Latest Updates
-
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.?
Ileana D'Cruz: పెళ్లి కాకుండానే తల్లికాబోతున్న ఇలియానా, అతగాడు ఎవరు?
తన వయ్యారాలతో టాలీవుడ్ లో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న నటి ఇలియానా. దేవదాస్ చిత్రం నుండి ఈ బ్యూటీ ఫిగర్ కు కుర్రాళ్లు వెర్రెత్తిపోయే వారు. మహేష్ బాబు పూరీ జగన్నాథ్ కాంబోలో వచ్చిన పోకిరి సినిమాలో ఈ అమ్మడి అందాలను అందరూ ఫిదా అయిపోయారు. చాలా చిత్రాల్లో తన పరువాలతో ఫ్యాన్స్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది.
ఈ గోవా బ్యూటీ అందానికి పడిపోని కుర్రాకారు లేదు. అంతలా ఆరాధ్య తారగా ఓ వెలుగు వెలిగింది ఇలియానా. ఈ మధ్య ఎప్పుడో ఒకప్పుడు మాత్రమే సినిమాల్లో కనిపిస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియా ద్వారా మాత్రం ఫ్యాన్స్ కు ఎప్పుడూ టచ్ లోనే ఉంటూ వస్తోంది.

తాజాగా ఈ బ్యూటీ తన ఇన్ స్టాగ్రామ్ లో పెట్టిన పోస్టు వైరల్ గా మారింది. ఇలియానా రెండు ఫోటోలు షేర్ చేసింది. ఒక ఫోటోలో 'అడ్వెంచర్ మొదలైంది' అనే క్యాప్షన్ ఉన్న టీషర్టు ఉండగా.. మరో దాంట్లో మెడలో 'మామా'(అమ్మ) అనే అక్షరాలతో ఉన్న పెండెంట్ ఉంది. ఈ పోస్టుకు 'కమింగ్ సూన్.. మై లిటిల్ డార్లింగ్ ను కలిసేందుకు ఆత్రుతగా ఎదురుచూస్తున్నా' అనే క్యాప్షన్ ఇచ్చింది అందాల నిధి.
ఇలియానా పెట్టిన ఈ పోస్టుపై ఆమె తల్లి కామెంట్ చేశారు. 'గ్రాండ్ వెల్కమ్ టూ మై గ్రాండ్ బేబీ' అంటూ తన ఆనందం వ్యక్తం చేసింది. తను ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని స్వీట్ గా చెప్పిన ఇలియానాకు నెటిజన్లు కంగ్రాట్స్ చెబుతున్నారు. 'ఇలియానా నీకు పెళ్లి ఎప్పుడైంది', 'మీ ఫ్యామిలీ ఫోటో షేర్ చేయండి' అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.

ఇలియానా బిడ్డకు తండ్రి ఎవరు?
గతంలో ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫర్ ఆండ్రూను పెళ్లాడింది ఇలియానా. అయితే ఆ పెళ్లి బంధం చాలా తక్కువ కాలంలోనే పెటాకులైంది. అప్పటి నుండి ఇలియానా సింగిల్ గానే ఉంటూ వచ్చింది. ప్రస్తుతం ఆమె పెళ్లి చేసుకుందా? లేదా ఎవరితోనైనా డేటింగ్ చేస్తుందా? అతగాడు ఎవరు? అనే విషయాలు మాత్రం ఇంకా తెలిసిరాలేదు.
మరి ఇలియానా తన బాయ్ ఫ్రెండ్ లేదా భర్తను ఎప్పుడు పరిచయం చేస్తుందో చూడాలి. అయితే ఇలియానా పెళ్లి చేసుకోలేదని దత్తత ద్వారా సరోగసీ ద్వారా బిడ్డకు జన్మనిస్తుందని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. నిజానిజాలు తెలియాలంటే ఇలియానా స్వయంగా చెప్పే వరకు ఆగాల్సిందే.



Click it and Unblock the Notifications