Latest Updates
-
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.!
అంబానీల అంటిల్లా లోపల ఎలా వుంటుందో తెలుసా..? కార్ల పార్కింగ్‌కే 6 ఫ్లోర్లు..!
అనంత్ అంబానీ పెళ్లి వేడుక సందర్భంగా ముఖేష్ అంబానీ అంటిల్లా భవనం మళ్లీ చర్చలోకి వచ్చింద. అత్యం ఖరీీదైన రిలాయన్స్ ముఖేష్ అంబానీ స్వంత ఇల్లైన అంటిల్లా గురించి ముఖమైన విషయాలను తెలుసుకుందాం. ముంబైలో అల్టామౌంట్ రోడ్డులో వున్న అంటిల్లా భవనం వుంటంది. అట్లాంటిక్ సముద్రంలో అంటిల్లా అనే ఐలాండ్ వుంటుంది. ఆ ఐలాండ్ పేరునే ముఖేష్ అంబానీ తన ఇంటికి పెట్టుకున్నారు. 4 లక్షల చదరపు అడుగుల్లో ఈ అంటిల్లా భవనాన్ని నిర్మించారు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇళ్లల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. ఈ అంటిల్లాలో మొత్తం 27 అంతస్థులు వుంటాయ్.

అంటిల్లాలోని ఒక్కో ఫ్లోర్ సాధారణ ఫ్లోర్ కంటే కూడా 2 నుంచి 3 రెట్ల ఎత్తులో వుంటుంది. దీన్ని బట్టి చూస్తే 60 అంతస్థుల అపార్ట్‌మెంట్ ఎంత ఎత్తులో వుంటుందో అంతే ఎత్తుల్లో అంటిల్లా భవనం వుంటుంది. ఈ అంటిల్లా భవనాన్ని 2012లో నిర్మించారు. దీనికి అయిన ఖర్చు సుమారుగా 1.2 బిలియన్ డాలర్లు అయి వుంటుందని అంటారు.
అంటిల్లాలోపలికి వెళ్లాలంటే రెండు గేట్లు వుంటాయ్. ఒక గేటులోంచి అంబానీ కుటుంబ సభ్యులు, బంధువులు వస్తారు. మరో గేటు ఇంటి సరుకులు, పనిమనుషులు, సెక్యురిటీ సిబ్బంది వచ్చి వెళ్లడానికి వుంటుంది. అంటిల్లా లోపలికి వెళ్లాలంటే వారి దగ్గర ఖచ్ఛితంగా ఎంట్రి పాస్ ఇంకా అపాయింట్‌మెంట్ లెటర్ ఐడీ ఖచ్ఛితంగా వుండాలి. అంటిల్లాలోకి వెళ్లే ముందు సెక్యురిటీ చెకప్ కూడా చాలా ఖఛ్ఛితంగా వుంటుంది. అంటిల్లా లోపలికి వెళ్లగానే ఎడమ, కుఢి భాగంలో శివుడు, బుద్ధుడి విగ్రహాలు వుంటాయ్. అంటిల్లాలో వున్న 27 అంతస్థుల్లో ఆరు అంతస్థులను కేవలం పార్కింగ్ కోసమే నిర్మించారు. అంబానీ కుటుంబం వద్ద సుమారు 170 కార్ల వరకు వుంటాయ్. ఈ కార్లన్నీ మొత్తం 6 ఫ్లర్లలో పార్క్ చేసి వుంటాయ్. 7వ ఫ్లోర్‌లో కార్ రిపేరింగ్ సెంటర్ వుంటుంది.
ఏడవ ఫ్లోర్ పైన స్విమ్మింగ్ పూల్, జిమ్, బ్యూటీ పార్లర్, యోగా స్టూడియో, డ్యాన్స్ స్టూడియో, మసాజ్ సెంటర్లు వుంటాయ్. ఆపైన ఫ్లోర్‌లో 50 మంది కూర్చొని చూడగల ఒక థియేటర్ వుంటుంది. ముఖేష్ అంబానీ ఈ థియేటర్‌లో ఎక్కువగా బాలీవుడ్ సినిమాలను చూడ్డానికి ఇష్టపడతారు. అంటిల్లాలో కృష్ణుడి ఆలయం కూడా వుంటుంది ఈ కృష్ణుడి ఆలయంలోనే అంబానీ కుటుంబం రోజూ పూజలు చేసి తమ పనులను ప్రారంభిస్తారు. అంటిల్లా చుట్టూ చెట్లను పెంచడం మనం చూడవచ్చు. ఈ చెట్లు ఎండాకాలంలో భవనం లోపల వున్న వాతావరణాన్ని చల్లబరుస్తుంది.
అంటిల్లా భవనంలో ఒక స్నో రూం కూడా వుంటుంది. ఎండాకాలంలో అంబానీ కుటుంబం ఈ స్నో రూంలో రిలాక్స్ అవుతుంది. ఒక ఫ్లోర్‌లో గెస్ట్ బెడ్ రూంలు వుంటాయ్. దాని పైన ముఖేష్ అంబానీ కుటుంబానికి సంబంధించిన రూంలు వుంటాయ్. అంటిల్లా భవనాన్ని మెయింటెయిన్ చేయడానికి మొత్తం 600ల మంది సిబ్బంది వుంటారు. ఈ 600ల మందిలో క్లీనర్లు, వంటమనుషులు, పనివారు, సెక్యురిటీ సిబ్బంది, కార్పెంటర్లు, మెకానిక్‌లు, పెయింటర్లు, ఇంకా ఇతర సిబ్బంది వుంటారు. ఈ భవనంలో పనిచేసే వారి వేతనం కూడా చాలా ఎక్కువగా వుంటుంది. పనివాళ్ల కోసం ఒక ప్రత్యేక ఫ్లోర్‌ను కూడా కేటాయించారు.
అంటిల్లా భవనంలో మొత్తం 9 లిఫ్టులు వుంటాయ్. వీటిలో కొన్నింటిని పనివాళ్లు, కొన్నింటిని గెస్టుల కోసం ఉపయోగిస్తే. మిగిలినవి అంబానీ కుటుంబం మాత్రమే ఉపయోగిస్తుంది. అంటిల్లా భవనం పైన ఎమర్జెన్సీలో హెలికాప్టర్లను ఉపయోగించడానికి మూడు హెలిప్యాడ్లు వుంటాయ్. అప్పుడప్పుడు మూఖేస్ అంబానీ ఎమర్జెన్సీ మీటింగులకు ఈ హెలిప్యాడ్ ద్వారానే అక్కడికి చేరుకుంటారు.



Click it and Unblock the Notifications