Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
సకల శుభాలకు శోభ తెచ్చే మకర సంక్రాంతి...

సంక్రాంతి మొదటి రోజు భోగి గురించి మునపటి వ్యాసంలో తెలుసుకున్నాం.. ఇక రెండవ రోజు సంక్రాంతి పండుగ గురించి తెలుసుకుందాం.. ముఖ్యంగా రెండవ రోజును మకర సంక్రాంతి అంటారు. ఆ రోజున కొత్త పొయ్యి, కొంత కుండలు తెచ్చి వాటిలో పాలు పొంగించి, దానితో మిఠాయిలు తయారు చేస్తారు. కొన్ని ప్రదేశాల్లో పితృదేవతలకు తర్పణాలు ఇస్తారు. ఉత్తరాయణ పుణ్యదినమైన మకర సంక్రాంతి అంటేనే డూడూ బసవన్నలు, హరిదాసుల పాటలు మనకందరికీ గుర్తుకు వచ్చేస్తుంటాయి. అయితే మకర సంక్రాంతికి నిజమైన అర్థం సూర్యుడు ప్రతీ ముప్పై రోజులకు ఒక్కొక్క రాశిలో ప్రవేశిస్తాడు. మకర సంక్రాంతి అంటే సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే సమయం. సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించే సమయంలో ఉత్తర ముఖంగా ప్రయాణిస్తాడు. కనుక ఈ కాలాన్ని ఉత్తరాయణ కాలం అంటారు.
దాంతో సంక్రాంతి నుంచే ప్రకృతిలో ప్రధానమైన మార్పులు వస్తాయి. పంటలు చేతికి వచ్చి జీవితం సుఖసంతోషాలతో ఉత్సాహిత మౌతుంది. ముఖ్యంగా ఈ పండుగ రోజున కలవాడు లేనివారికి దానాలు ధర్మాలు చేస్తారు. ఉత్తరదేశంలో గొంగళ్ళు దానం చేయడం కూడా సాంప్రదాయంగా వస్తున్నది. ఇది కూడా శీతవాత హర సూచకమే. కొత్త అల్లుళ్ళు అత్తవారి ఇళ్ళకు వెళ్తారు. అత్తవా రింటిలో మరదళ్ళతో ముచ్చట్లు, వదినల వరసలతో సరదాగా కుటుంబ సభ్యులు సందడిగా గడుపు తారు. పండుగరోజున పల్లె ప్రాంతాల్లో గంగిరెద్దుల ఆటలు ప్రధాన వినోదంగా సాగుతాయి. ఇంకొన్ని చోట్ల కోడి పందాలు జోరుగా సాగుతాయి. పిల్లలు రంగురంగుల గాలిపటాలు ఎగురవేస్తారు. ఈరోజు ముఖ్యంగా ఆడపడుచులు రథాకారంలో ఉండే రంగవల్లికలను ఇంటిముందు తీర్చిదిద్దుతారు. మరి కొంతమంది బొమ్మలకొలువును ఏర్పాటు చేస్తారు. తమ ఇంట పంట చేరినందుకు గుర్తుగా వరికంకులను ఇళ్ళ వసారాలలో పక్షులకు ఆహారంగా ఉంచుతారు.
ఇక ఈ పండుగ రోజు గంగిరెద్దులను ఆడించే గంగిరెద్దుల వారు చక్కాగా అలకరించి వాటిని ఇళ్ల చుట్టూ తిప్పుతూ డోలు సన్నాయి, రాగాలకు అనుగుణంగా వాటితో చేయించే నృత్యాలు చూడటానికి చాలా రమణీయంగా ఉంటాయి. ఇక మనం ఇచ్చే కానుకలను తీసుకుంటున్నట్లు తలలు ఊపుతూ మోకాళ్ల మీద వంగటం వంటి విద్యలను వాటికిత నేర్పిస్తారు. ఇక అయ్యగారికి దండం పెట్టు, అమ్మగారికి దండం పెట్టు అంటూ గంగిరెద్దుల వాళ్లు సందడి చేస్తూ కొత్తగా వచ్చిన ధాన్యాన్ని తీసుకుంటారు. హరిలో రంగహరి అంటూ నడినెత్తిపై నుండి ముక్కుదాక తిరుమణి పట్టెలతో, గజ్జెలతో ఘల్లుఘల్లు మంటూ చిందులూ వేస్తూ హరిదాసులు ప్రత్యక్షమవుతారు. కాబట్టే పట్టణమైనా, పల్లెలైనా, సంక్రాంతి శోభ పరచుకుంటాయి. అందుకే తెలుగు వారికి అత్యంత ముఖ్యమైన పండుగ సంక్రాంతి.



Click it and Unblock the Notifications