For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆహ్లదకరమైన వాతావరణంలో సంతోషాలు వెళ్ళువిరిసే ‘కనుమ’

ఆ సంవత్సరం పాటు పండే పంటలకు చీడ-పీడలు సోకకుండా కాపాడమని దేవతలను ప్రార్ధిస్తారు.

|

మకర సంక్రాంతి మరుసటి రోజు అంటే ముచ్చటగా మూడవ రోజు(భోగి, మకరసంక్రాంతిlink, కనుమ) కనుమ అంటారు. ఈ రోజున పల్లెల్లో రైతుకు వ్యవసాయంలో సహకరించే పశువులను పూజించడం ఆచారం. ఆ రోజున పశువుల పాకలను చక్కగా అలంకరించి అక్కడ పాలు, కొత్తబియ్యంతో పొంగలి వండుతారు. ఆ పొంగలిని దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాత పొలానికి తీసుకెళ్లి చల్లుతారు. దీన్నే పొలి చల్లటం అని అంటారు. అంటే దాని అర్థం ఆ సంవత్సరం పాటు పండే పంటలకు చీడ-పీడలు సోకకుండా కాపాడమని దేవతలను ప్రార్ధిస్తారు.

ఇలా చేస్తే పంటలు బాగా పండుతాయన్నది వారి నమ్మకం. అయితే ఈ పొలి పొంగలిలో పసుపు, కుంకుమ కలిసి కొద్దిగా కుంకుమ రంగు ఎక్కువగా ఉన్న పొలి పొంగలిని చల్లుతుంటారు. అలాగే మంచి గుమ్మడి కాయను దిష్టి తీసి పగులకొడతారు. కనుమనాడు ఆవులు, ఎద్దులు, గేదెలు, దున్నలను పసుపు, కుంకుమ, పువ్వులు, బెలూన్లతో అలంకరించి పూజించటం జరుగుతుంది. ఆ రోజున వాటితో ఏ పని చేయనీయక వాటిని పూజ్య భావంతో చూస్తారు. ఎందుకంటే పల్లెల్లో పశువులే గొప్పసంపద, అవి ఆనందంగా ఉంటే రైతుకి ఉత్సాహం, పంటల్లో వీటి పాత్ర ఎంతో ఉంది. వాటిని ప్రేమగా చూసుకొనే రోజుగా కనుమను భావిస్తారు.

మరో ప్రత్యేక అంశం కొన్ని ప్రాంతాల్లో 'కనుమ' నాడు 'మినుములు' తినాలనే ఆచారం. అందుకే 'మినపగారెలు' చేసుకొని తింటారు. పుట్టింటికి వచ్చిన ఆడపిల్లలు, అత్తింటికి వెల్ళిన అల్లుళ్ళు కూడా కనుమ రోజు తిరుగు ప్రయాణం చేయరు. కనుమ రోజు కాకి కూడ కదలదని సామెత. ఇక పిండివంటలlink ప్రత్యేకతే వేరు... మాంసాహారం తినేవాళ్ళు కనుమనాడు తప్పక మాంసాహర విభిన్న రుచులను వండుకొని తింటారు.

Pongal: Third Day Special - Kanuma

అలాగే ఈ రోజున బొమ్మల కొలువు ఎత్తటం అని పేరంటం చేస్తారు. బొమ్మలకు హారతి పట్టి ఒక బొమ్మను శాస్త్రార్థ పరంగా ఎత్తి పెడతారు. అంతే కాదు గొబ్బెమ్మల పూజలు, హరిదాసుల రాకపోకలు, ఎడ్ల పందాలు, ఎడ్లను ఊరేగించడం, కొన్ని ప్రాంతాల్లో కోడి పందాలు, బంతిపూలతో తోరణాలు, కొత్త జంటల విహారాలు, బావమరదల్ల ఇకఇకలు, పకపకలు ఎంతో ఆహ్లదకరంగా ఉంటాయి. ఇదే కనుమ యొక్క ప్రత్యేకత..

English summary

Pongal2023: Third Day Special - Kanuma | ఆహ్లదకరమైన, సరదాల..సంతోషాల ‘కనుమ’

Third Day: Commonly known as Mattu Pongal, it is the day for cows. The cows are decorated with tingling bells (tied around the neck), flower garlands and colourful beads and then worshiped. The cows are offered the pongal and then taken to nearby areas.
Desktop Bottom Promotion