Latest Updates
-
వాతావరణ మార్పులతో మోకాళ్ల నొప్పుల బాధలు.. ఉపశమనం కోసం ఇంట్లోనే ఇలా చేయండి.! -
తిరోగమనం నుంచి బయటపడ్డ బుధ గ్రహం.. ఇక ఈ రాశుల వారి దశ తిరిగినట్లే.! -
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.!
అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య త్వరలోనే విడాకులు తీసుకుంటున్నారా..? నమ్మలేని నిజాలు..!
అభిషేక్ బచ్చన్ ఐశ్వర్యారాయ్ గత 16 ఏళ్లుగా ఎటువంటి గొడవలు లేకుండా వున్నారు. వీరిద్దరికీ ఆరాద్య అనే పాప కూడా పుట్టింది. కానీ వీరిద్దరూ త్వరలో విడాకులు తీసుకోబోతున్నారనే వార్త వినిపిస్తోంది. ఐశ్వర్యాయ్ 1973 కర్నాటకలోని మ్యాంగలోర్‌లో జన్మించారు. చిన్నతనంలోనే ఐశ్వర్య కుటుంబం మ్యాంగలోర్ నుంచి ముంబై వెళ్లి సెటిల్ అయ్యారు. ఐశ్వర్యకు చిన్నప్పటి నుంచే మోడల్, నటి కావాలని చాలా ఆసక్తి వుండేది. ఐశ్వర్య అందాన్ని చూసి మోడలింగ్‌కు సపోర్ట్ చేయడానికి కొంతమంది ప్రముఖులు ముందుకు వచ్చారు. దీంతో ఐశ్వర్య తన చదువును మధ్యలోనే వదిలిపెట్టి మోడలింగ్‌లో అడుగుపెట్టింది. 1991లో ఫోర్డ్ సంస్థ నిర్వహించిన మోడలింగ్ కాంటెస్ట్ లో నెగ్గి మంచి స్థానాన్ని సంపాదించుకుంది.

1994లో మిస్ ఇండియా టైటిల్‌కు పోటీ చేస్తే సుశ్మితా సేన్ టైటిల్ గెలుచుకోగా, ఐశ్వర్య రన్నరప్‌గా నిలిచింది.తరువాత ఐశ్వర్య సినిమాల్లో నటిస్తూ చాలా టీవీ యాడ్స్‌లో కనిపించింది. బాలీవుడ్ లో సినిమాలకు ప్రయత్నించినా ముందుగా సౌత్ ఇండస్ట్రీలోనే ఆమెకు జీన్స్ లాంటి ఎన్నో చిత్రాల్లో విజయం సాధించింది.1999 హమ్ దిల్ దే చుకేసనమ్ సినిమాలో ఐశ్వర్యకు బాలీవుడ్‌లో బంపర్ ఆఫర్ దొరికినట్టైంది. తరువాత బాలీవుడ్‌లో చాలా అవకాశాలు వచ్చాయ్. సల్మాన్ ఖాన్‌తో ప్రేమలో పడి ఇద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. కానీ ఐశ్వర్య కుటుంబానికి సల్మాన్ ఖాన్ నచ్చలేదు.
సల్మాన్ ఖాన్ ఐశ్వర్యతో పెళ్లి ప్రస్తావన తీసుకొని వచ్చినా ఐశ్వర్య దాన్ని తిరస్కరించేదని టాక్ వినిపించింది. ఐశ్వర్య కేవలం అవకాశాల కోసం మాత్రమే సల్మాన్‌తో డేటింగ్‌కి వెళ్లేది కానీ పెళ్లి చేసుకోవాలనే ఆలోచనతో కాదని పుకార్లు లేచాయ్. తాల్ సినిమా దర్శకుడు సుభాష్ గాయ్‌తో ఐశ్వర్య సన్నిహితంగా అప్పట్లో కొన్ని ఫోటోలు బయటపడ్డాయ్. ఈ విషయం సల్మాన్ ఖాన్‌కు తెలిసింది. మూవీ సెట్‌లోకి వెళ్లి మరీ సుభాష్ గాయ్‌కు కొట్టి, ఐశ్వర్యకు వార్నింగ్ కూడా ఇచ్చాడని తెలిసింది. ఈ విషయం తో ఐశ్వర్య సీరియస్ అయి సల్మాన్‌తో మాట్లాడ్డం ఆపేసిందని టాక్ నడిచింది. ఎలాగైనా సల్మాన్‌ను వదిలించుకోవాలని షారుఖ్‌ఖాన్‌కు దగ్గరైంది. ఇది కూడా సల్మాన్‌కు నచ్చలేదు. దీంతో ఐశ్వర్య ఎలాగైనా సల్మాన్‌తో వున్న మూడేళ్ల బంధానికి ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంది.
