Latest Updates
-
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.!
తగ్గేదేలే.. పుట్టిన నిమిషానికే డాక్టర్‌తో పోటీ.. లక్షల వ్యూస్‌తో దూసుకుపోతున్న వైరల్ వీడియో
అప్పుడే పుట్టిన పసికందును చేతుల్లోకి తీసుకోవాలంటేనే చాలా భయం, వణుకు పుడుతుంది. ఎక్కడ చేతుల్లో సరిగా పొదివి పట్టుకోలేమోనని భయమేస్తుంటుంది. అంత సున్నితంగా ఉంటారు నవజాత శిశువులు. కానీ ఇక్కడ మాత్రం సీన్ రివర్స్.. ఈ పసికందు మాత్రం ఏకంగా తన చేతుల్లో బాహుబలి బలాన్ని ప్రదర్శించాడు. ఆ వీడియో వైరల్ అవుతోంది.

సోషల్ మీడియాలో నిత్యం చాలా సంఘటనలు వైరల్ అవుతుంటాయి. కొన్ని నవ్వు తెప్పిస్తే, మరికొన్ని ఆలోజింపజేస్తాయి. మరికొన్ని కోపం తెప్పిస్తాయి. ఇంకొన్ని వీడియోలు ఆశ్చర్యపరుస్తాయి. ఈ వీడియో కూడా అలాంటిదే.. ఈ క్లిప్ ఇప్పుడు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. బుడ్డోడి బలానికి ఫిదా అవుతున్నారు. లిటిల్ బాహుబలిగా మన్ననలు అందుకుంటున్నాడు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే..
ఒక ఆస్పత్రిలో అప్పుడే పుట్టిన పసికందును వైద్యులు బెడ్‌పైన పడుకోబెట్టారు. ఈ క్రమంలో డాక్టర్ శిశును పరీక్షించేందుకు స్టెతస్కోప్‌ను తీసుకున్నాడు. అయితే ఇంకా బొడ్డు కూడా తెగని ఆ పసికందు.. వెంటనే తన చిన్ని చేతులతో స్టెతస్కోప్‌ను పట్టుకున్నాడు. డాక్టర్ చిన్నారి చేతిలో నుంచి స్టెతస్కోప్‌ను విడిపించే ప్రయత్నించే చేసినా ఫలితం లేదు. దానిని ఎంత బలంగా పట్టుకున్నాడంటే డాక్టర్ ఎంత గట్టిగా ప్రయత్నించగా స్టెతస్కోప్‌ను వదల్లేదు. దీంతో చివరికి డాక్టర్ తన చేతులు వదిలేయాల్సి వచ్చింది.
ఈ వీడియో మొదట చూసినప్పుడు ఆశ్చర్యంగా అనిపించినప్పటికీ ఇది పూర్తిగా సాధారణమేనని వైద్యులు అంటున్నారు. పుట్టిన తర్వాత నవజాత శిశువులకు వస్తువులను పట్టుకునే సహజ అలవాటు ఉంటుందని చెబుతున్నారు. డాక్టర్లు తరచుగా శిశివు చేతిలో వేలు లేదా వస్తువును ఉంచి వారి ప్రతిచర్యలను, నాడీ సంబంధిత ప్రతిస్పందనలను పరీక్షిస్తుంటారు.
లక్షల్లో వీక్షణలు
ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. కోటికి పైగా వ్యూస్‌తో దూసుకుపోతుంది. 10 లక్షలకు పైగా నెటిజన్స్ లైక్ చేశారు. కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. పుట్టిన వెంటనే చిన్నారి బాహుబలి మోడ్‌లోకి వెళ్లిపోయాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. తల్లి గర్భంలో బాగానే ఉన్నాను.. నన్నెందుకు బయటకు తీశారంటూ డాక్టర్‌ను స్టెతస్కోప్ పట్టుకుని గట్టిగా నిలదీస్తున్నాడంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు.
ఇంట్రస్టింగ్ కామెంట్స్
ఈ బుడ్డోడు గత జన్మలో డాక్టర్ అయి ఉంటాడని కొందరు వ్యాఖ్యానించారు. మరికొందరు ఫ్యూచర్ డాక్టర్ అంటూ ప్రశంసలు కురిపించారు. చాలా క్యూట్ వీడియో అని కొందరు.. చిన్నారి ముఖంలో ఆటిట్యూడ్ స్పష్టంగా కనిపిస్తోందని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. పిల్లాడు పుట్టగానే పెద్దవాడయ్యాడంటూ మరికొందరు ప్రశంసించారు. ఏదేమైనా ఈ చిన్నారి బాహుబలి వీడియో ట్రెండింగ్‌లో ఉంది.



Click it and Unblock the Notifications
