Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
Allu arjun: ఫ్లవర్ అనుకుంటిరా..ఫైర్..అరెస్ట్ టైంలోనే చూపెట్టాడుగా
పుష్ప సినిమా విడుదల సందర్భంగా హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో సంధ్యా థియేటర్ దగ్గర ఈ నెల 4వ తేదీ రాత్రి జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మరణించిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్ థియేటర్ దగ్గరకు వచ్చి తన కారు సన్ రూఫ్ నుంచి అభివాదం చేయడంతో అభిమానులు ఒక్కసారిగా ఎగబడ్డారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగి 39 ఏళ్ల మహిళ మరణించగా ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడి హాస్పిటల్ లో ఉన్నాడు.
ఈ ఘటనపై కేసు నమోదుచేసిన హైదరాబాద్ పోలీసులు శుక్రవారం(డిసెంబర్ 13) అల్లు అర్జున్ ని అరెస్ట్ చేశారు. అయితే అరెస్ట్ సమయంలో అల్లు అర్జున్ ధరించిన హుడీ పెద్ద హాట్ టాపిక్ గా మారింది. ఆ హుడీపై పుష్ప సినిమా ఫేమస్ డైలాగ్ "ఫ్లవర్ నహీ..ఫైర్ హై" అని హిందీలో ప్రింట్ చేసి ఉంది. దీనికి సంబంధించిన ఫొటోలు,వీడియోలు తెగ వైరల్ అయ్యాయి.

అల్లు అర్జున్ ని బెడ్ రూమ్ లోకి వెళ్ళి మరీ అరెస్ట్ చేశారని,దురుసుగా ప్రవర్తించారని వస్తున్న వార్తలను పోలీసులు ఖండించారు.వాస్తవానికి శుక్రవారం ఉదయం కట్టుదిట్టమైన భద్రతతో అల్లు అర్జున్ నివాసానికి పోలీసులు చేరుకున్న టైంలో అల్లు అర్జున్ ఆకుపచ్చ టీ-షర్ట్, షార్ట్‌లో వేసుకొని ఉన్నాడు. పోలీసులు ఇంట్లోకి వెళ్లిన తర్వాత తాను బట్టలు మార్చుకొని వస్తానని పోలీసులకు బన్నీ చెప్పాడు. వాళ్లు దానికి ఒప్పుకోవడంతో పుష్ష ఫేమస్ డైలాగ్ రాసి ఉన్న ఓ హుడీని వేసుకొని వచ్చాడు అల్లు అర్జున్. ఈ హుడీ ధరించి.. తాను తగ్గేదేలే అని అల్లు అర్జున్ తెలంగాణ ప్రభుత్వానికి చెప్పదల్చుకున్నట్లు అర్థం చేసుకోవచ్చని ఆయన ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
అల్లు అర్జున్ ని బెడ్ రూమ్ లోకి వెళ్ళి మరీ అరెస్ట్ చేశారని,దురుసుగా ప్రవర్తించారని వస్తున్న వార్తలను పోలీసులు ఖండించారు. డ్రెస్ మార్చుకునేందుకు టైమ్ ఇచ్చామని,అప్పటిదాకా తాము బెడ్ రూమ్ బయటే ఉన్నామని.. ఆయన బయటకి వచ్చాకే కస్టడీలోకి తీసుకున్నామని పోలీసులు స్పష్టం చేశారు.
మరుసటి రోజు కూడా అదే హుడీ
సంథ్య థియేటర్ తొక్కిసలాట కేసులో ఇవాళ(డిసెంబర్ 14)తెల్లవారుజామున 6 గంటల సమయంలో చంచల్ గూడ జైలు నుంచి రిలీజ్ అయిన అల్లు అర్జునక.. విడుదలైన వెంటనే గీతా ఆర్ట్స్ ఆఫీస్‌కు వెళ్లి ఆ తర్వాత ఇంటికి బయల్దేరారు. ఇంట్లోకి అడుగుపెట్టిన వెంటనే తన కుమారుడు అల్లు అయాన్‌ను హత్తుకున్నారు. కొడుకును కౌగిలించుకొని తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆ తర్వాత కూతురు అర్హతో పాటు భార్య స్నేహారెడ్డి, కుటుంబ సభ్యులను కలసి ఎమోషనల్ అయ్యారు. అనంతరం ప్రెస్ మీట్ లో కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ సమయంలో కూడా అల్లు అర్జున్ తన హుడీని మార్చలేదు. దీంతో అస్సలు తగ్గేదేలే అని అల్లు అర్జున్ క్లారిటీ ఇస్తున్నాడని ఆయన అభిమానులు చెప్తున్నారు.



Click it and Unblock the Notifications