Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
Lengthening Surgery: అమ్మాయిలు డేటింగ్‌కు రావట్లేదని కోట్లు ఖర్చు పెట్టి హైట్ పెరిగాడు
అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. ఆడ, మగ అనే తేడాలేం అవసరం లేదు. రకరకాల ఫేస్ క్రీములు, లోషన్లు, ఫేస్ వాష్‌లు వాడేస్తుంటారు. అబ్బాయిలు కూడా హ్యాండ్సమ్‌గా కనిపించేందుకు స్టైల్ గా హెయిర్ కట్ చేసుకోవడం, ట్రిమ్మింగ్ చేసుకోవడం, క్రీములు రాయడం చేస్తుంటారు. మరికొందరైతే సర్జరీలు కూడా చేయించుకుంటారు.
అమెరికాకు చెందిన మోసెస్ గిబ్సన్ అనే వ్యక్తి కూడా హ్యాండ్సమ్ గా కనిపించాలనుకున్నాడు. తాను కొద్దిగా హైట్ పెరిగితే మరింత హ్యాండ్సమ్ గా కనిపించవచ్చని ఏకంగా రెండు కాళ్లకు సర్జరీ చేయించుకున్నాడు. ఇందు కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేశాడు.

అమ్మాయిలు డేటింగ్‌కు రావట్లేదని హైట్ సర్జరీ:
అమెరికాలోని మిన్నెసోటాకు చెందిన 41 ఏళ్ల మోసెస్ గిబ్సన్ సాఫ్ట్‌పేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ఖాళీ సమయంలో ట్యాక్సీ డ్రైవర్ గా కూడా పని చేస్తుంటాడు. అతడి హైట్ 5.5 ఫీట్లు. తన ఎత్తు వల్ల తనతో ఏ అమ్మాయి డేటింగ్ కు రావడం లేదని తెగ ఫీలైపోయాడు. ఎత్తు తక్కువగా ఉన్నాడని తనను చాలా మంది అమ్మాయిలు రిజెక్ట్ చేశారంట. దీంతో ఎలాగైనా హైట్ పెరగాలనుకున్నాడు. అందుకోసం ఎన్నో రకాల మందులు ట్రై చేశాడు. కానీ అవేవీ ఫలితాన్ని ఇవ్వలేదు.
సర్జరీతో తీవ్రమైన నొప్పి, అయినా వెనకాడలేదు:
తన ప్రయత్నాలు ఏవీ వర్కవుట్ కాకపోవడంతో లెంథెనింగ్ సర్జరీ చేయించుకోవాలని ఫిక్సయ్యాడు. అయితే ఆ సర్జరీకి కోట్లాది రూపాయలు కావాలి. అలాగే తీవ్రమైన నొప్పిని భరించాల్సి ఉంటుంది. డబ్బుకు, బాధకు ఏమాత్రం భయపడలేదు గిబ్సన్. హైట్ పెరగడానికి ఏదైనా చేస్తానని ఫిక్సైపోయాడు.
2016లో 75వేల డాలర్లు ఖర్చు చేసి మొదటి సారి సర్జరీ చేయించుకున్నాడు. మూడేళ్ల పాటు జరిగింది ఈ సర్జరీ. ఈ శస్త్రచికిత్స తో మోసెస్ గిబ్సన్ ఏకంగా 3 ఇంచులు పెరిగాడు. అది గిబ్సన్‌లో నమ్మకాన్ని పెంచింది. తాను ఇంకా హైట్ పెరగవచ్చని అనుకున్నాడు. మరోసారి సర్జరీ చేయించుకుని మరో రెండు ఇంచులు పెరగవచ్చని అనుకున్నాడు. ఈసారి ఏకంగా 98 వేల డాలర్లు ఖర్చు చేసి సర్జరీ చేయించుకున్నాడు.
సర్జరీలకు ఏకంగా రూ. 1.35 కోట్లు:
మోసెస్ గిబ్సన్ రెండు సార్లు లెంథెనింగ్ సర్జరీ చేయించుకున్నాడు. ఈ రెండు శస్త్రచికిత్సలకు మొత్తంగా 1.70 లక్షల డాలర్లు ఖర్చు అయింది. మన రూపాయల్లో ఏకంగా 1.35 కోట్ల అన్నమాట. కోట్ల కొద్దీ రూపాయలు వెచ్చించి మరీ గిబ్సన్ హైట్ పెరిగాడు. ప్రస్తుతం తనకు ఓ గర్ల్ ఫ్రెండ్ కూడా ఉందట.



Click it and Unblock the Notifications