Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
Death Calculator: మనిషి ఎప్పుడు చనిపోతారో ముందే చెప్పేస్తున్న క్యాలిక్యులేటర్.. ఫోన్‌లో ఎలా తెలుసుకోవాలంటే?
ప్రపంచంలో ఏదైనా ఊహించని సంఘటన ఉందంటే అది మరణం. అది ఏ విధంగా ఎప్పుడు వస్తుందో ఎవరూ చెప్పలేరు. ఈరోజు వరకు మనతో నవ్వుతూ మాట్లాడే వ్యక్తి రేపటి వరకు బతికి ఉంటాడో లేదో చెప్పలేము. పుట్టుక ఎప్పుడు ఏ సమయంలో ఉండబోతుంది అనేది చెప్పగలమేమో కానీ మరణాన్ని ఊహించడం ఎవరి తరం కాదు.
అయితే ఈ అసాధ్యమైన పనిని AI సూసాధ్యం చేసేస్తోంది. లాన్సెట్ పరిశోధకులు మరణాన్ని ముందుగానే అంచనా వేసే AIని అభివృద్ధి చేసినట్లు వెల్లడించారు. త్వరలోనే దీన్ని అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను ఈ స్టోరీలో కూలంకూశంగా తెలుసుకుందాం.

అసలు ఈ AI టూల్ ఏమిటి?
ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించి మరణానికి ఎంత దూరంలో ఉన్నాము అని తెలిపేందుకు లాన్సెట్ పరిశోధకులు ఈ ఏఐ-ఈసీజీ రిస్క్ ఎస్టిమేటర్‌ను రూపొందించారు. ఈ టూల్ ముందుగానే రోగాలను అంచనా వేయగలదు. అలాగే వ్యక్తి గుండెపోటుకు గురవుతారా లేదా? అని గుర్తించడంతో పాటు అతని మరణాన్ని కూడా గుర్తిస్తుందని పరిశోధకులు వెల్లడించారు.
ఇది ఎలా పని చేస్తుందంటే?
ఈ ఏఐ-ఈసీజీ రిస్క్ ఎస్టిమేటర్ మనిషి ECG ఆధారంగా పని చేస్తుంది. మనిషి యొక్క ECGని ఈ టూల్‌కు సమర్పించినప్పుడు అది ఆ రిపోర్టును సమీక్షించి ఆ మనిషి అనారోగ్యానికి గురవుతాడా లేదా? ఎలాంటి రోగాలు ఆ వ్యక్తికి వచ్చే అవకాశం ఉంది, అనేది గుర్తించి రిపోర్టు ఇస్తుంది. ఒకవేళ రోగం తీవ్రత ఎక్కువగా ఉన్నా.. చికిత్సకు అది నయం అయ్యే అవకాశం లేకపోయినా ఆ వ్యక్తుల మరణాన్ని కూడా చెబుతుందని వెల్లడించారు. వచ్చే పదేళ్లలో వచ్చే రోగాలు, మరణ ముప్పును ఈ AI 78% ఖచ్చితత్వంతో గుర్తిస్తుందని పేర్కొన్నారు.
ఇప్పటి వరకు ఈ టూల్‌తో లాన్సెట్ పరిశోధకులు 1.89 లక్షలకు పైగా వ్యక్తుల నుంచి ECG సాంపిల్స్ సేకరించి ఆ టూల్‌తో పరీక్షించగా.. ఆ టూల్.. ఆ శాంపిల్స్‌లోని 76% మంది వ్యక్తులకు భవిష్యత్తులో గుండె సంబంధిత రోగాలు వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది. అలాగే అథెరోస్క్లెరోటిక్ కార్డియోవాస్కులర్ వ్యాధి, ధమనులు సన్నబడి రక్త ప్రవాహాన్ని కఠినతరం చేస్తాయని హెచ్చరించింది. దీని ద్వారా ముందుగానే రోగాన్ని గుర్తించి, దానికి సంబంధించిన చికిత్స తీసుకుంటే ప్రమాదం తగ్గడంతో పాటు ప్రాణాలు కూడా దక్కుతాయి.
వినియోగానికి సిద్ధంగా ఆసుపత్రులు
ఈ AI డెత్ క్యాలిక్యులేటర్‌ను వినియోగించేందుకు యూకేకు చెందిన రెండు ఆసుపత్రులు సిద్ధంగా ఉన్నాయి. తమ ఆసుపత్రుల్లో ఈ AI టూల్‌తో ట్రయల్ నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. అయితే వచ్చే ఐదేళ్ళలో ఈ టూల్ పూర్తిస్థాయిలో అభివృద్ధి చెంది అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఇది ఏ విధంగా పని చేస్తుంది, భవిష్యత్తులో దీనిని ఉపయోగించుకొని ఎవరి ప్రాణాలైనా దక్కుతాయా లేదా అనేది చూడాలి.
గమనిక: ఈ కథనంలో మేము పొందుపరిచిన అంశాలు పలు అధ్యయనాలు, ఇంటర్నెట్‌లో మాకు దొరికిన సమాచారం ఆధారంగా అందించబడింది. వీటి శాస్త్రీయతను మేము నిర్ధారించడం లేదు. మేము కేవలం సమాచారం అందించడానికి మాత్రమే ప్రయత్నిస్తున్నాము. వీటిని ఎంతవరకు విశ్వసించడం అనేది పూర్తిగా మీ బాధ్యత. దీనికి బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు.



Click it and Unblock the Notifications