Latest Updates
-
మటన్ సాంబార్ వండేటప్పుడు ఈ మసాలా పడితే ఆ రుచే వేరు..రాగి సంగటి, చపాతీ,అన్నంలోకి కేక -
రోగనిరోధక శక్తిని పెంచే జామకాయ పచ్చడి.. ఊరనివ్వాల్సిన పనే లేకుండా అప్పటికప్పుడే రెడీ! -
Viral Video Truth: రష్యా యువతి, బీహార్ యువకుడి ప్రేమ కథలో పెద్ద ట్విస్ట్.. -
జుట్టు రాలడం తగ్గించి, ఒత్తుగా పెంచే సీడ్ లడ్డూ.. ఇంట్లోనే ఇలా తయారు చేయండి! -
రైస్, చపాతీలోకి వహ్వా అనిపించే చికెన్ మసాలా..ఎలా చేసుకోవాలంటే.. -
బరువు తగ్గాలనుకుంటున్నారా? ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కొవ్వును కరిగించే 8 బెస్ట్ ఫుడ్స్ ఇవే! -
సూర్యుడు, బుధుడి కలయికతో బుధాదిత్య రాజయోగం..ఈ 3 రాశుల జాతకం మారబోతోంది! -
గుంటూరు స్టైల్ ఎమ్మెల్యే పెసరట్టు.. ఇంట్లోనే సులభంగా ఇలా చేసుకోండి! -
రక్తహీనతను తరిమికొట్టే, ఉక్కులాంటి బలాన్నిచ్చే నల్ల నువ్వుల పొడి..ఎలా చేసుకోవాలంటే.. -
పొట్లకాయ ఆకారం చూసి పక్కన పెడుతున్నారా? గుండె, ఎముకల ఆరోగ్యానికి ఇదే బెస్ట్..బరువు కూడా తగ్గొచ్చు!
Cannes Film Festival 2023: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2023: ఆరాధ్యతో కలిసి కేన్స్‌కి బయలుదేరిన ఐశ్వర్యరాయ్
మాజీ విశ్వసుందరి, బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ బచ్చన్ మరోసారి కేన్స్‌లో రెడ్ కార్పెట్‌పై వయ్యారంగా నడుస్తూ అభిమానులను కనువిందు చెయ్యనుంది. ఐశ్వర్యరాయ్ బచ్చన్ ఆమె కుమార్తె ఆరాధ్యతో పాటు మే 16వ తేదీన అర్థరాత్రి ఫ్రాన్స్‌కు బయలుదేరినట్లు తెలిసింది. ఐశ్వర్యరాయ్ బచ్చన్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రతిఏడాది పాల్గొంటారు.
గతంలో ఐశ్వర్యరాయ్ బచ్చన్ కళ్లు చెదిరిపోయే అద్భుతమైన సీతాకోకచిలుక గౌను, గోల్డెన్ గౌను, పింక్ ప్యాంట్‌సూట్ తో కేన్స్ ప్రదర్శనలతో అందరిని ఆకట్టుకున్నారు. అయితే ఇప్పుడు కేన్స్ 2023 రెడ్ కార్పెట్‌పై ఐశ్వర్యరాయ్ బచ్చన్ ఎలాంటి దుస్తులు ధరిస్తుందో, ఎలా కేన్స్ లో అందరిని ఆకట్టుకుంటుందో చూడాలని ఆమె అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు.

గతంలో కేన్స్ కు వెళ్లే సమయంలో ఐశ్వర్యరాయ్ బచ్చన్ ఆమె కుమార్తె ఆరాధ్యను వెంటపెట్టుకుని వెళ్లింది. ఎప్పటిలాగే ఈ సంవత్సం ఐశ్వర్యరాయ్ బచ్చన్ ఆమె ముద్దుల కుమార్తె ఆరాధ్యను వెంటపెట్టుకుని ముంబాయి విమానాశ్రయం నుంచి కేన్స్‌కు వెళుతున్నప్పుడు మీడియా కంటపడ్డారు..
కేన్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అనేది ఫ్రాన్స్‌లోని కేన్స్‌లో జరిగే వార్షిక కార్యక్రమం, కేన్స్ లో ప్రపంచం నలుమూలల నుండి వచ్చిన అన్ని రకాల కొత్త చిత్రాలను ప్రివ్యూ చేస్తుంది. ఐశ్వర్య రాయ్ బచ్చన్, ఆమె కుమార్తె ఆరాధ్యతో కలిసి కేన్స్‌కి బయలుదేరారు. ప్రతి ఏడాది కేన్స్‌లో ప్రత్యక్షం అయ్యే వారిలో ఐశ్వర్యరాయ్ కూడా ఒక్కరు. ఈ ఏడాది కూడా ఐశ్వర్యరాయ్ బచ్చన్ కేన్స్ లో భిన్నంగా దర్శనం ఇవ్వనున్నారని తెలిసింది.


76వ కేన్స్ ఫెస్టివల్ మే 16 నుండి మే 27 వరకు కేన్స్‌లోని పలైస్ డెస్ ఫెస్టివల్స్ ఎట్ డెస్ కాంగ్రెస్ డి కేన్స్‌లో నిర్వహించబడుతోంది. రూబెన్ స్ట్లండ్ ఈ ఏడాది జ్యూరీ ప్రెసిడెంట్‌గా ఉంటారు. గత సంవత్సరం, ఫ్రాన్స్‌లోని కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌తో పాటు నిర్వహించబడిన మార్చే డు ఫిల్మ్‌లో భారతదేశం అధికారిక గౌరవ దేశంగా పనిచేసింది. ప్రతిష్టాత్మక చలనచిత్రోత్సవం మే 16న జానీ డెప్ నటించిన జీన్ డు బారీ ప్రీమియర్‌తో ప్రారంభమైంది.

ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్‌కాస్టింగ్ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన సమాచారం ప్రకారం, కను బెహ్ల్ ఆగ్రా డైరెక్టర్స్ ఫోర్ట్‌నైట్ విభాగంలో, అనురాగ్ కశ్యప్ కెన్నెడీని మిడ్‌నైట్ స్క్రీనింగ్స్‌లో మరియు నెహెమిచ్ ఫెస్టివల్ డి కేన్స్‌లోని లా సినెఫ్ విభాగంలో ప్రదర్శించబడతాయి. అదనంగా, పునరుద్ధరించబడిన మణిపురి చిత్రం, ఇషాన్‌హౌ, క్లాసిక్స్ విభాగంలో ప్రదర్శించబడుతుంది.



Click it and Unblock the Notifications
