Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
సత్య2 ఆడియో ఫంక్షన్ లో పీకాక్ బ్లూ శారీలో మెరిసిన మంచు లక్ష్మీ
రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ‘సత్య2' చిత్రం ఆడియోను రీసెంట్ గా విడుదల చేశారు. ఈ చిత్రం ఆడియో హైదరాబాద్‌లో జరిగింది. ఈ ఆడియో కార్యక్రమానికి మంచు లక్ష్మీ ప్రసన్న హాజరయ్యారు. వర్మ దర్శకత్వంలో ఇంతకు మునుపే దొగల ముఠా, డిపార్ట్ మెంట్ అనే హిందీ చిత్రాలలోనూ నటించారు. తను నటించిన తొలి తెలుగు చిత్రం అనగనగా ఓ ధీరుడు'లో ఐరేంద్రి పాత్రకుగాను ప్రభుత్వం నంది అవార్డు గెలుచుకున్నారు.
ఆ తర్వాత నేను మీకు తెలుసా, ఝమ్మందినాదం చిత్రాలతో తన చిత్ర నిర్మాణం మొదలు పెటటి, తదుపరి చిత్రంగా ‘ఊకొడతారా..ఉలిక్కిపడతార' అనే చిత్రాన్ని భారీ వ్యయంతో నిర్మించారు. మంచి మనసున్న ‘మంచు' వారమ్మాయికి చిత్ర ప్రముఖులలో ఒక ప్రత్యేక స్థానం కేవలం తన ప్రజ్ఞ పాటవాల, పట్టుదల, విజ్ఞతతో సంపాదించుకున్నదే కానీ వారసత్వంతో కాదు.

లక్ష్మి ప్రసన్న మాట్లాడుతూ... వర్మ దర్శకత్వంలో నటించటం అనేది నా చిన్నప్పటి కల. అలాంటిది నేను ఒకటి కాదు రెండు సినిమాలలో యాక్ట్ చేసాను. నెక్ట్స్ టైమ్ ఓ పదిమంది చూసేటట్లు తీయండి. ఆయన ప్రేమ పాట పాడారనే అనేది ఊహించలేకపోతున్నారు. చిత్రం చాలా బాగా వచ్చిందని, వర్మ సినిమాలు చాలా బాగుంటాయని, ఈ సినిమా ఘన విజయం సాధిస్తుందని అని అన్నారు.
మంచు లక్ష్మీ సినిమా రంగంలోనే కాదు, ఫ్యాషన్ రంగంలో కూడా ముందుటుంది. మంచు లక్ష్మీ ప్రసన్న సత్య2 ఆడియోకార్యక్రమానికి సత్య పౌల్ పీకాక్ బ్లూకలర్ శారీలో హజరయ్యారు. పీకాక్ బ్లూ వర్క్ శారీకి బార్డర్ గా సన్నని డార్క్ కలర్ బ్లూ అట్రాక్షన్ గా సింపుల్ గా ఉంది. చీర బార్డర్, పళ్ళ మొత్తం సిల్వర్ కలర్ వర్క్ తో చాలా అద్భుతంగా..అందంగా కనిపించారు. మంచి లక్ష్మీ ప్రసన్న కట్టుకొన్న ఈ శారీ మొత్తం సిల్వర్ ఎంబ్రాయిడరీ వర్క్ తళుకుబెళుకులతో మెరిపిస్తూ స్టేజి మీద అట్రాక్షన్ గా కనబడ్డారు. ఆమె ధరించిన స్టోన్ జువలరీ చేతి వేళ్ళకు రింగ్స్- శారీకి ఫర్ ఫెక్ట్ మ్యాంచింగ్ గా ఉన్నాయి. ఈ సత్యపౌల్ శారీమీదకు సైడ్ బన్ హెయిర్ స్టైల్ ఫ్యాషన్ ట్రెండ్ ను తలపించింది.



Click it and Unblock the Notifications