Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
కూలర్ కొనేముందు తప్పక ఈ విషయాలు తెలుసుకోవాలి.. లేకపోతే ఆ కూలర్లు కొన్న వేస్ట్!
ఎండాకాలం వచ్చేసింది. ఎండలు బయట మండిపోతున్నాయి. మధ్యాహ్నం పూట బయటికి వెళ్తే పట్టపగలే చుక్కలు చూపించేంతలా ఎండలు దంచికొడుతున్నాయి. బయట అనే కాదు.. ఇంట్లో కూర్చున్న కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో చాలా మంది ఇంట్లో ఏసీలు, కూలర్లు కొనేస్తున్నారు. ఎండా వేడిమి నుంచి తట్టుకోలేక ఎక్కువ డబ్బులు పెట్టి మరీ వారిని కొనుగోలు చేస్తున్నారు. కానీ కొంత మంది అవగాహన లేమి కారణంగా డబ్బులు వృథా చేసేస్తున్నారు. తమకు అనువైన కూలర్లను కొనుగోలు చేయలేకపోతున్నారు. వాటి నుంచి మంచి ఫలితాలను రాబట్టుకోలేకపోతున్నారు. అందుకే ఈ స్టోరీలో ఎవరైతే ఎండాకాలం కూలర్లు కొనాలని అనుకుంటున్నారో.. వారు కూలర్లు కొనే ముందు తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలను ఈ స్టోరీలో వివరించాము. ఈ టిప్స్ ఆధారంగా మీకు కావాల్సిన కూలర్‌ను మీరు కొనుగోలు చేయొచ్చు. ఆ టిప్స్ ఏంటంటే?
హ్యూమిడిటీ ఉన్న ప్రదేశంలో..
ఎయిర్ కూలర్లు ఏ ప్రాంతంలో అయినా చక్కగా పని చేస్తాయని మనం భావిస్తూ ఉంటాం. కానీ అవి కొన్ని ప్రాంతాల వారికోసం మాత్రమే డిజైన్ చేయబడినది. ఎక్కడైతే హ్యుమిడిటీ ఎక్కువగా ఉంటుందో, ఎక్కడైతే వర్షం ఎక్కువగా పడుతుందో ఆ ప్రాంతాల్లో కూలర్లు ఎక్కువగా పని చేయవు. అవి సరైన ఫలితాలను అందించలేవు. ఒకవేళ మీరు సముద్ర ప్రాంతానికి దగ్గరగా ఉన్నా.. లేదా మీ ఏరియాలో ఎక్కువగా వర్షాలు కురుస్తున్నా మీరు కూలర్ కొనడం కూడా వేస్ట్. ఎందుకంటే ఈ ప్రాంతాల్లో కూలర్ సరిగ్గా పని చేయవు. మీకు చల్లని గాలిని అందించలేవు. ఒక మీ ప్రాంతం డ్రై ప్రాంతమైతే మీరు ఎయిర్ కూలర్ కొనుక్కొని వాడుకోవచ్చు.

నాయిస్..
నిద్రపోయినప్పుడు ప్రశాంతంగా నిద్రపోవడం చాలా ముఖ్యం. కానీ ఎయిర్ కూలర్లు ఎక్కువగా సౌండ్ చేస్తుంటాయి. అందుకే అప్పుడప్పుడు నిద్రలో కూడా లేచి ఉలిక్కిపడుతుంటాము. ఒకవేళ మీకు తక్కువ నాయిస్ కలిగిన ఎయిర్ కూలర్ కావాలనుకుంటే.. మీరు 5 రెక్కలు కలిగిన కూలర్ తీసుకుంటే మంచిది. ఎందుకంటే ఇది మూడు రెక్కలు కలిగిన కూలర్ కంటే కొంచెం తక్కువ సౌండ్ చేస్తుంది. అలాగే గాలి కూడా కొంచెం ఎక్కువగా వీస్తుంది.
ఎండలు ఎక్కువుంటే..
ఒకవేళ మీ ప్రాంతంలో ఎండలు మరీ ఎక్కువగా ఉంటే, ఎయిర్ కూలర్లు ఏమాత్రం పని చేయవు. మీరు కచ్చితంగా ఏసీలకు కొనుక్కోవాల్సిందే. ఎందుకంటే ఎండలు ఎక్కువ ఉంటే.. వేడి గాలి ఎక్కువగా వేస్తుంటుంది. ఆ గాలిని చల్లబరిచే సామర్థ్యం ఎయిర్ కూలర్లకు ఉండవు. పైగా కొన్ని కొన్ని సందర్భాల్లో అది ఇంకా ఎక్కువ వేడిని పంపిస్తుంటుంది. అందుకే మీ ప్రాంతాల్లో ఎండా ఎక్కువగా ఉన్నట్లయితే మీరు ఏసీలను కొనుక్కోవడం ఉత్తమమైన మార్గం.
వెంటిలేషన్..
ఇవన్నీ ఒకే అనుకోని మీరు ఎయిర్ కూలర్ కొన్నారు అనుకోండి.. మీరు దానిని వినియోగించే ప్రాంతంలో కచ్చితంగా వెంటిలేషన్ అయితే ఉండాలి. మీ కిటికీకి దగ్గరగా ఎయిర్ కూలర్ పెట్టి.. ఆ ఎయిర్ కూలర్‌ను వినియోగించుకోవాలి. లేకపోతే మీకు చల్లని గాలి అయితే రాదు. సో మీరు ఎయిర్ కూలర్ కొనాలని అనుకుంటే.. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని ఎయిర్ కూలర్ అయితే కొనుక్కోండి. ఇది మీకు మంచి ఫలితాలు ఇవ్వడంతో పాటు మీ డబ్బు వృథా అవ్వకుండా ఉంటాయి.



Click it and Unblock the Notifications