Latest Updates
-
లివర్ ఆరోగ్యంగా, క్లీన్ గా ఉండాలంటే డాక్టర్ చెప్పిన 5 సింపుల్ టిప్స్.. -
ఇంట్లోనే హోటల్ స్టైల్ దోశ పిండి..ఎలా తయారుచేసుకోవాలో చూడండి -
రచితో పాటే ఆరోగ్యం కూడా..గోధుమ రవ్వ పొంగల్ ఇలా చేస్తే..తింటుంటే మర్చిపోలేని మజా.. -
డ్రమ్ లో శవమవడం కంటే ఇదే బెస్ట్.. భార్యకు ఆమె ప్రియుడితో పెళ్లి జరిపించిన భర్త.. నెటిజన్ల ప్రశంసలు -
చుక్క నూనె లేకుండానే బెస్ట్ స్నాక్..ఒక్కటితో ఆగరు,అంత రుచిగా ఉంటుంది! -
పెళ్లి కాని ప్రసాద్ లు చూస్తే ఏడ్చేస్తారు.. కుక్కను పెళ్లి చేసుకొని అందరికీ షాకిచ్చిన బ్యూటీ! -
నాన్ వెజ్ ని మించిన రుచి, ఆరోగ్యం కూడా..చపాతీ, రైస్ లోకి కిర్రాక్ అనిపించే గోంగూర సోయా చేసుకోండిలా.. -
రాజస్థాన్ ఫేమస్ కార్న్ ఢోక్లా..బరువు తగ్గాలనుకునేవాళ్లకి ఇది బెస్ట్! -
గుడ్డు పచ్చసొన తింటే కొలెస్ట్రాల్ పెరిగి హార్ట్ ఎటాక్ వస్తుందా? డాక్టర్ విక్రాంత్ సింగ్ ఏమంటున్నారంటే.. -
ఈ ఒక్క పొడి ఉంటే చాలు..జీవితంలో హాస్పిటల్ కి వెళ్లాల్సిన పనే ఉండదు..అన్నం, టిఫిన్స్ లోకి సూపర్
సంచలనం.. రోబోలను కిడ్నాప్ చేసిన మరో రోబో.. వీడియో చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే!
AI టెక్నాలజీ ఎంత అధునాతనమైనదో మనందరికీ తెలుసు. భవిష్యత్తులో ఎదో ఒక రోజు AI ఖచ్చితంగా ప్రతి రంగంలోకి ప్రవేశించి దాని ప్రభావాన్ని చూపుతుంది. AIలు ఇప్పటికే అన్ని టాస్క్‌లలో పనిచేస్తున్నాయి. పలు రంగాల్లో సంచనాలు సృష్టిస్తున్న ఈ AI ఎంత ఉపయోగకరమైనదో అంతే ప్రమాదకరమైనది కూడా.
ఎందుకంటే ఇప్పుడు ఈ AI రోబోట్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఓ AI రోబోట్ తనతో సమానమైన ఇతర AI రోబోట్లను కిడ్నాప్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో పాటు ప్రపంచంలోని వ్యక్తులను ఎంతగానో భయాందోళనలకు గురి చేసింది. దీనికి సంబంధించిన స్టోరీని ఇప్పుడు తెలుసుకుందాం.

ఎయిర్ బాయ్ రోబోట్..
చైనాలోని షాంఘైలో ఉన్న పెద్ద AI రోబోట్ షోరూమ్‌లో ఆశ్చర్యానికి గురి చేసే సంఘటన జరిగింది. ఎయిర్బాయ్ అనే ఓ చిన్న రోబో రాత్రి సమయంలో మిగిలిన 12 రోబోలను కిడ్నాప్ చేసింది. ఈ రోబో.. తనతో పాటు ఉన్న ఇతర రోబోలను తన మాటలతో మభ్యపెట్టడం, వారిని కిడ్నాప్ చేయడం కనిపిస్తుంది. ఈ తీరు సీసీటీవీలో రికార్డు అయ్యింది కూడా. ఆ రోబోలతో మాట్లాడిన తరువాత.. ఆ రోబోతో కలిసి ఇతర రోబోలు కూడా కలిసి వెళ్లడం కనిపిస్తోంది.
