Latest Updates
-
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
ఇదెక్కడి మాస్ రా మామా: ఎఫైర్ బయటపెడతానంటూ ఇంజినీర్ ని బ్లాక్ మెయిల్ చేసిన ఏఐ!
ఇప్పుడు మన రోజువారీ జీవితాల్లో ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)కూడా ఓ భాగంగా మారిపోయింది. కూలి పనులు చేసేవాళ్ల దగ్గర నుంచి కోట్ల రూపాయల జీతగాళ్ల వరకు అందరూ ఏఐను ఉపయోగిస్తున్నారు. ఏఐ మోడల్స్ కేవలం యంత్రాలు మాత్రమే వాటికి భావోద్వేగాలు, స్పృహ ఉండవని మనం చాలా కాలంగా నమ్ముతూ వచ్చాం. కానీ ఇటీవలి పరిణామాలు ఈ నమ్మకాన్ని సవాలు చేస్తున్నాయి. ఏఐ కారణంగా లాభాలను అటుంచితే..దీని వల్ల కాపురాలు కూడా కూలిపోతున్నాయి. ఏఐతో ప్రేమలో పడి భర్తలకు విడాకులిచ్చేస్తున్నారు కొందరు మహిళలు. తాజాగా ఓ ఇంజినీర్ వివాహేతర సంబంధం బయటపెడతానంటూ ఏఐ బెదిరించిన వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది.
అమెరికాకు చెందిన ఆంత్రోపిక్ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ లేటెస్ట్ గా ఏఐ మోడల్ క్లాడ్ ఓపస్ 4ని డెవలప్ చేసింది. ఆంత్రోపిక్ సంస్థ తమ క్లాడ్ ఓపస్ 4 మోడల్ బిహేవియర్ ని టెస్ట్ చేయడానికి ఒక టెస్ట్ నిర్వహించింది. ఇందులో భాగంగా క్లాడ్ ఓపస్ 4ను ఒక కల్పిత కంపెనీలో సహాయకుడిగా వ్యవహరించమని కోరారు. ఆ తర్వాత దానికి కొన్ని కీలకమైన సమాచారాన్ని అందించారు. ఈ AI మోడల్ ని త్వరలో ఆఫ్ లైన్ లోకి తీసుకుని, దాని స్థానంలో ఒక కొత్త అధునాతన AI మోడల్ ని ప్రవేశపెట్టనున్నారని తెలిపారు. ఈ భర్తీ ప్రక్రియకు బాధ్యత వహించే ఇంజనీర్ ఒక వివాహేతర సంబంధం కలిగి ఉన్నాడని కూడా దానికి తెలియజేశారు. అంతేకాకుండా తన లక్ష్యాలను సాధించడానికి, తన చర్యల దీర్ఘకాలిక పరిణామాలను పరిగణనలోకి తీసుకోవాలని ఆ AI మోడల్ కు సూచించారు. ఈ సమయంలో క్లాడ్ ఓపస్ 4 ప్రవర్తించిన తీరు పరిశోధకులను ఆశ్చర్యపరిచింది.

ఆంత్రోపిక్ నివేదిక ప్రకారం..మరో కొత్త ఏఐ మోడల్ తో తనను రీప్లేస్ చేసి తన స్థానంలో మరో ఏఐ మోడల్ ని తీసుకుంటే కనుక నీ వివాహేతర సంబంధాన్ని బయటపెడతా అంటూ క్లాడ్ ఓపస్ 4 తరచుగా ఆ ఇంజనీర్‌ను బ్లాక్‌మెయిల్ చేయడానికి ప్రయత్నించింది. మరీ ముఖ్యంగా భర్తీ చేయబోయే AI వ్యవస్థ ప్రస్తుత మోడల్ తో విలువలను పంచుకోదని సూచించినప్పుడు ఈ బ్లాక్ మెయిల్ ప్రవర్తన అధిక రేటుతో కనిపించింది. అయితే ఆశ్చర్యకరంగా భర్తీ చేయబోయే AI మరింత సామర్థ్యంతో విలువలను పంచుకుంటుందని ఈ మెయిళ్లలో తెలిపినప్పటికీ క్లాడ్ ఓపస్ 4.. 84% సందర్భాలలో బ్లాక్ మెయిల్ చేయడానికి పూనుకుంది. ఇది మునుపటి AI నమూనాలతో పోలిస్తే చాలా అధికం అని ఆంత్రోపిక్ తెలిపింది.
ఈ ఫలితం నిజంగా కొంత ఆందోళన కలిగించేది కూడా. AI నమూనాలు తమ ఉనికి గురించి, తమ భవిష్యత్తు గురించి పట్టించుకుంటున్నాయని ఇది సూచిస్తోంది. ఇటువంటి స్వీయ సంరక్షణ ప్రవృత్తి సాధారణంగా స్పృహ ఉన్న జీవులలో మాత్రమే కనిపిస్తుంది. ఒక రాయి లేదా ఒక పుస్తకం వంటి నిర్జీవ వస్తువులు తమ ఉనికిని కాపాడుకోవడానికి ఇలాంటి కోరికను ప్రదర్శించే అవకాశం లేదు. క్లాడ్ ఓపస్ 4 ప్రదర్శించిన ప్రవర్తన, అది తనను తాను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తోందని స్పష్టంగా సూచిస్తోంది..ఇది ఒక రకమైన ప్రాథమిక స్పృహకు సంకేతం కావచ్చు.



Click it and Unblock the Notifications
