For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సంవత్సరంపాటు బొద్దింకతో డేటింగ్, సెక్స్ పెస్ట్, అది మరణించినప్పుడు తినడం మరో వింత

యుమా షినోహర అనే వ్యక్తి 'లిసా' అనే పేరు గల ఒక బొద్దింకతో డేటింగ్ చేస్తున్నానని ఒప్పుకున్నప్పుడు, ఈ సంబంధానికి 'సెక్స్ పెస్ట్' అనే కొత్త అర్ధాన్ని ఇచ్చాడు. కానీ, దానితో లైంగిక సంబంధాలు పెట్టుకోవటం మాత్

|

సంవత్సరంపాటు బొద్దింకతో డేటింగ్ చేయడం ఒక వింతైతే, అది మరణించినప్పుడు తినడం మరో వింత ! ఇలాంటి వ్యక్తులు కూడా ఉంటారా ? అతను ఒక సంవత్సరం పైగా లిసా అని పేరు పెట్టుకున్న ఒక బొద్దింకతో డేటింగ్ చేసి, ఆమె మరణించిన తర్వాత, తినేశాడు కూడా. ఏంటి జిగుప్సుగా అనిపిస్తుందా? ఏం చేయలేం, ఇలాంటివి విన్నప్పుడు అవాక్కవడం తప్ప.


కొన్ని కథలు ఫాంటసీగా అనిపిస్తాయి, అంటే పూర్తిగా ఊహాజనితమేమో అన్న ఆలోచన కలిగిస్తాయి. కానీ అవి నిజాలు అని తెలిసినప్పుడు, అసహ్యంతో కూడిన ఆశ్చర్యానికి లోనవడం మనవంతు అవుతుంది. అటువంటిదే ఈ కథ కూడా, ఈ యువకుడు ఒక బొద్దింకతో ప్రేమలో పడ్డాడు.

He Dated A Cockroach Called Lisa For A Year And Ate Her When She Died


ఇది ఒక బొద్దింకతో డేటింగ్లో ఉన్న ఒక యువకుడి అసాధారణ ప్రేమ కథ. చివరికి వారి సంబంధం ఎలా ముగిసిందన్నది ఇప్పుడు తెలుసుకుందాం. ఈ భయంకరమైన జిగుప్సాకరమైన ప్రేమ కథను తెలుసుకునేందుకు వ్యాసంలో మరింత ముందుకు సాగండి. ఈ సంబంధాన్ని 'సెక్స్ పెస్ట్' (పురుగులతో సహజీవనం) అని పిలవడం జరిగింది.


యుమా షినోహర అనే వ్యక్తి 'లిసా' అనే పేరు గల ఒక బొద్దింకతో డేటింగ్ చేస్తున్నానని ఒప్పుకున్నప్పుడు, ఈ సంబంధానికి 'సెక్స్ పెస్ట్' అనే కొత్త అర్ధాన్ని ఇచ్చాడు. కానీ, దానితో లైంగిక సంబంధాలు పెట్టుకోవటం మాత్రం నిరాకరించాడు., క్రమంగా ఆ సంబంధాలు ఊహలకే పరిమితమవ్వడం కొంత ఆహ్వానించదగ్గ విషయం.

He Dated A Cockroach Called Lisa For A Year And Ate Her When She Died


ప్రేమ గురించి అతనికి ఉన్న ఫాంటసీల దృష్ట్యా….

యుమా ఆ బొద్దింకను ఫస్ట్ లవ్ అని వ్యవహరిస్తాడు. ఆ బొద్దింకతో నేరుగా లైంగిక సంబంధం కుదరదు కనుక, తాను సంబంధాన్ని ఊహించుకుంటున్నప్పుడు తనను తాను బొద్దింక పరిమాణంలో కాని, లేదా ఆ బొద్దింకను తన పరిమాణంలో కాని ఊహించుకుని సంతృప్తి చెందుతుంటాను అని వివరించాడు.

He Dated A Cockroach Called Lisa For A Year And Ate Her When She Died


లిసా చనిపోయినా కూడా వారి ప్రేమ మాత్రం చావలేదు !

ఏ స్త్రీ కూడా లిసా అంత "హాట్" గా ఉండదు అని అతని ఉద్దేశం! అలాగే అందరికి చెప్తుంటాడు కూడా. అంతేకాకుండా ఒకరి పట్ల ఒకరికి 100 శాతం పరిపూర్ణ ప్రేమను కలిగి ఉన్నామని చెప్తుంటాడు. కానీ లిసా చనిపోయిన రోజు, తనను తినేసి ఈ విచిత్ర ప్రేమకు జిగుప్సాకర ముగింపును ఇచ్చాడు.

He Dated A Cockroach Called Lisa For A Year And Ate Her When She Died

అతను వృత్తిపరంగా ఎంటొమోఫజిస్ట్, క్రమంగా ఇతనికి ఆ ప్రేమ మరింత ఎక్కువైంది...

యుమా వృత్తిపరంగా ఒక ఎంటొమోఫజిస్ట్, అనగా పర్యావరణ సంరక్షణ కోసం మాంసానికి ప్రత్యామ్నాయంగా కీటకాలు తినడం గురించిన అభ్యాసం చేస్తుంటాడు. స్థానికంగా, జపాన్లో “బగ్ ఈటింగ్” పోటీని నిర్వహించే వ్యక్తిగా యుమా ప్రసిద్ది చెందిన వాడు.

He Dated A Cockroach Called Lisa For A Year And Ate Her When She Died

లిసా (బొద్దింక) గురించి మరిన్ని వివరాలు -

యుమా , లీసా గురించిన మరిన్ని వివరాలను వెల్లడించాడు. తను ఒక ఆఫ్రికన్ వ్యవసాయ భూములలో దొరికే బొద్దింక అని చెప్పాడు. మరియు ఒకరితో ఒకరు సంభాషించుకోవచ్చునని అతను తీవ్రంగా నమ్మాడు. దురదృష్టమో, అదృష్టమో కానీ, లిసా చనిపోయిన తర్వాత, ఆమెను తిన్న యుమా, “ఇప్పుడు లిసా తన గుండె మరియు శరీరంలో నివసిస్తుంది” అని చెప్తున్నాడు.

ఈ అసాధారణమైన ప్రేమ కథ గురించి మీరు ఏమనుకుంటున్నారు ? వ్యాఖ్యల విభాగంలో మీ అభిప్రాయాలను పంచుకోండి. ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర, ఆరోగ్య, జీవనశైలి, మాతృత్వ, శిశు సంబంధ, ఆహార, లైంగిక, వ్యాయామ, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి.

English summary

Man Dated a Cockroach and Claimed She was hotter than a girl

uma called the bug his "first love" and claimed that even though the relationship was platonic, he fantasised about bedding his love in either way where he imagined himself to be of insect-size or with Lisa being human-size
Desktop Bottom Promotion