TRENDING ON ONEINDIA
-
మంత్రి ఆదికి షాక్: జమ్మలమడుగు అభ్యర్ధిని తేల్చేసారు
-
మీ పాత కారుని కొత్తగా మార్చటం ఎలా.?
-
రూ.4999కే led hd smart tv, ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకోండి
-
వాళ్లంతా మహానుభావులు.. అమ్మాయిల క్లీవేజ్, తొడలు చూసేస్తారు.. నాగబాబు ఘాటు వ్యాఖ్యలు!
-
కోబ్రా దెబ్బకు షారుఖ్ కంపెనీ గింగిరాలు?
-
చీర కట్టుకోవడాన్ని అమితంగా ఇష్టపడుతారా ? ప్రయాణాలకు ఈ చీరలు
2019లో మీకు వివాహం కానుందో లేదో ఇక్కడ తెలుసుకోండి
ఈ సంవత్సరం వివాహ సంబంధిత విషయాల పట్ల ఆలోచనలు చేస్తున్నారా ? క్రమంగా, 2019 లో వివాహ సంబంధిత అంశాలనందు, సాధ్యాసాద్యాల పరంగా మానసిక గందరగోళం నెలకొందా ?
లేదా మరికొంత కాలం ఎదురుచూడవలసి ఉంటుందా ? అసలు మీ జాతకం ప్రకారం మీ వివాహ సంబంధిత విషయాలు ఎలా ఉండనున్నాయి ? ఇటువంటి అనేక ప్రశ్నలు మిమ్మల్ని కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయా ? అయితే ఈ వ్యాసం మీకోసమే.
మీ రాశి చక్రం ప్రకారం, ఈ 2019 లో మీ వివాహ సంబంధిత విషయాల దృష్ట్యా మీ జాతకం ఎలా ఉండనుందో ఇక్కడ పొందుపరచబడింది. మరిన్ని వివరాల కోసం వ్యాసంలో ముందుకు సాగండి.
మేష రాశి :
మేష రాశి వారు మరికొంత కాలం వేచి ఉండవలసి ఉంటుంది. ఈ సంవత్సరం అనువైన మ్యాచ్ దొరుకుతుందని ఖచ్చితంగా చెప్పడం కష్టం, మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కానీ కంగారు పడవలసిన అవసరం లేదు. మీ ఎదురుచూపులకు తప్పక ఫలితాన్ని పొందగలరు. కొంత ఓపిక అవసరంగా ఉంటుంది. క్రమంగా మంచి అవకాశాలు మీ తలుపు తట్టే సూచనలు ఉన్నాయి. మీ నక్షత్రాలు, మీ బాచిలర్ జీవితాన్ని కొంతకాలం అనుభవించేలా ప్రణాళికలు చేస్తుండవచ్చు. మీరు ఒకవేళ ప్రేమలో ఉన్నా కూడా, పెళ్ళికి సత్వర నిర్ణయాలు కూడదని సూచించడమైనది. లేనిచో కొన్ని ప్రతికూలతలు తలెత్తవచ్చు. ఏది ఏమైనా ఒక ప్రణాళికా బద్దంగా అడుగులు వేయవలసి ఉంటుందని మరువకండి.
వృషభ రాశి :
2019 లో వృషభ రాశి వారికి వివాహ సూచనలు మెండుగా ఉన్నాయి. కాకపొతే, మార్చి వరకు కాస్త గడ్డు కాలమే అని చెప్పవచ్చు. కానీ మార్చి తర్వాత మీకు విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. క్రమంగా ఏప్రిల్ నుండి మీకు సంబంధాల రాక అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి.
మిధున రాశి :
మీ వివాహానికి గత కొన్ని సంవత్సరాలుగా అనేక అడ్డంకులు ఉన్నా, ఈ సంవత్సరం మీకు కలిసొచ్చే కాలంగా ఉంటుందని చెప్పబడింది. మీ రాశి చక్రం ప్రకారం, మీరు మీ భాగస్వామిని కనుగొనే రోజు అతి దగ్గరలోనే ఉంది. మీ జాతకం తనిఖీ చేయించిన తరువాత తేదీని నిర్ణయించుకోండి. పండితుడు సూచించిన మంగళకరమైన తేదీని ఎంచుకోవడం ఉత్తమంగా సూచించబడుతుంది. మీ ప్రయత్నాలు ఫలించే రోజు ఎంతో దూరంలో లేదు, ఎట్టి పరిస్థితుల్లో నిరాశకూడదని గుర్తుంచుకోండి.
