Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
New year 2025 rangoli Ideas: కొత్త సంవత్సరం రోజు ఇలాంటి ముగ్గులు వేస్తే.. మీ ఇంట్లో ఆనందం నెలకొంటుంది!
నూతన సంవత్సరం ఆనందం, సానుకూల శక్తి, సరికొత్త ప్రయత్నాలకు చిహ్నంగా చెప్పుకుంటారు. ప్రజలందరూ ఈరోజును తమ స్నేహితులు, బంధువులతో ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. పార్టీలు చేసుకోవడం, గ్రీటింగ్స్ చెప్పుకోవడం వంటివి చేసుకుంటుంటారు. కొత్త పునాదులు నంది అయిన ఈరోజున ప్రజలందరూ తమ ఇంటిని అందంగా, గొప్పగా అలంకరించుకోవడం కూడా చేసుకుంటారు. ఈరోజు ప్రతి ఒక్కరూ తమ తమ ఇంటి ముందు మంచి ముగ్గులు వేసుకొని మురిసిపోతుంటారు.
ఒక్కొక్కరు ఒక్కో రకాల ముగ్గులు వేసుకుంటారు. కొందరు రంగులతో అలంకరిస్తే మరికొందరు దీపాలు పెట్టి మరీ ఆ ముగ్గును అందంగా అలంకరించుకుంటారు. తెల్లవారు జామునే ముగ్గులు వేసి మరీ పడుకుంటారు. అయితే ఈ కొత్త సంవత్సరం రోజు సానుకూల శక్తిని మీ ఇంట్లోకి ఆకర్షించేలా, అందరి కంటే మీ ముగ్గే ఆకర్షణీయంగా నిలిచేలా ముగ్గు వేయండి. ఎలాంటి ముగ్గు వేస్తే బాగుంటుందో మేము ఇక్కడ చెప్తాము దానిని ఫాలో అయిపోండి!
నూతన సంవత్సరం 2025 రంగోలీ డిజైన్‌లు

2025 థీమ్ ముగ్గు
ముగ్గు మధ్యలో "2025" అని రాసి దాని చుట్టూ రంగురంగుల పువ్వులు, ఆకులు మరియు నక్షత్రాల నమూనాను తయారు చేయండి. మెరిసే, ప్రకాశవంతమైన రంగులతో ఈ డిజైన్‌ను అలంకరించండి. అది చూడడానికి చాలా బాగుంటుంది. అలాగే చాలా సులభంగా అయిపోతుంది.

పూల డిజైన్
గులాబీ, పొద్దుతిరుగుడు, తామర పువ్వుల రూపంలో ముగ్గులు వేసుకోవచ్చు. ఇవి పండగ వాతావరణానికి సరిగ్గా సెట్ అవుతాయి. అలాగే వీటిని అలంకరించుకునేందుకు కూడా చాలా అవకాశాలు ఉంటాయి. వీటికి దీపాలు పెట్టడం వల్ల మంచి ఆకర్శణీయత తోడవుతుంది.

సాంప్రదాయ ముగ్గు
పసుపు, బియ్యపు పిండి, కుంకుమలతో చేసిన ముగ్గును వేసుకోవడం చాలా మంచిది. ఇది శుభ కాలానికి ప్రతీక కూడా. అలాగే ఆ రంగులతో వేసిన ముగ్గను దీపాలు, స్వస్తికలతో అలంకరించవచ్చు. ఇలా అలంకరించడం వల్ల సాక్షాత్తు దేవుళ్ళే మన ఇంట్లోకి వస్తారనే ప్రతీతి ఉంది.

నెమలి డిజైన్
కొత్త సంవత్సరం రోజు ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఈ నెమలి రంగు ముగ్గు కచ్చితంగా ఉంటుంది. ఈ ముగ్గును మీరు కూడా కొంచెం కొత్తగా వేసుకోవచ్చు. కొన్ని రంగులతో నెమలి ముగ్గును వేసుకోవాలి. దాని మధ్యలో ఒక సర్కిల్ చేసుకొని "హ్యాపీ న్యూ ఇయర్" అని వ్రాయండి. ప్రతి వైపు ఆకు డిజైన్లను జోడించండి. ఈ డిజైన్ ఇల్లు మరియు ఆఫీసు వరండాలో ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

ఫన్నీ కార్టూన్ ముగ్గు
పిల్లలను సంతోషపెట్టడానికి వెల్‌కమ్ 2025 ముగ్గు చాలా బాగుంటుంది. అలాగే గుండెను చేతిలో పట్టుకుని అందమైన కుందేలును అందులో గీయండి. మధ్యలో "వెల్కమ్ 2025" అని వ్రాయండి. రంగు రంగులతో దానిని అలంకరిస్తే అది అద్భుతంగా కనిపిస్తుంది.




Click it and Unblock the Notifications