Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
ఏలియన్స్ కు సంబంధించిన కీలక సమాచారాన్ని కావాలనే దాస్తున్నారా..? శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారంటే..!
ఏలియన్స్ వున్నాయా, లేక ఇదంతా కల్పితమా. ఇంకా ఎన్నేళ్లు ఏలియన్స్‌పై అసత్యాలను ప్రాచారం చేస్తారు. అంతరిక్షంలో ఇప్పుడు అత్యాధునిక పరిఘ్నానాన్ని కలిగివున్న అమెరికా ఏలియన్స్ గురించి ముఖ్యమైన సమాచారాన్ని తెలిసినా కావాలని బయటపెట్టడం లేదా. ఎలియన్స్ కేవలం ఒక ఫ్యాంటసీనేనా. వేరే గ్రహంలో జీవరాసులు ఎందుకు వుండకూడదు, ఎగిరేపళ్లాలు అన్నీ కథలేనా. ఈ విషయాలకు సంబంధించిన ముఖ్యమైన వాటిని తెలుసుకుందాం.
ఆకాశంలో అప్పడప్పుడు ఎగిరే పళ్లాలను చూశామని కొందరు చెబుతున్నారు. వాటికి సంబంధించిన ఫోటోలుకూడా వున్నాయ్. ఈ ఎగిరే పళ్లాలు ఏలియన్స్‌కు చెందిన వాహనాలను అంటారు. మనకి గ్రహాంతర వాసులు ఎలాగే మనం కూడా గ్రహాంతర వాసులకు అలాగేనన్న విషయాన్ని మనము గ్రహించాలి.

గ్రహాంతర వాసులకు సంబంధించిన అమెరికా వద్ద ఏదో కీలకమైన సమాచారం వుందని శాస్త్రవేత్తలు కూడా అనుమానిస్తున్నారు కానీ అమెరికా మాత్రం ఆ విషయాన్ని అస్సలు బయటపెట్టడం లేదు. ఎన్నో రహస్యాలు దాస్తున్న అమెరికా ఏలియన్స్‌కు సంబంధించిన రహస్యాన్ని కూడా దాస్తూ వస్తోంది.
అమెరికాలోని ఏరియా 51 గరించి వినే వుంటారు. గ్రహాంతర వాసుకులకు చెందిన వివాదాలన్నీ ఈ ప్రాంతం చుట్టూ తిరుగుతూ వుంటాయ్. నెవాడా రాష్ట్రం సమీపంలో ఈ ఏరియా 51 వుంటుంది. అక్కడ రెండు ప్రపంచ యుద్ధానంతరం అమెరికాకు చెందిన ఆయుధాలు, సైన్యానికి చెందిన కీలక కార్యక్రమాలు ఈ ఏరియా 51లో జరుగుతాయని చెబుతున్నారు. ఈ ఏరియాలోకి అమెరికన్లకు కూడా ప్రవేశం లేదు. అయితే ఇదే ప్రదేశంలో గ్రహాంతరవాసులకు సంబంధించిన పరిశోధనలు జరుగుతున్నాయని టాక్.

1947లో ఏలియన్స్‌కు సంబంధించిన ఒక శరీరం కూడా లభించిందని చెబుతుంటారు. ఆ శరీరం ఈ ఏరియా 51లో వుందని కొందరు వాదిస్తున్నారు. బాబ్ లేజర్.. తాను ఏరియా 51లో పనిచేశానని, ఏలియన్స్‌కు సంబంధించిన ఏయిర్‌క్రాఫ్ట్ పరిశోధన విభాగంలో తాను పనిచేసినట్లు చెప్పాడు. ఏలియన్ టెక్నాలజీ తో అమెరికా చాలా శక్తివంతమైన రాడార్‌కు కూడా చిక్కని, అత్యంత వేగవంతమైన విమానాన్ని తయారు చేసింది. ఆ విమానం పేరే లాక్‌హీడ్ ఎస్‌ఆర్-71 బ్లక్‌బర్డ్ విమానం. ఇది గంటకు 3400 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. రివర్స్ ఇంజనీరింగ్‌తో దీనిని తయారు చేశారని అంటారు. ఏలియన్స్ కు చెందిన వాహనాన్ని రివర్స్ ఇంజనీరింగ్ చేసి ఈ విమానాన్ని తయారు చేశారని అంటారు.
తరువాత అమెరికాలోని పెంటగాన్ ఈ వార్తలన్నింటినీ కొట్టి పారేసింది. వాతావరణంలో ఏర్పడుతున్న మార్పులను ఎగిరేపళ్లాలుగా అనుకొని భ్రమపడుతున్నారని తెలిపింది. ఇప్పటి వరకు ఏ గ్రహాంతరవాసి కూడా భూమి మీదకు రాలేదని అంటున్నారు.
పెంటగాన్ ఆల్ డొమైన్ అనామలీ రిజొల్యూషన్ ఆఫీస్‌ను (ఏఏఆర్‌వో) సిద్ధం చేసింది. ఈ సంస్థకు చెందిన డైరెక్టర్ పెంటగాన్ వ్యాఖ్యలకు విరుద్ధంగా ప్రకటన చేశారు. గ్రహాంతర వాసులు భూమిపైకి వచ్చి వుండవచ్చు, ఈ విషయాన్ని శాస్త్రీయంగా పరిశీలించాలని అంటారు. ఏఏఆర్‌వో మరో డైరెక్టర్ డాక్టర్ సియాన్.జె.కిర్క్ పాట్రిక్ కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు.
ఎగిరే పళ్లాలు, ఏలియన్స్‌కు సంబంధించిన అమెరికా సైన్యం ఒక ప్రత్యేక పేరును పెట్టింది. అదే అన్ ఐడెంటిఫైడ్ ఏరియల్ ఫినోమినా (యూఏపీ). 1969లో బ్లూబుక్ పేరుతో ఒక పరిశోధన జరిగింది. ఈ పరిశోధనలో 12వేలకు పైగా ఎగిరే పళ్లాలు కనిపించినట్లు చెప్పారు. ఇన్ని జరిగినా కూడా ఇప్పటి వరకు అమెరికా చెబుతున్నది ఒక్కటే. తాము ఎన్ని పరిశోధనలు చేసిన ఏలియన్స్‌కు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం దొరకలేదని అంటోంది.



Click it and Unblock the Notifications