For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రాఖీ పండుగకు కళకళలాడుతున్నరంగుల రాఖీలు!

|

అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా జరుపుకునే రాఖీ పండుగను నేటితరం ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటోంది. అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిధి... కనిపించని దైవమే ఆ కనులలోన ఉన్నదీ అని ఓ చెల్లెలు తన అన్నయ్య అనురాగం గురించి పాడడంలో ఎంతో అర్థముంది... తనను ప్రాణంకన్నా మిన్నగా ప్రేమించే అన్నయ్యలంటే ఈ ప్రపంచంలో ప్రతి చెల్లెలికీ అభిమానం, అనురాగం, ఆప్యాయత. ఇంతటి ఆత్మీయతను పంచే అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక ‘రక్షాబంధన్‌' పండుగ. దుర్బలులను దుర్మార్గులనుంచి కాపాడాలన్న సంస్కృతికి నాగరకతకు ప్రతీక రాఖీ. ప్రతి యేటా శ్రావణమాసంలో వచ్చేపౌర్ణమినే శ్రావణ పౌర్ణమి లేదా రాఖీ పౌర్ణమి అంటారు. ఉత్తర భారతంలో ఈ పండుగను కజ్రీ పూర్ణిమ అని కూడా అంటారు. అక్కడ ఈ సమయంలోనే రైతులు గోధుమ, బార్లీ నాట్లు వేయటం విశేషం.

ఒక కుటుంబంలోనే కాక యావత్‌ సమాజంలో సోదర ప్రేమకు, సుహృద్భావానికి రాఖీ ప్రతీక నిలుస్తుంది. సమాజంలో సామరస్యానికి పునాది వేస్తుంది. శాంతియుత సహజీవనానికి రాజమార్గం రాఖీ. గురుదేవులు విశ్వకవి రవీంద్రుడు రాఖీ ఉత్సవాలను భారీ ఎత్తున జరిపించేవారు. ఈ రోజు ‘ఫ్రెండ్‌షిప్‌ బ్యాండ్‌'గా ప్రచారంలో వున్నది ఒక విధంగా రాఖీ సంప్రదాయానికి కొనసాగింపేనంటే అతిశయోక్తి కాదు. ఒక పురుషుడు సాటియువతిపై హద్దుమీరిన మమకారం పెంచుకున్న సందర్భంలో ఆ సదరు యువతికి అతనిపై ఇష్టం లేనట్లయితే... ఆ మక్కువను స్నేహానికే పరిమితమని అది సోదర ప్రేమగా మాత్రమే ఉంటే బాగుంటుందని సున్నితంగా సూక్షంగా రాఖీ ద్వారా తెలియజేస్తుంది. అలాంటి పవిత్ర సోదర ప్రేమకు ప్రతీక అయిన రాఖీ పండుగ మూలాలు ఇప్పటివి కావు. చరిత్రలో ఎందరో ప్రముఖులు రాఖీ ద్వారా తమ సోదరప్రేమను చాటుకున్నారు.

శ్రావణ పౌర్ణమి రోజున వచ్చే రక్షాబంధన్ రంగు రంగుల దారాలతో ముడిపడి ఉంది. రాఖీలో ఉండే దారాలు అన్నా, చెల్లెళ్లు, అక్కాతముళ్ల అనుబంధానికి గుర్తులాంటివి. అందుకే ఈ రాఖీలను పవిత్రంగా భావిస్తారు. ఎక్కడెక్కడో ఉన్న అన్నాచెల్లెళ్లలను ఈ రాఖీ మళ్లీ కలుసుకునేలా చేస్తుంది. దేశాలు ప్రాంతాలు విడిచి దూరంగా ఉంటే పోస్టులోనైనా పలకరించి హృదయానికి హత్తుకుంటుంది. సోదరి పంపిన రాఖీ మరచిపోలేని జ్ఞాపికగా మిగిలిపోవడమేగాక సోదరుడికి అండగా ఉంటుంది.

ఉత్తరం భారతదేశంలో సంప్రదాయమైన ఇప్పుడు రక్షాబంధన్ పండుగ దేశమంతట ఉత్సాహంగా నిర్వహిస్తున్నారు. చెల్లెలు రాఖీ కట్టిందటే సర్వకాలం సర్వావస్థలలోనూ రక్షగా ఉండమని అన్నయ్యను కోరడమని అర్థం. అలాగే అన్నకు అన్నివేళలా రక్షించే శక్తిని ఇవ్వాలని ప్రార్థించడం.రాఖీ కట్టిన సోదరికి కానుకలివ్వడం మన సంప్రదాయంలో భాగం. అది మిఠాయి కావచ్చు, నగదు కావచ్చు. చెల్లెళ్లకోసం సర్వస్వం త్యాగం చేసినవారు చరిత్రలో ఉన్నారు. దానవుల నుంచి రక్షణకోసం శచీదేవి ఇంద్రుడికి, యుద్ధంలో విజయంకోసం కుంతీదేవి అభిమన్యుడికి, విజయంకలగాలని ఖడ్గానికి శివాజీ కట్టారు.

