Latest Updates
-
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.!
హస్త సాముద్రికం మీ ప్రేమ విషయాలను చెప్పగలదా ?
ఒక వ్యక్తి తన జీవితంలో కలిగి ఉన్న ప్రేమ వ్యవహారాలను బయటకు తీసేందుకు కూడా హస్త సాముద్రికంలో నిర్దిష్టమైన పంక్తులు ఉన్నాయని నిపుణులు చెప్తుంటారు. అరచేతిలో ఉన్న ఈ రేఖలు మీ జీవితంలో మీరు ఎదుర్కొన్న ప్రేమ వ్యవహారాలను, ప్రేమకు సంబంధించిన అనేక విషయాలని పూర్తిగా బహిర్గతం చేస్తాయి. పెళ్లి రేఖ లేదా ప్రేమ రేఖ చేతిలోని చిన్న వేలు దిగువ భాగంలో ప్రారంభమై సమాంతర స్థానంలో వెళ్తూ కనిపిస్తాయి. చిత్రంలో చూపిన విధంగా.

కాబట్టి వ్యాసంలో ముందుకు వెళ్లి హృదయ రేఖ లేదా ప్రేమ రేఖ గురించిన మరిన్ని వివరాలను తెలుసుకోండి. మీ జీవితంలో మీరు ఎదుర్కొన్న ప్రేమ వ్యవహారాల గురించి తెలుసుకోండి. హస్త సాముద్రికం మీ ప్రేమ విషయాలను బహిర్గతం చేసే మార్గాలు :

హార్ట్ లైన్ చిన్నదిగా ఉంటే :
మీ హృదయ రేఖ కొంచం చిన్నదిగా ఉండి, అది మధ్య వేలు వరకు మాత్రమే విస్తరించి వుంటే, అది మీరు స్వీయ నిర్ణయాల మీద ఆధారపడే వ్యక్తిగా, క్రూరమైన ఆలోచనా ధోరణి కలిగి, మరియు అల్ప స్వభావం కలిగిన వ్యక్తిగా సూచిస్తుంది. క్రమంగా కొన్ని విషయాల నందు, ముఖ్యంగా సంబంధాల పరంగా సరైన ఆలోచనలు చేయలేకపోవచ్చు. అంతేకాకుండా ఏదైనా విషయం పట్ల ఆలోచనకు సమయం కేటాయించడం కూడా మీకు నచ్చదు. ఆ ప్రకారంగా, మీ ప్రేమ జీవితం అంత సవ్యంగా ఉండకపోవచ్చు, మరియు తరచూ ఒంటరితనానికి లోనవుతుంటారు.

ప్రేమ రేఖ పొడవుగా ఉంటే :
మీ హృదయ రేఖ లేదా ప్రేమ రేఖ ఎక్కువ పొడవుగా ఉంది అంటే, అది అరచేతి అంచు వరకు విస్తరించి ఉంటుందని అర్ధం. క్రమంగా ఈ రేఖ మిమ్ములను ముక్కుసూటిగా భావించే వ్యక్తిగా సూచిస్తుంది. మీరు సత్వరమార్గాలను అసహ్యించుకుంటారు. ఒక వ్యక్తిగా, మీరు సాధారణంగా శృంగారభరిత వ్యక్తులుగా ఉంటూ , స్వభావంలో ఆచితూచి అడుగులు వేసే వారిలా ఉంటారు. మీరు మీ సంబంధాలలో కూడా విశ్వాసపాత్రులుగా, నిబద్దతను ప్రదర్శించే వారిగా ఉంటారు . మరోవైపు, ప్రేమ మీ బలహీనతగా ఉన్న కారణాన, సంబంధంలో లోటుపాట్లను అధిగమించడం, మీకు కఠినమైన సమయంగా ఉంటుంది.

బృహస్పతి శీర్షం వద్ద ప్రేమ రేఖ ముగుస్తున్న ఎడల :
మీ ప్రేమ రేఖ బృహస్పతి శీర్షం వద్ద ముగుస్తున్న ఎడల, మీరు మీ ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన అంశాలలో గొప్ప కలలు మరియు అంచనాలను కలిగి ఉండేవారిగా సూచిస్తుంది.

బృహస్పతి శీర్షం మరియు శని శీర్షం మధ్య ప్రేమ రేఖ ముగుస్తున్న ఎడల :
మీ ప్రేమ రేఖ బృహస్పతి మరియు శని శీర్షాల మద్యలో ముగుస్తున్న ఎడల, మీరు స్వచ్ఛమైన, మరియు నిజమైన ప్రేమని కలిగి ఉంటారని సూచిస్తుంది. మిమ్ములను మీరు పూర్తిగా మీ సంబంధాలకు అంకితమివ్వడం మూలంగా, ఎల్లప్పుడూ ప్రేమతో కూడిన వాతావరణంలోనే ఉండగలరని చెప్పబడుతుంది.

ప్రేమ రేఖ చివరి భాగంలో విభజన ఉన్న ఎడల :
ప్రేమ రేఖ చివరి భాగంలో రేఖ విడిపోయి లేదా విభజించబడి మరియు కిందుగా వంగినట్లు ఉన్న ఎడల, అది ప్రేమకోసం ఎటువంటి త్యాగానికైనా సిద్దపడే వ్యక్తిత్వానికి చిహ్నంగా ఉంటుంది.

మీరు ప్రేమ రేఖ ముగింపు భాగంలో ఒక త్రిశూలాన్ని కలిగి ఉంటే :
మీ ప్రేమ రేఖ చివరి భాగం త్రిశూలం గుర్తుతో ముగుస్తున్న ఎడల, మీరు శాంతి మరియు సామరస్యానికి చిహ్నంగా, అందరికీ నమ్మకస్తులుగా ఉండే వారిగా సూచిస్తుంది. కానీ దురదృష్టవశాత్తు, మీ ప్రేమ జీవితం కొన్ని క్లిష్ట పరిస్థితుల మధ్య సాగుతుంది. క్రమంగా అనేక ఒడిదుడుకుల మద్య సంబంధాలను కొనసాగించవలసి ఉంటుంది. కానీ, మనోధైర్యంతో ముందుకు సాగితే విజయం మీసొంతం అని గుర్తుంచుకోండి. కష్టిస్తే ఫలితం తప్పకుండా వస్తుంది.



Click it and Unblock the Notifications