కర్కాటక రాశి :
కర్కాటక రాశి వారు ఎటువంటి విషయంలో అయినా ఆచితూచి అడుగులు వేసే రకాలుగా ఉంటారు. మరియు వీరు అత్యంత సహనం కలిగిన రాశి చక్రాలలో ఒకరుగా ఉంటారు. మీకు ఈ సంవత్సరంలో మొదటి రెండు నెలలు, మరియు చివరి రెండు నెలలు అత్యంత పవిత్రమైన మరియు అనుకూలమైన కాలంగా ఉందని గుర్తుంచుకోండి. మరియు మీ ఓపిక మరియు ఆలోచనా ధోరణి మీకు ఉత్తమ భాగస్వామిని తీసుకుని రాగలదు. కావున ఆలస్యానికి చింతించకండి.
సింహ రాశి :
ఈ సంవత్సరం, సమయం మీకు అత్యంత అనుకూలంగా ఉండనుంది. క్రమంగా ప్రేమలో పడటం, మీ ప్రేమకు అంగీకారం తెలుపడం, మీ తల్లిదండ్రులకు భాగస్వామిని పరిచయం చేయడం, లేదా వివాహానికి ప్లాన్ చేయడం వంటి విషయాలు మీకు అనుకూలంగా ఉండగలవు. పండితుడు లేదా జ్యోతిష్కుడు సూచించిన మంగళకరమైన తేదీల్లోనే మీరు ప్లాన్ చేయడం ఉత్తమమని గుర్తుంచుకోండి.
Most Read :నా బాయ్ ఫ్రెండ్ మా అమ్మను కూడా అనుభవించాడు
కన్యా రాశి :
మీ మనసులో ఇదివరకే ఎవరైనా ఉన్న ఎడల, మీ ప్రేమ విజయవంతమయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ముఖ్యంగా జనవరి, ఫిబ్రవరి, మార్చి మరియు ఏప్రిల్ నెలలు మీకు అత్యంత పవిత్రమైనవిగా ఉండనున్నాయి. కానీ, అనతికాలంలోనే పెళ్ళి అంటే, మీరు ఇష్టపడకపోవచ్చు లేదా ఆర్ధిక సామాజిక పరిస్థితులు అనుకూలంగా ఉండకపోవచ్చు. కావున, జూన్, అక్టోబర్ మరియు డిసెంబర్ నెలలలో వివాహానికి పండితుని ద్వారా నిర్ధారించుకోండి..
తులా రాశి :
వివాహ సంబంధిత అంశాల పరంగా, తులా రాశి వారికి అత్యంత అనుకూలంగా ఉండనుంది. కొన్ని సంవత్సరాల నుండి వివాహాది అంశాల పరంగా ఎదురుచూస్తున్న తులా రాశి వారు, ఈ సంవత్సరం శుభవార్తను ఖచ్చ్సితంగా వింటారు. మరియు అన్ని రాశుల వారిలా కాకుండా, వీరికి సంవత్సరమంతా అనుకూలంగానే ఉండనుంది. అంతేకాకుండా, ప్రేమ వివాహమైన, పెద్దలు కుదిర్చిన వివాహమైనా ఏదైనా సరే మీకు అనుకూలంగా ఉండనున్నాయి. కావున ఎట్టి పరిస్థితుల్లో చింతించనవసరం లేదు.
వృశ్చిక రాశి :
మీరు ప్రేమలో లేదా, పెళ్లి సంబంధాల పరంగా ఇదివరకే పురోగతిలో ఉన్న పక్షంలో, మరొక అడుగు వేసి వివాహం దృష్ట్యా ఆలోచనలు చేయడానికి సరైన సమయంగా సూచించబడింది.
