Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
ఈ స్పటికాలు బరువు తగ్గడంలో సహాయం చేయగలవు
ఈ స్ఫటికాలను ఉపయోగించడం బరువును తగ్గించడంలో ఉత్తమంగా పనిచేస్తుంది. ఈ రాయిని ధరించినప్పుడు శరీరంలో పేరుకుపోయిన, కొవ్వు నిల్వలను విడుదల చేయడంలో శరీరానికి సహాయపడుతుంది. ఫలితంగా అది మెటబాలిజంను శక్తివంతం
అధిక బరువుతో బాధపడుతున్న సమయంలో, బరువు తగ్గడానికి సూచించదగిన అన్ని మార్గాలను అనుసరించడానికి ప్రయత్నిస్తూ ఉంటాము. క్రమంగా అనేకమంది సలహాలు, ఇంటర్నెట్, వైద్యుల మరియు అనుభవజ్ఞుల సహాయంతో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాము. అదేవిధంగా కొన్ని జ్యోతిష శాస్త్ర నివారణలు కూడా ఇటువంటి విషయాలలో సహాయం చేయగలవని నిపుణుల అభిప్రాయం. అవి బరువు కోల్పోవడంలో దోహదపడుతాయని ఘంటాపధంగా చెప్తున్నారు.
కొన్ని రకాల స్ఫటికాలను జ్యోతిష శాస్త్ర నిపుణుల సూచనల ప్రకారం, చుట్టూ ఉంచుకోవడం లేదా వారు చెప్పిన పద్దతులలో వాటిని వినియోగించడం ద్వారా, బరువు కోల్పోవడంలో ఉత్తమంగా సహాయపడగలవని చెప్పబడుతుంది.

ఈ విధానం గురించిన మరిన్ని వివరాలు ....
గమనిక : ఈ స్ఫటికాలు వాటి వాటి శక్తులచే నిర్వచించబడతాయి, మరియు నిపుణులచే మాత్రమే సూచించబడతాయి. క్రమంగా, ప్రతి వ్యక్తికీ ఫలితాలు భిన్నంగా ఉంటాయని చెప్పబడింది. కావున వీటిని వినియోగించునప్పుడు నిపుణుల సూచనల మేరకే వీటిని అనుసరిస్తున్నారని నిర్ధారించుకోండి.
ఈ స్ఫటికాలను ఉపయోగించడం బరువును తగ్గించడంలో ఉత్తమంగా పనిచేస్తుంది. ఈ రాయిని ధరించినప్పుడు శరీరంలో పేరుకుపోయిన, కొవ్వు నిల్వలను విడుదల చేయడంలో శరీరానికి సహాయపడుతుంది. ఫలితంగా అది మెటబాలిజంను శక్తివంతం చేసి, హార్మోను చర్యలను సంతులనం చేస్తుంది. అంతేకాక, ఈ స్పటికాలు అనేక ఇతరత్రా వైద్య లక్షణాలను సైతం కలిగి ఉంటాయని చెప్పబడింది.

పికాసో మార్బుల్ :
ఈ పికాసో మార్బుల్ బరువు తగ్గడంలో భిన్నమైన మార్గంలో సహాయపడే స్పటికం. ఈ స్పటికం నుండి జనించే శక్తి మీ జీవక్రియలను మెరుగుపరుస్తుంది. మరియు అది మీ స్వీయ జీవక్రియలను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. మరియు మీ పరిసరాల్లో ఈ రాయిని ఉంచడం ద్వారా, మీరు అతిగా ఆహారాన్ని తీసుకోవడాన్ని నిరోధించగలుగుతుంది. ఈ స్పటికానికి గల ఇతర పేర్లుగా పికాస్సో స్టోన్ మరియు పికాసో జాస్పర్ ఉన్నాయి.

గాస్పైట్ :
ఈ స్పటికం కూడా బరువును తగ్గించడంలో అత్యంత ఉపయోగకరంగా ఉంటుంది. జీవక్రియలను ప్రేరేపించే చర్యల కోసంగా ఈ స్పటికం ఉపయోగపడుతుంది. ఈ స్పటికం నెమ్మదిగా శక్తిని ప్రసరింపచేస్తుంది, ఇది మీరు చెడు అలవాట్లను, వ్యసనాలను దూరం చేయడంలో కూడా సహాయం చేయగలదు. అంతేకాకుండా, ఈ స్పటికం శరీరంలో పేరుకున్న నీటి నిలుపుదలని నియంత్రించడానికి లేదా నిరోధించడానికి శక్తిని విడుదల చేస్తుంది. తత్ఫలితంగా, ఇది బరువును గణనీయంగా తగ్గించగలదని చెప్పబడింది.

ఎపిడోట్ :
ఈ స్పటికం, మీ శరీరానికి తగినంత శక్తిని అందివ్వడంలో బాధ్యత తీసుకుంటుంది. అంతేకాకుండా, ఆందోళన, డిప్రెషన్ వంటి అవాంఛిత బరువు పెరుగుదలకు దారితీసే భావోద్వేగ విషయాలని దూరంగా ఉంచడంలో సహాయం చేస్తుంది. కొన్ని మానసిక సమస్యలు కూడా బరువు పెరుగుదలకు కారణం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అటువంటి సందర్భాలలో ఈ స్పటికం అద్భుతంగా పనిచేస్తుందని చెప్పబడింది. అంతేకాకుండా అధికంగా ఆహారం తీసుకోవడాన్ని నిరోధిస్తుంది. క్రమంగా బరువు తగ్గడంలో సహాయం చేస్తుంది.

నిపుణులను సంప్రదించడం
ఏది ఏమైనా ఇటువంటి చర్యలను అనుసరించే ముందు నిపుణులను సంప్రదించడం మంచిది, క్రమంగా మీ పరిస్థితులకు అనుగుణంగా స్పటికాలను సూచించడం జరుగుతుంది.
ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, ఆరోగ్య, జీవనశైలి, ఆహార, లైంగిక, వ్యాయామ, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.



Click it and Unblock the Notifications