లేడీ గాగను ఎప్పుడైనా ఈ గెటప్స్‌లో చూశారా..?

సుదీర్ఘ పాప్‌ సంగీత చరిత్రలో ఎందరో ధృవతారలు సంగీతాభిమా నులను ఓలలాడించారు. ఇప్పుడు అదే సంగీతాభిమానులను ఓ పాతికేళ్ళ యువతి తన గానామృతంతో మైమరపింపజేస్తోంది. ఎల్లలు లేని ఈ సంగీత ప్రపంచంలో ప్రస్తుతం రారాణిగా వెలుగొందుతున్న ఆ యువ గాయకురాలే లేడీ గాగ. ఆమె మైక్‌ పట్టుకుందంటే చాలు విశ్వవ్యాప్తంగా అభిమానులు సంభ్రమాశ్చర్యాలకు లోనవుతారు. అనతి కాలంలోనే పాప్‌ సంగీతానికి దశ-దిశగా ఎదిగిన లేడీ గాగ.. పాప్‌ అభిమానులకు ఆరాధ్య దేవతగా అవతరించింది. గాగ గొంతు నుంచి జాలువారే ప్రతి పదం ప్రస్తుతం సంగీతాన్నే శాసించగలుగుతోందంటే అతిశయోక్తి కాదేమో...

న్యూయార్క్‌ సిటీలో జన్మించిన లేడీ గాగ.. అసలు పేరు స్టెఫని జోఅన్నె అంజెలిన జెర్మనొట్ట. పలికేందుకు, గుర్తుంచు కునేందుకు కాస్త ఇబ్బందికరంగా అనిపించే ఈ పేరు..కోట్లాది గాగ అభి మానుల్లో ఏ కొద్ది మందికో కూడా తెలియదు. అశేషమైన అభిమానులం దరికీ లేడీ గాగ పేరుతోనే సుపరిచితురాలైన ఈ పాప్‌ గాన సుందరి.. తన 19వ ఏటలో కెరీర్‌ను ఆరంభించింది. అద్భుతంగా పాడటమే కాదు..తనే సొంతంగా రాసుకుని పాడే గాగ పేరు.. 2008నాటికి విశ్వ వ్యాప్తంగా మారు మ్రోగింది.

స్వల్పకాలంలోనే విశేషంగా ప్రఖ్యాతిగాంచిన లేడీ గాగ.. అంతే స్థాయిలో వివాదాల్లో చిక్కుకుంది. ఎమ్‌ టీవి మ్యూజిక్‌ అవార్డుల్లో గతేడాది పాల్గొన్న గాగ.. పచ్చి జంతు మాంసం కప్పుకుని రావడం సంచలనం కలిగించింది. జంతు ప్రేమికుల నుంచి తీవ్ర నిరసనలను ఎదుర్కొన్న గాగ..ఆ తర్వాత తన ప్రవర్తన చాలా వరకు మార్చుకుని విమర్శకుల ప్రశం సలను పొందింది.

పాప్ క్వీన్‌గా పేరు తెచ్చుకున్న లేడీ గాగాకు ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో కొత్తగా చెప్పనక్కర్లేదు. ఆమె ఏ దుస్తులు వేసుకుంటే వాటిని, ఏ రంగు లిప్‌స్టిక్ వాడితే దాన్ని వాడుతూ గాగా ట్రెండ్‌ను ఫాలో అయ్యే వెర్రి జనాలు చాలామందే ఉన్నారు. అంతే కాదు గాగ ఒక్కసారి కనిపించిన స్టైల్ మరో సారి ఉండదు. ఎప్పుడు ప్రత్యేకంగా కనబడుతు అందరిని ఆశ్చర్యపరుస్తుంటుంది. ఆమె ధరించే దుస్తులు ఆమె డిజైన్ చేస్తుందంటే ఆశ్చర్యం వేస్తుంది. బహుశా అందుకే కాబోలు ఆమె వెనుక అంత మంది అభిమానులు. మరి ఆమె ఒక్కో సందర్బంలో ఒక్కొరకంగా ఉన్న లేడీ గాగాను ఒక్క సారి చూసి తరించండి...!

అందుకే ఆమె కోసం ఎగబడుతారు..

బ్యాండేజ్ లుక్: లేడీ గాను బ్యాండేజ్ తో చుట్టేసినట్లు ఈ దుస్తుల్లో కనబడుతోంది. బహుశ ఆమె భాషలో ప్రమాదాలను అరికట్టడానికి, వ్యక్తులతో సంఘీభావం తెలిపేదిగా ప్రదర్శించింది.

అందుకే ఆమె కోసం ఎగబడుతారు..

నేరం చేసినట్టు రుజువు చేయు లుక్ తో: లేడీగాగా షోల్డ్ లెస్ లుక్ తో మెటాలిక్ స్టెమ్ ధరించి, పోలిష్ ఐడెంటిఫికేషన్ బోర్డ్ పట్టుకొని అపరాధిగా ప్రదర్శించింది.

అందుకే ఆమె కోసం ఎగబడుతారు..

మస్కిటో నెట్ లుక్: మనకు అనిపించడం లేదూ.. ఇదిఒక పింక్ కలర్ మస్కిటో నెట్ అని, ఇలా లేడీ గాగా ఓ భయంకరమైన లుక్ తో ప్రదర్శను అద్భుతంగా ఉంది.

అందుకే ఆమె కోసం ఎగబడుతారు..

యూనికాన్ లుక్: ఆశ్చర్యం! లేడీగాగాకు ఎక్స్ ట్రా రెండు కాళ్ళు చేతిలో కొమ్ము ఉంది! నిజంగా ఆమె మానవుడు రూపొందించిన ఒక జంతువుగా ఉంది.

