరికా కిరీటాన్ని దక్కించుకొన్న నీనా క్లాసిక్ బాలీవుడ్ డ్యాన్స్ ను అలరించింది.

నీనాకి మిస్ అమెరికా కిరిటం
తొలి ప్రవాస భారతీయురాలు: 2014మిస్ అమెరికా కిరీటాన్ని పొందినప్పుడు నినా చాలా ఉద్వేగభరితంగా కనిపించింది. ఈ అవకాశం నాకు దక్కినందుకు నేను చాలా ఉత్సాహంగా ఉన్నానని అన్నారు. మిస్ అమెరికా' కిరీటాన్ని సొంతం చేసుకొన్నతొలి ప్రవాస భారతీయురాలుగా చాలా గర్వపడుతన్నానన్నారు.

నీనాకి మిస్ అమెరికా కిరిటం
బరువు తగ్గినప్పుడు: నినా ఆస్తమాతో బాధపడింది. ఆమె హెల్తీ డైట్ ను తీసుకుంటూ బరువు తగ్గించి, అందంగా, నాజూగ్గా తయారైంది. క్యాండిస్ పెల్లెటైర్ నియాన్ లైమ్ గ్రీన్ కలర్ స్విమ్ సూట్ లో మిస్ అమెరికా ర్యాంప్ మీద ప్రదర్శన ఇచ్చింది.

నీనాకి మిస్ అమెరికా కిరిటం
మిస్ అమెరికా షూ పరేడ్: మిస్ అమెరికా 2014కిరీటాన్ని పొందేన ముందు రోజు, నినా అట్లాంటిక్ సిటి బోర్డ్ వాక్ లో మిస్ అమెరికా షూ పరేడ్ కు హాజరైంది. ఈ కార్యక్రమానికి ఆమె స్ట్రాప్ లెస్ రెడ్ గౌన్ ధరించారు. ఈ పరేడ్ షోలో ఆమె ధరించిన షూ ఇవి.



Click it and Unblock the Notifications
