Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
Chanakya Niti : జీవితంలో గొప్ప స్థాయికి వెళ్లాలని ఉందా? ఇది తెలియకుంటే బతుకు బస్టాండే!
ఆచార్య చాణక్యుడు ప్రాచీన భారతదేశంలోని గొప్ప పండితులలో ఒకరు. ఆయన సూత్రాలు, బోధనలు ఇప్పటికీ చాణక్య నీతి పేరిట పుస్తకాల రూపంలో లభిస్తున్నాయి. మనిషి ఎప్పుడు, ఎవరితో ఎలా ప్రవర్తించాలో ఆయన చెప్పినట్లు బహుశా మరెవరూ చెప్పి ఉండరు. ఆచార్య చాణక్యుడు మానవుల సద్గుణాలు,దుర్గుణాల గురించి తన చాణక్యనీతి గ్రంధం ద్వారా క్లియర్ గా చెప్పాడు. ఒక వ్యక్తి జీవనశైలి, లక్షణాలు,లోపాలే అతని జీవితాన్ని నిర్ణయిస్తాయని చాణక్యుడు చెప్పాడు.
మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరిలోనూ కొన్ని లోపాలు ఉంటాయి. ఈ లోపాలలో కొన్నింటిని సరైన సమయంలో మీ నుండి తొలగించుకోకపోతే జీవితాంతం బాధపడవలసి ఉంటుందని చాణక్యుడు చెప్పారు. చాణక్యుడి ప్రకారం వ్యక్తి జీవితంలో ఏ లక్షణాలు వారి వైఫల్యానికి కారణమవుతాయో చూడండి.
జీవితంలో విజయం సాధించాలంటే వీటికి దూరంగా ఉండాలి
అశాంతి చెందిన మనస్సు
జీవితంలో సంతోషంగా ఉండటానికి ప్రశాంతమైన మనస్సు చాలా ముఖ్యమని ఆచార్య చాణక్యుడు తెలిపారు. అశాంతిగల మనస్సు ఉన్నవారు ఎప్పటికీ సంతోషంగా ఉండలేరు. చంచలమైన మనసున్న వ్యక్తులు జీవితంలో సంతోషంగా ఉండలేరు లేదా ఏ పనినీ బాగా చేయలేరు. వారి జీవితాలు ఎల్లప్పుడూ ప్రమాదాలు, సమస్యలు, పరిస్థితులతో నిండి ఉంటాయి. ఈ లోపం ఉన్నవారు జీవితంలో అనేక వైఫల్యాలను ఎదుర్కొంటారు.
సోమరితనం
సోమరితనం ఉన్నవారు జీవితంలో ఏమీ సాధించలేరని చాణక్యుడు చెప్పాడు. విజయం కోసం నిరంతరం కృషి చేయాలి. జీవితంలోని కష్టాలను అధిగమించడంలో కష్టపడి పనిచేయడం మాత్రమే మీకు సహాయపడుతుందని చాణక్యుడు చెప్పాడు.
అజ్ఞానం
చాణక్యుడి ప్రకారం పుస్తక జ్ఞానమైనా, లేదా అనుభవం ద్వారా పొందిన జ్ఞానమైనా అది ఎప్పటికీ వృధా కాదు. జ్ఞానం లేదా అనుభవం లేని వ్యక్తి జీవితంలో విజయం సాధించడం చాలా కష్టం.

మానసిక నియంత్రణ లేని వ్యక్తులు
ఎవరి మనస్సు వారి నియంత్రణలో లేకపోతే వారు ఏ పనినీ సరిగ్గా చేయలేరు. అస్థిర మనస్సు ఉన్న వ్యక్తులు ఏ పనిపైనా దృష్టి పెట్టలేరు, విజయం సాధించలేరు. ఇది ఒకరి వైఫల్యానికి అతి ముఖ్యమైన కారణం.
వ్యక్తిగత దుష్ప్రవర్తన
వ్యక్తిగత క్రమశిక్షణ లేని వ్యక్తులు జీవితంలో విజయం సాధించలేరు. క్రమశిక్షణ లేనివారు విజయం సాధించినా అది ఎక్కువ కాలం ఉండదు. విజయం సాధించాలంటే మీ పనిని క్రమశిక్షణతో,నిజాయితీతో చేయడం చాలా ముఖ్యం. క్రమశిక్షణ, నిజాయితీ లేకుండా ఎవరూ విజయం సాధించలేరు.



Click it and Unblock the Notifications