తరువాత వివేక్ ఓబెరాయ్‌తో సినిమా చేయడంతో వివేక్‌తో కలిసి కూడా ఐశ్వర్య డేటింగ్ చేసింది. సల్మాన్ వివేక్ ఓబెరాయ్‌ను కూడా బెదిరించడం, ఆ విషయం వివేక్ ఓబెరాయ్ కెమెరా ముందు చెప్పడంతో ఈ విషయం వైరల్‌గా మారింది. దీంతో వివేక్ ఓబెరాయ్‌తో కూడా ఐశ్వర్య బ్రేకప్ చేసుకుంది. 2000ల సంవత్సరం నుంచి అభిషేక్ బచ్చన్‌తో ఐశ్వర్యకు పరిచయం వుంది. ఇద్దరూ కలిసి కుచ్ నా కహో, గురూ సినిమాల్లో నటించారు. గురు సినిమా షూటింగ్‌తో పెళ్లి చేసుకుంటానని అభిషేక్‌కు ఐశ్వర్య ప్రపోజ్ చేసింది. అయితే అప్పటికే కరిష్మాకపూర్‌తో అభిషేక్‌కు ఎంగేజ్మెంట్ అయినా బ్రేకప్ చేసుకొని ఐశ్వర్యను పెళ్లి చేసుకున్నాడు.
2007లో అభిషేక్, ఐశ్వర్యకు పెళ్లి అయింది. 2011లో ఆరాధ్య అనే కూతురు కూడా పెట్టింది. ఐశ్వర్యకు జయా బచ్చన్‌తో గొడవలు రావడంతో భర్తతో కలిసి వేరే కాపురం పెట్టింది. తరువాత ఐశ్వర్య రన్‌బీర్ కపూర్‌తో హే దిల్ హే ముష్కిల్ సినిమాలో నటించిండం, కొన్ని రొమాంటిక్ సీన్లలో నటించడం అభిషేక్‌కు నచ్చలేదు. ఐశ్వర్య తండ్రి మరణించడంతో తల్లిని ఐశ్వర్య తన దగ్గరకు తీసుకొని వచ్చింది. అప్పటి నుంచి ఇద్దరి మధ్య మనస్పర్ధలు, గొడవలు ఎక్కువగానే అయ్యాయని మీడియాలో చాలా వార్తలు వచ్చాయ్. బయట కలిసి ఉన్నట్టుగానే అనిపించినా ఇద్దరూ విడిపోయే ఉన్నరాని సినీటౌన్‌లో టాక్ నడిచింది.
ఇటీవల అనంత్ అంబానీ పెళ్లి వేడుకలో కూడా కూతురుతో కలిసి, కూతురుతో మాత్రమే మీడియా ముందుకు రావడంతో అప్పటి నుంచి ఐశ్వర్య, బచ్చన్ మధ్య ఏదో జరిగిందని టాక్ నడుస్తోంది. ప్రముఖ రచయిత్రి హీనా ఖండేవాలా తన ఇన్‌స్ట్రాగ్రాంలో విడాకుల గురించి ఒక పోస్టు వేసింది. ఆ పోస్టులలో విడాకులు ఎవ్వరికీ ఈజీ కాదని, మనం అనుకున్నట్లు జీవితం సాగదని అందులో వుంది. ఈ పోస్టును అభిషేక్ బచ్చన్ లైక్ చేయడంతో వీరిద్దరి మధ్య విడాకులు గురించి చర్చ బయటకు వచ్చింది.



Click it and Unblock the Notifications