వైవాహిక జీవితం ప్రారంభించడానికి ముందుగా మీ భాగస్వామిని మరింత మెరుగ్గా అర్థం చేసుకోవడానికి కొంత సమయం తీసుకోండి. వివాహం అనేక బాధ్యతలతో వస్తుంది. అయితే, మీరు సహజంగానే ఈ ఆలోచనలను కలిగి ఉండవచ్చు. అంతేకాకుండా ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న వారికి మాత్రం ఈ సమయం వివాహానికి అత్యంత పవిత్రమైనదిగా చెప్పబడింది.
Most Read :మూర్ఛవ్యాధి, ఫిట్స్, వాయితో బాధపడేవారికి ఈ చికిత్స బాగా ఉపయోగపడుతుంది
ధనుస్సు రాశి :
ఇప్పటికే సరైన సమయం కోసం ఎదురుచూస్తున్న వారు, ఈ ఏడాది వివాహానికి సన్నద్దమయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మీ జీవితానికి, అనుకూలమైన భాగస్వాములను వెతుక్కునేందుకు అనుకూలమైన సమయం వచ్చింది. మీరు కోరుకున్న వ్యక్తే, మీ జీవిత భాగస్వామిగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
మకర రాశి :
మీరు ఇదివరకే ప్రేమలో ఉంటే, నిర్ణయాలు తీసుకోడానికి సరైన సమయంగా ఈ సంవత్సరం ఉండనుంది. మీ భాగస్వామి మీతో పెళ్ళికి సిద్దమని అంగీకారం తెలిపితే, అవకాశాలను వదులుకోకండి. ఇదివరకే ఏదైనా సంబంధం పట్ల సానుకూలతతో ఉన్న ఎడల, ఆ సంబంధం ఇప్పుడు పీటల మీదకు ఎక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కానీ, ఎటువంటి అనాలోచిత నిర్ణయాలు తీసుకోకుండా, పండితుని సంప్రదించి నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుందని మరవకండి.
కుంభరాశి :
వీరు మరికొంత కాలం వేచి ఉండవలసి ఉంటుంది. మీ భాగస్వామి కుటుంబం గురించిన మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ప్రయత్నించడం మంచిది. అదేమీ తప్పు కాదు. మీరు సింగిల్స్ అయి ఉంటే, ఈ ఏడాది మీరు మీ జీవిత భాగస్వామిని కలిసే సూచనలు ఉన్నాయి. ఏది ఏమైనా ఓపిక అవసరం, అనాలోచిత నిర్ణయాలు మొదటికే చేటును తీసుకు వస్తాయని మరువకండి. మరియు మీరు ఇప్పుడిప్పుడే సంబంధంలోనికి అడుగు పెడుతున్న పక్షంలో, వెంటనే వివాహ సంబంధిత ఆలోచనలు కూడదు అని గుర్తుంచుకోండి. మీ రాశి చక్ర ఫలితాల ఆధారితంగా, మీరు ఈ సంవత్సరం జీవితాన్ని శాసించే వివాహాది అంశాల నందు ఆచితూచి అడుగులు వేయవలసి ఉంటుందని గుర్తుంచుకోండి.
మీన రాశి :
వివాహానికి మీరు ఇదివరకు చేసిన ప్రణాళికలు కొంత ఆలస్యమయ్యాయి. కానీ ఈ సంవత్సరం మీకు సానుకూలంగా ఉండనుంది. ఇది వరకే ఏదైనా మాచ్ గురించిన సానుకూలత ఉన్న నేపధ్యంలో, ముందుకు అడుగులు వేయడం ఉత్తమంగా సూచించబడుతుంది. మీ తెలివితేటలు, నిర్ణయాలలో ఎంతో ముందుచూపును కనపరుస్తాయి. పండితుని సంప్రదించి, శుభప్రదమైన రోజులను ఎంచుకోవడమే తరువాయి.
ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర,ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, ఆరోగ్య, జీవనశైలి, మాతృత్వ, శిశు సంబంధ, ఆహార, లైంగిక, వ్యాయామ, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసం మీద మీ అభిప్రాయాలను క్రింది వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.