Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
సోషియల్ మీడియాలో దుమ్మురేపుతున్న KCR ఏఐ ఫోటోలు..మీరే ఓ లుక్ వేయండి..
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనిషి జీవితంలో సమూ మార్పులకు కారణమవుతోంది. మొన్నటిదాకా విప్లవాత్మకమైన సాంకేతిక పరిజ్ఞానంగా పేరు పొందింది. ఇప్పుడు ఏకంగా మన జీవితాలను అత్యంత వేగంగా ప్రభావితం చేస్తోంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మొన్నటిదాకా కేవలం ఐటీ పరిశ్రమకు మాత్రమే పరిమితం అనుకున్నారు. కానీ ఇప్పుడు అది ఏకంగా వార్తలు కూడా చదివే స్థాయికి ఎదిగింది. భవిష్యత్తు రోజుల్లో ఎలాంటి మార్పులకు కారణం అవుతుందో తెలియదు కానీ ప్రస్తుతానికైతే అన్ని రంగాలను ఒక కుదుపు కుదుపుతోంది.

పంచవ్యాప్తంగా దాదాపు అన్ని రంగాల్లో ప్రవేశించిన కృత్రిమ మేధస్సు (ఏఐ) తాజాగా ఎన్నికల రంగంలో హల్‌చల్ చేస్తున్నది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇప్పటిదాకా ప్రపంచంలో పేరు పొందిన వ్యక్తులను రకరకాల రూపాల్లో మనం చూసాం. వాటిని చూస్తూ చాలా ఆనందించాం.

కానీ ఓ ఔత్సాహికుడు కెసిఆర్ తో రకరకాల ప్రయోగాలు చేశాడు. డి జె టిల్లు సినిమాలో టిల్లు లాగా, కమాండో సినిమా లో సోల్జర్ లాగా రకరకాల పాత్రల్లో ఒదిగిపోయేలా చేశాడు. ఆదమరచి చూస్తే ఇదేంటి కెసిఆర్ ఇలా ఉన్నారు అనే లాగా మార్చాడు.. ఏ మాటకు ఆ మాట ఈ రూపాల్లో కేసీఆర్ గులాబీ రంగును ధరించడం విశేషం.

ప్రస్తుతం ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. ఈ ఫోటోలను చూసినవారు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. వైట్ అండ్ వైట్ డ్రెస్ లో ఉండే కేసీఆర్ ఇలా మారిపోవడాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. ఈ ఫొటోను బీఆర్‌ఎస్ అభిమానులు సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.


సాధారణ పొలిటికల్ పోస్టర్లు, ఫొటోలకు భిన్నంగా కనిపిస్తున్న ఈ చిత్రాలు సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నాయి. కేసీఆర్ ఏఐ ఫొటోలకు అనూహ్య స్పందన రావడంతో.. వాటిని పార్టీ అధికారిక ఖాతాలకు ట్యాగ్ చేస్తూ.. సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.


సీఎం కేసీఆర్ అమలుచేసిన సంక్షేమ పథకాలను ప్రతిబింబిస్తూ రూపొందించిన ఏఐ ఫొటోలు సామాన్యులను సైతం ఆకట్టుకుంటుండగా.. కేసీఆర్‌ను కొత్తగా చూపే మేకోవర్‌కు ఆయన అభిమానుల నుంచి అనూహ్య స్పందన వస్తున్నది. వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేస్తూనే, వాట్సాప్ స్టేటస్‌గా, డీపీలుగా, వాల్‌పోస్టర్లుగా పెట్టుకొని మురిసిపోతున్నారు.

AI రూపొందించిన ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు దృశ్యాలు ఇంటర్నెట్‌లో తుఫానుగా మారాయి, దాదాపు అతని ఫోటో-రియలిస్టిక్ చిత్రణను అందిస్తున్నాయి. ఈ AI- రూపొందించిన చిత్రాలు గత కొన్ని రోజులుగా వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్‌గా మారాయి.



Click it and Unblock the Notifications