అందుకే ఆమె కోసం ఎగబడుతారు..

గాయపడిన అవతారంలో: ఈ గగుర్పాటు ఫాషన్ గాయపడిన కాలుతో ఇలా చిత్రకరించుకోవడం ఒక లేడీగాగా ఆలోచన మాత్రమే కావచ్చు.

అందుకే ఆమె కోసం ఎగబడుతారు..

బూటెడ్ లుక్: జస్ట్ ఆమె ధరించిన బూట్లను చూడండి!అవి దాదాపు ఆమె ఛాతీవరకూ వస్తున్నాయి. ఇది ఆశ్చర్యం కాదు, ఇవి స్వయానా లేడీ గాగాన్ డిజైన్ చేసిన ఔట్ ఫిట్ గా చెప్పవచ్చు.

అందుకే ఆమె కోసం ఎగబడుతారు..

జోకర్ లుక్: ఈ ఔట్ ఫిట్ లో లేడీగాగాను ఖచ్చితంగా జోకర్ లా కనబడుతోంది. ఆమె ధరించిన టోఫి ఒక జోకర్ టోపి అంతే కాదు హాట్ మధ్యలో ఏదో ఉంది.!

అందుకే ఆమె కోసం ఎగబడుతారు..

న్యూడ్ లుక్: తన స్వంత ఫ్రాగ్నెన్స్ (పెర్ప్యూమ్) తనే ఇలా అడ్వర్ టైజ్ మెంట్ ఫోజ్ ఇచ్చింది. ఈ న్యూడ్ లుక్ లో ఆమె మీదకు ఎక్కడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తుల చిత్రం అద్భుతంగా చిత్రీకరించింది.

అందుకే ఆమె కోసం ఎగబడుతారు..

మెటాలిక్ హెయిర్ లుక్: లేడీ గాగాకు ఎక్కువగా మెరిసే మరియు మెటల్ వస్తువులంటే చాలా ఇష్టం. అయితే మెటాలిక్ హెయిర్ కలిగి ఉండటం అనే ఆశ్చర్యకరం.

అందుకే ఆమె కోసం ఎగబడుతారు..

మీట్ లుక్: లేడీ గాగా ఇలా రెడ్ కలర్ మీట్ మరియు ఫిష్ కలర్ డ్రెస్స్ లో ఇలా ఫోజ్ ఇచ్చినిలబడటం. బహుశా ఇది ఆమె వెజిటేరియన్ కు మారిందనడానికి నిదర్శనమా..?

అందుకే ఆమె కోసం ఎగబడుతారు..

ఏదో తెలియని హింస: బ్లాక్ లెదర్ మరియు నెట్టెడ్ ఔట్ ఫిట్ లో చూస్తుంటే 15వ శతాబ్దంపు హింస దుస్తులను పోలిఉన్నాయి. చీకటి ప్రదేశంలో ఆమెను చిత్రహింసలకు గురిచేస్తున్నట్లు ఉన్న ఫోజ్.

అందుకే ఆమె కోసం ఎగబడుతారు..

మెటాలికా లుక్: లేడీగాగా తలనుండి కాళ్ళ వరకూ మెటాలిక్ దుస్తులు యాక్ససెరీస్ ధరించింది.ఇందులో బెస్ట్ పార్ట్ ఆమె పెదాలు. ఎందుకంటే అవి కూడా మెటాలిక్ గ్రేతో మేకప్ చేయబడి ఉంది.

అందుకే ఆమె కోసం ఎగబడుతారు..

వార్డ్ రోబ్ మాల్ ఫంక్షన్ లుక్: వార్డ్ రోబ్ మాల్ ఫంక్షన్ లుక్ తో ప్రత్యేకంగా కనబడుతుంది.

అందుకే ఆమె కోసం ఎగబడుతారు..

స్ట్రిప్పర్స్ లుక్స్: మోకాళ్ళ వరకూ బూట్లు స్ట్రిప్ క్లబ్ కొంతమంది డ్రస్సుల మీద ఇలా ధరించడం చూసే ఉంటారు.

అందుకే ఆమె కోసం ఎగబడుతారు..

రైంబో లుక్: లేడీగాగా ధరించిన షర్ట్ లో అన్నికలర్స్ కనబడుతాయి. గ్రీన్ హెయిర్ మరింత ఆకర్షణీయంగా, కళ్ళజోడు భలేగున్నాయి.

అందుకే ఆమె కోసం ఎగబడుతారు..

ఎలక్ట్రిక్ లుక్: లేడీగాగాను ఇలా చూస్తుంటో ఎలక్ట్రిక్ ట్యూబ్స్ తో ఇలా చుట్టునట్లుకనబడుతోంది.

అందుకే ఆమె కోసం ఎగబడుతారు..

ఫెర్రీ లుక్: లేడీ గాగా అతి పెద్ద ఫెర్రీ జాకెట్ ధరించి చాలా గంభీరంగా కనబడుతోంది. ఈ ఫెర్రీ జాకెట్ ను తన చేతిలో ఉన్న కుక్కపిల్ల కొంత భాగం ఆక్రమించేసింది.

అందుకే ఆమె కోసం ఎగబడుతారు..

చారిత్ర పూర్వక లుక్: లేడీగాగా ఈ దుస్తులో ఓ చారిత్రక మహిళ అందాన్ని తలపిస్తోంది.

Story first published: Saturday, March 30, 2013, 17:34 [IST]
Desktop Bottom Promotion