Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
ఇదిగో అక్షర సాక్ష్యం.. AI చేతిలో మనిషి బలి, త్వరలోనే ప్రపంచ వినాశనం గ్యారెంటీ!
రోజులు ఎంత వేగంగా గడిచిపోతున్నాయో.. అంతే వేగంగా ప్రపంచంలో మార్పులు వస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచాన్ని ఏఐ ఏలుతుంది. గంటల్లో చేసే పనిని ఏఐ క్షణాల్లోనే చేసేస్తోంది. అలాగే రోజుల కొద్దీ పట్టే పనిని కూడా కేవలం గంటల్లోనే పూర్తి చేసేస్తోంది. చాలా కంపెనీలు సైతం ఏఐని డెవలప్ చేస్తున్నారు. రకరకాల ఉపయోగాల కోసం ఈ ఏఐని ప్రస్తుతం వినియోగిస్తున్నారు. అయితే ఈ ఏఐ ప్రపంచానికే పెను ముప్పులా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎలాన్ మస్క్ సైతం.. ఏఐ మనం ఊహించినదాని కంటే ప్రమాదకరమని చెప్పిన విషయం ఇప్పుడు చాలా మంది గుర్తు తెచ్చుకుంటున్నారు. త్వరలోనే ఏఐ గుప్పెట్లో మనిషి వెళ్ళిపోతున్నాడని, మనిషిని ఏఐ మింగేస్తుందని చెబుతున్నారు. అయితే దీనికి కారణాలు లేకపోలేదు. ఆ కారణాలు ఏంటి? మనిషిని ఏఐ మింగేస్తుందని చెప్పడానికి దోహదం చేస్తున్నాయి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
గ్రోక్ ఏఐ స్పందనలు..
ఇటీవల సోషల్ మీడియాతో పాటు వార్తల్లో కూడా ఎలాన్ మస్క్‌కు చెందిన గ్రోక్ ఏఐ వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. దానికి కారణాలు కూడా లేకపోలేదు. అదేంటంటే.. ఇటీవల చాలా మంది గ్రోక్‌ను వినియోగించారు. ఇలా వినియోగించినప్పుడు మన తెలుగు వాడుక భాషలో ప్రశ్నలు అడిగితే.. అదే తెలుగు భాషలో జవాబు ఇస్తుంది. మనం ఏం తిట్టినా.. అదే విధంగా బదులు ఇచ్చింది. ఇది చాలా సంచలనంగా మారింది. చాలా మంది దానిని చూసి నవ్వుకున్నారు తప్పితే.. దాని వెనుక ఉన్న ప్రమాదాన్ని మాత్రం ఎవరూ ఊహించలేదు. అదేంటంటే..

ఆ ప్రమాదం ఏంటంటే..
సాధారణంగా మనం వాడుక భాషను చాలా ధారాళంగా వాడేస్తుంటాం. నోట్లో ఏ పదమొస్తే ఆ పదాన్నే వాడేస్తూ ఉంటాము. కానీ కేవలం కొన్ని పరిమితులకు లోబడి డెవలప్ చేసిన ఏఐ సైతం వాడుక భాషను ధారాళంగా పలకడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అంటే ఏఐ తనకు తానే తన సొంతంగా.. భాషను నేర్చుకుంటుందని చెబుతున్నారు. తద్వారా ఉపాధి తగ్గిపోవడంతో పాటు.. భవిష్యత్తులో మన వాడుక భాషలో మనం మాట్లాడే ప్రతి పదం అది అర్ధం చేసుకొని.. దానికి తెలివిగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇది మానవాళికి పెనుముప్పుగా మారబోతుందని అంచనా వేస్తున్నారు.
సొంతంగా డెవలప్ చేసుకోవడం..
మనం కొన్ని కొన్ని సంఘటనల గురించి వినే ఉంటాము. అదేంటంటే.. ఏఐ ఇంకో ఏఐతో తన సొంతంగా మాట్లాడుకోవడం. ఇలా ఒక ఏఐ ఇంకో ఏఐతో మాట్లాడుకొని.. మనం వినియోగిస్తున్న సిస్టం అన్నిటినీ నాశనం చేయగలవని, వాటికి ఆ సత్తా ఉంటుందని చెబుతున్నారు. దీని కారణంగా భవిష్యత్తులో ప్రభుత్వాలే కూలిపోయే అవకాశం ఉందని, దేశాల మధ్యలో యుద్ధం జరిగే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.
ఇలా చేయండి..
ఏఐ అతిగా వినియోగించడం కూడా ప్రమాదకరమని ఈ ఘటనలను చూసి అర్ధం చేసుకోవచ్చు. దేనినైనా మితంగా వాడితేనే మంచిదని సూచిస్తున్నారు. ఏఐని కూడా అతిగా స్వేచ్ఛను ఇవ్వకూడదని, ఈ ఘటనలను గుణపాఠంగా చేసుకొని, వినియోగించాలని పేర్కొంటున్నారు. ప్రభుత్వాలు సైతం దీనిపై కఠినమైన చర్యలు తీసుకోవాలంటున్నారు.



Click it and Unblock the Notifications