కాలంతోపాటే పండుగ తీరూ మారుతోంది. ఎంత గొప్ప రాఖీ కడితే సోదరులకు అంత రక్షగా ఉంటుందని చెలెళ్లు భావిస్తున్నారు. కొందరు బంగారు, వెండి రాఖీలను కొనుగోలు చేస్తే మధ్యతరగతి వారు ఫ్యాన్సీవి కొంటున్నారు. మార్కెట్‌లో రకరకాల రాఖీలు దర్శనమిస్తున్నాయి. వాటిని ఒక సారి పరిశీలించండి

బీడెడ్ రాఖీ:

బీడెడ్ రాఖీ:

ఫ్రెండ్షిప్ డే బ్యాండ్ లా కనిపించే ఈ రాకీ చాలా రంగురంగుల పూసలతోటి తయారు చేయబడింది.

జాలర్ రాఖీ:

జాలర్ రాఖీ:

ఈ రాఖీని రేషం దారంతో తయారు చేయబడింది. అలాగే మద్యలో రౌండ్ గా ఉన్నప్రదేశంలో కూడా పూర్తి రేషంతో తయారు చేసినదే.

ఓం రాఖీ:

ఓం రాఖీ:

రాఖీ అంటేనే సాంప్రదాయంగా ఉంటుంది. అందులో హిందు మతానికి చిహ్నాంగా ఓం ను రాఖీలో సంబంది రాఖీ తయారు చేశారు.

జువెల్ రాఖీ:

జువెల్ రాఖీ:

ఆభరణాలతో తయారు చేసే రాఖీలు చాలా సింపుల్ గా సులభంగా తయారు చేసేయవచ్చు. ఇంట్లో ఉండే ఏదైనా ఆభరణం తీసుకొని ఇలా సిల్క్ దారంతో తయారు చేయవచ్చు.

పీకాక్ రాఖీ:

పీకాక్ రాఖీ:

నెమలి పంచంతో లేదా నెమలి ఆకారం కలిగిన ఆభరణంతో పీఖాక్ రాఖీ చాలా సింపుల్ గా గ్రాండ్ గా ఉంది.

రుద్రక్ష రాఖీ:

రుద్రక్ష రాఖీ:

రుద్రాక్షంతో తయారు చేసిన రాఖి. ఇది హిందుసాంప్రదాయానికి ప్రతీకగా తయారు చేసినటువంటి రాఖీ. దీన్ని కట్టుకుంటే అనేక ఆరోగ్యప్రయోజనాలు కలుగుతాయనే నమ్మకం చాలా మందిలో ఉంది.

లుంబా రాఖీ:

లుంబా రాఖీ:

మీరు మీ బ్రదర్ కోసం వెరైటీగా చేయాలనుకున్నప్పుడు ఇటువంటి లుంబా రాఖీలను తయారు చేయవచ్చు.

స్వస్తిక్ రాఖీ:

స్వస్తిక్ రాఖీ:

హిందువులకు పవిత్ర చిహ్నంగా భావించే స్వస్తిక్ ను రాఖీలో బంధించి సోదరులకు కట్టవచ్చు.

డ్యూయల్ స్ట్రింగ్ రాఖీ:

డ్యూయల్ స్ట్రింగ్ రాఖీ:

ఈ రాఖీ చాలా ఫాషనబుల్ గా ఉంది. ప్రస్తుత రోజుల్లో ఇటువంటి వాటికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. డ్యూయల్ స్ట్రింగ్ కు ఎక్కువగా ఎరుపు మరియు పసుపు ఎంపిక చేసుకుంటారు.

ట్రై కలర్ రాఖీ:

ట్రై కలర్ రాఖీ:

ఇటువంటి నునుపైన సున్నితమైన బాల్స్ వంటివి త్రెడ్ తో తయారు చేసినవి మార్కెట్లో చాలా అందుబాటులో ఉన్నాయి. వాటిలో మూడు రకాలు తీసుకొని ఇలా తయారు చేసి రక్షాబందన్ తయారు చేయచ్చు.

English summary

Simple Ideas To Make Rakhi For Your Brother

Raksha Bandhan is a festival that celebrates the bond of love between brothers and sisters. The metaphorical bond is literally symbolised by a thread that we call the Rakhi. Although, Rakhi was originally envisaged as a rolled up thread, it is now a designer band.
Desktop Bottom Promotion