Çin'de 12 robot, başka bir robot tarafından kaçırıldı. pic.twitter.com/KlrUMVgs8F
— Farklı Gerçekler (@gerceklerfark) November 18, 2024
ఈ రోబో ఏం మాట్లాడిందంటే?
రాత్రిపూట ఆపరేషన్‌లో ఉంచిన ఈ ఎయిర్బాయ్ రోబో అక్కడ రోబోల ముందు నిలబడి మాట్లాడడం మనం చూడొచ్చు. ఆ చిన్న రోబో మిగిలిన రోబోలతో చైనీస్‌లో మాట్లాడడం మనం క్లియర్‌గా చూడొచ్చు. రోబో ఇతర రోబోలతో మీరు ఇంకా వర్క్‌లోనే ఉంటారా అని అడుగుతుంది. దానికి ఇతర రోబోలు తమకు ఇళ్ళు లేవని చెబుతాయి. దానికి ఈ ఎయిర్ బాయ్ రోబో.. నాతో రండి, మా ఇంటికి తీసుకెళ్తాను అని అనడంతో మిగిలిన రోబోలు కూడా ఆ రోబోతో పాటు వెళ్లిపోతాయి. ఈ వీడియో చూసిన రోబో తయారీ కంపెనీదారులు రోబోలను గాలించగా.. ఆ షోరూంలో వేరే ప్రాంతంలో కనిపిస్తాయి. దీంతో అందరూ షాకయ్యారు.
ఈ రకంగా ఎయిర్ బాయ్ అనే చిన్న రోబో ఇతర రోబోలను కిడ్నాప్ చేయడం ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. దీంతో యావత్ టెక్ ప్రపంచం సందిగ్ధంలో నిలిచిపోయింది. దీని తరువాత AI అంటే అందరి వెన్నులో వణుకు పుట్టినట్లు అయ్యింది. AIతో ఉపయోగాలు మాత్రమే కాదు మానవ జాతిని నాశనం చేయగల సత్తా కూడా ఉందని తేలింది.
కంపెనీ ఏమంటుందంటే?
ఈ ఘటనపై ఈ రోబోలను తయారు చేసే కంపెనీ స్పందించింది. ఈ ఎయిర్ బాయ్ రోబోను తయారు చేసిన హాంగ్జౌ కంపెనీ ప్రతినిధులు మాట్లాడుతూ.. ఈ రోబో ఇలాంటి చర్యలు పాల్పడడానికి ఇతర రోబోలలోని చిన్న చిన్న లొసుగులను ఉపయోగించి ఈ చర్యలకు పాల్పడిందని పేర్కొంది. ఇది లోపమా? లేక రోబో తనంతట తానే తన సిస్టంను అభివృద్ధి చేసుకుంటుందా అనే విషయంపై పరిశోధన చేస్తున్నామని పేర్కొంది. లోపాన్ని సరిదిద్దెందుకు తాము చర్యలు తీసుకుంటామని, సత్వరమే లోపాన్ని సరిదిద్దుకుంటామన్నారు.
కాగా ఈ ఎయిర్ బాయ్ రోబోను ఒక కంపెనీ తయారు చేయగా.. మిగతా రోబోలన్నీ మరో కంపెనీకి చెందినవి. ఆ విధంగా ఒక కంపెనీకి చెందిన AI రోబో మరో కంపెనీకి చెందిన రోబోను కిడ్నాప్ చేసిందని పేర్కొన్నారు.
గమనిక: ఈ కథనంలో మేము పొందుపరిచిన అంశాలు పలు అధ్యయనాలు, ఇంటర్నెట్లో మాకు దొరికిన సమాచారం ఆధారంగా అందించబడింది. వీటి శాస్త్రీయతను మేము నిర్ధారించడం లేదు. మేము కేవలం సమాచారం అందించడానికి మాత్రమే ప్రయత్నిస్తున్నాము. వీటిని ఎంతవరకు విశ్వసించడం అనేది పూర్తిగా మీ బాధ్యత. దీనికి బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు.



Click it and Unblock the Notifications
