For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

World Environment Day 2020 : ఈ టిప్స్ తో పర్యావరణాన్ని కాపాడుకుందాం రండి...

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా 'మన' ఉనికిని కాపాడుకోవటానికి కొన్ని టిప్స్:

|

నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం. ప్రతి సంవత్సరం జూన్ 5వ తేదీని "ప్రపంచ పర్యావరణ దినోత్సవం"గా పాటిస్తున్నారు. ఈ పర్యావరణ దినోత్సవం ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీచే 1972, జూన్ 5వ తేదీన స్థాపించబడింది. పర్యావరణ దినం సందర్భంగా, ప్రతి సంవత్సరం జూన్ 5న ఏదేని ఒక నిర్ణీత నగరంలో పర్యావరణానికి సంబంధించిన అంతర్జాతీయ సమావేశం జరుగుతుంది.

నేడు మానవుడు తన మేధో సంపత్తితో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకుని, ప్రపంచవ్యాప్తంగా పలు పరిశ్రమలను నెలకొల్పుతున్నాడు. ఈ పరిశ్రమలు వెదజల్లే కాలుష్యంతో కోలుకోలేనంతగా వాతావరణం కలుషితమై... పీల్చే గాలి, త్రాగే నీరు, తినే ఆహారం.. అన్నీ కలుషితమవుతున్నాయి. మానవుడు తన స్వార్థ ప్రయోజనాల కోసం ప్రకృతి ప్రసాదించిన వనరులను అవసరానికి మించి వాడుకుంటున్నాడు.

World Environment Day

అంతేగాకుండా, మానవుడు తన వేగవంతమైన జీవితంలో వాహన వేగం పెంచుతూ, ఇంధన కొరతకు కారణమవుతున్నాడు. కార్బన్‌ మోనాక్సైడ్, కార్బన్ డై ఆక్సైడ్ లాంటి విషపూరిత వాయువులు వాతావరణంలో పరిమితికి మించి పెరగడం వల్ల క్రమంగా భూమండలం వేడెక్కుతోంది. అడవులు, జల వనరులు క్రమేపీ తగ్గిపోతున్నాయి. ఈ రకంగా, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో సాధించిన పురోగతి కూడా ప్రకృతి కాలుష్యానికి కారణమవుతోంది.

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా 'మన' ఉనికిని కాపాడుకోవటానికి కొన్ని టిప్స్:

ప్లాస్టిక్ :

ప్లాస్టిక్ బ్యాగుల వినియోగం వీలైనంతవరకు తగ్గించాలి. షాపింగ్ కి వెళ్ళేప్పుడు క్లాత్ బ్యాగ్ ని తీసుకువెళ్ళాలి.

మొక్కలు నాటాలి:

మొక్కలకి నీరు ఉదయం కాని, సాయంత్రం చల్లబడ్డాక కానీ పోయాలి... అప్పుడైతే ఎక్కువ శాతం నీరు ఆవిరి కాకుండా మొక్కలకి అందుతుంది.

నీరు ఆదా చేయాలి:

అనవసరంగా నీరు వృధా చేయకూడదు. ఇంట్లో టాప్స్ లీకేజ్ లేకుండా ఎప్పటికప్పుడు సరి చూసుకుంటూ ఉండాలి. నిలువ ఉన్న నీరు వృధాగా పారబోసే బదులు... మొక్కలకి పోయాలి.

పెట్రోల్ వినియోగం తగ్గించాలి:

పెట్రోల్ వినియోగం తగ్గించి, కాలుష్యాన్ని నియంత్రించాలి. బండిలో పెట్రోల్ ఉదయం పూట పోయించుకోవటం మంచిది. దానిద్వారా మైలేజ్ పెరుగుతుంది.

పవర్ / కరెంటు ఆదా చేయాలి:

గ్లోబల్ వార్మింగ్ ని నియంత్రించాలి. అనవసరమైన చోట బల్బులు, ఫాన్ లు, ఎ.సి లు ఆపి, విద్యుత్ ఆదా చేయగలం.

కాలుష్యం:

కేరోసిన వాడే ఆటోల గురించి చెప్పక్కర్లేదు. వాటి వెనకాల వెళ్తే మొఖం నల్లగా తయారయ్యి ఎవరు గుర్తుపట్టడానికి వీలులేకుండా అవుతుంది. కొంతమంది బయట కనపడిన టైర్లు , చెత్త కాలుస్తుంటారు. ఇంకొంతమంది గ్యాస్ లేక, పొయ్యి లో కట్టెలు వాడుతుంటారు.ఎక్కువమంది పొగ తాగుతుంటారు.

పేపర్ వాడకం తగ్గించాలి:

మనకి రోజు వారిలో కనీసం ఒక పేపర్ అయినా అవసరం అవుతుంది. పేపర్ ఎంత తక్కువ వాడితే అంత మంచిది. పేపర్ కోసం రోజుకి కొన్ని లక్షల చెట్లని నరుకుతున్నారు. న్యూస్ పేపర్ కొనకపోవటం చాల మంచిది.ఇంటర్నెట్ లో ఈ-పేపర్ చదువు కోవచు.

న్యూక్లియర్ ప్లాంట్స్:

మన దేశములో ఇవి ఎందుకు కడుతున్నారో అర్ధం కాదు. మనకి ఇవి అవసరం లేదు. వీటి వల్ల జరిగే అనర్దం అంతా ఇంతా కాదు. విద్యుత్ కోసం వీటిని నిర్మించటం దారుణం.

విద్యుత్ కేంద్రాలు:

మనకి విద్యుత్ ప్రతి నిముషం అవసరం. కాని ఆ విద్యుత్ మన పరిసరాన్ని తద్వారా మన ఆరోగ్యాన్ని దెబ్బతిస్తుందంటే చాల మంది నమ్మరు. బొగ్గు తో విద్యుత్ తయారయ్యే కేంద్రాలలో ఇది అధికం. విద్యుత్ ని కేవలం బొగ్గు తోనే కాకుండా పవనం మరియు సూర్యరశ్మి తో తయారు చేయవచు.

సైకిల్ వాడకం:

తక్కువ దూరాలు నడవగలం, సైకిల్ వాడగలం. పెట్రోల్ ఆదా చేయగలం. వారానికి ఒక రోజయిన సొంత వాహనాన్ని పక్కన పెట్టి,

పబ్లిక్ ట్రాన్సపోర్ట్ ఉపయోగించగలం.

English summary

World Environment Day 2020 : Theme,History & Significance

World Environment Day (WED) is observed on June 5 every year to promote awareness on the importance of preserving our biodiversity, the need to identify problems related to the environment and ways to take corrective action.
Desktop Bottom Promotion