Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్‌లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
మేకప్ లేదు, ప్లానింగ్ లేదు.. అయినా కోట్లాది మంది మనసు దోచారు..2025 టాప్ 5 వైరల్ గర్ల్స్
టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న ఈ కాలంలో అదృష్టం ఎప్పుడు, ఏ రూపంలో తలుపు తడుతుందో ఎవరూ ఊహించలేరు. ముఖ్యంగా సోషల్ మీడియా వచ్చాక, ఒక్క వీడియో లేదా ఒక్క ఫోటోతో జీవితాలు మారిపోతున్నాయి. 2025 సంవత్సరం కూడా ఇందుకు మినహాయింపు కాదు.
ఎలాంటి ప్లానింగ్ లేకుండా కేవలం యాదృచ్ఛికంగా కెమెరా కంటికి చిక్కి 2025లో రాత్రికి రాత్రే కోట్లాది మంది నెటిజన్ల మనసు దోచుకున్న ఐదుగురు మిస్టరీ గర్ల్స్ గురించి ఇప్పుడు చూద్దాం.

కుంభమేళా సెన్సేషన్ మోనాలిసా
అందం అలంకరణలోనే ఉండదు సహజత్వంలో ఉంటుందని నిరూపించింది మోనాలిసా. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్ రాజ్ లో 2025 ఏడాది ప్రారంభంలో జరిగిన మహా కుంభమేళాలో పూసలు అమ్ముకునే ఈ సాధారణ యువతి తన కళ్ళలోని అమాయకత్వంతో నెటిజన్లను కట్టిపడేసింది.
ఎవరో తీసిన వీడియో ద్వారా ఆమె వెలుగులోకి వచ్చింది. ఆ వీడియోలోని ఆమె సౌందర్యాన్ని చూసి ఫిదా అయిన జనం ఆమెను స్టార్ ను చేశారు. ఈ సోషల్ మీడియా క్రేజ్ ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ప్రస్తుతం మోనాలిసా ఏకంగా సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టి టాలీవుడ్ లో కూడా సినిమా హీరోయిన్ అయిందంటే సోషల్ మీడియా పవర్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.

ఐపీఎల్ బ్యూటీ ఆర్యప్రియ భూయాన్
క్రికెట్ మ్యాచ్ లంటే కేవలం ఆట మాత్రమే కాదు గ్యాలరీలోని మెరుపులు కూడా. IPL-2025 సీజన్ లో గౌహతికి చెందిన 19 ఏళ్ల విద్యార్థిని ఆర్యప్రియ భూయాన్ ఇలాగే వెలుగులోకి వచ్చింది.
చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో... ఎంఎస్ ధోనీ అవుటైన సమయంలో ఆమె ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ ని కెమెరామెన్ స్క్రీన్ పై చూపించడమే ఆలస్యం ఆమె రాత్రికి రాత్రే నేషనల్ క్రష్ గా మారిపోయింది. ఆమె రియాక్షన్ ఎంత వైరల్ అయిందంటే సోషల్ మీడియాలో మీమ్స్ వెల్లువలా వచ్చాయి. ఒక్క దెబ్బతో ఆమె ఫాలోవర్ల సంఖ్య లక్షల్లో పెరిగిపోయింది.

మహికా శర్మ
టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యాతో కలిసి కనిపించడంతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది మహికా శర్మ. ఎకనామిక్స్, ఫైనాన్స్ లో డిగ్రీ చేసిన ఈ 24 ఏళ్ల భామ.. మనీష్ మల్హోత్రా, అనితా డోంగ్రే వంటి టాప్ డిజైనర్ల కోసం ర్యాంప్ వాక్ చేసింది.
మోడలింగ్ లో రాణిస్తున్నప్పటికీ, హార్దిక్ తో కలిసి కనిపించిన ఆ ఒక్క సందర్భం ఆమెకు ఎనలేని పాపులారిటీని తెచ్చిపెట్టింది. ఇప్పుడు ఆమె సోషల్ మీడియాలో మోస్ట్ సెర్చ్డ్ సెలబ్రిటీలలో ఒకరిగా నిలిచింది.

గౌరీ స్ప్రాట్
బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ ఆమీర్ ఖాన్ స్వయంగా తన గర్ల్ ఫ్రెండ్‌గా పరిచయం చేయడంతో గౌరీ స్ప్రాట్ పేరు ఇంటర్నెట్ ను షేక్ చేసింది. ఆమె బ్యాక్ గ్రౌండ్ చాలా వైవిధ్యంగా ఉంటుంది.
తండ్రి తమిళ్ బ్రిటిష్ కాగా, తల్లి పంజాబీ ఐరిష్. కానీ ఆమె మనసు మాత్రం పూర్తిగా భారతీయమే. బెంగళూరులో నివసిస్తూ, ఆమీర్ ఖాన్ ప్రొడక్షన్ హౌస్‌లో పనిచేస్తున్న గౌరీ.. ఇప్పుడు బాలీవుడ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్.

అలీషా ఓహ్రి
అంతర్జాతీయ వేదికలపై భారతీయ అందాన్ని చాటిచెప్పిన ఘనత అలీషా ఓహ్రీది. బల్గేరియాలో జరిగిన ప్రతిష్టాత్మక మిసెస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొని మిసెస్ పాపులర్ టైటిల్ గెలుచుకోవడంతో ఆమె పేరు వైరల్ అయ్యింది.
వృత్తిరీత్యా మేకప్ ఆర్టిస్ట్, ఫ్యాషన్ డిజైనర్ అయిన అలీషా.. మిసెస్ ఇండియా వంటి అనేక కిరీటాలను తన ఖాతాలో వేసుకుంది. ఆమె విజయాలు స్టైల్ ఇప్పుడు ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచాయి.



Click it and Unblock the Notifications