Latest Updates
-
తల్లిదండ్రులూ అలెర్ట్..ఏడాదిలోపు పిల్లలకు పొరపాటున కూడా ఇవి తినిపించొద్దు! -
పెళ్లి గురించి ఎవరూ చెప్పని 5 పచ్చి నిజాలు..ఇవి తెలుసుకోకపోతే కష్టమే! -
పెళ్లిళ్ల సీజన్ రద్దీ.. మీ వేడుకను పాడుచేయకుండా ఇలా ప్లాన్ చేసుకోండి! -
బిర్యానీ, పులావ్ బోర్ కొట్టిందా? అయితే ఈ సండే ఆలూ చికెన్ రైస్ ట్రై చేయండి! -
దగ్గు, గొంతు నొప్పితో సతమతమవుతున్నారా? ఈ చిట్కాలతో వెంటనే ఉపశమనం పొందండి -
Happy akshaya tritiya 2026: అక్షయ తృతీయ నాడు మీ బంధుమిత్రులకు పంపాల్సిన బెస్ట్ విషెస్, వాట్సాప్ స్టేటస్! -
ఇడ్లీ, దోసెల్లోకి అమృతం లాంటి టమాటో పల్లీ చట్నీ..ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది! -
జేఈఈ మెయిన్ ఫలితాలు వచ్చేస్తున్నాయి.. కటాఫ్ మార్కులు చూస్తే షాక్ అవ్వాల్సిందేనా? -
ఈ వీకెండ్ మురాదాబాదీ చికెన్ పులావ్ రుచి చూడండి.. ఫిదా అవ్వాల్సిందే! -
ప్రీ డయాబెటిస్: ఇంకా షుగర్ రాలేదులే అని లైట్ తీసుకుంటున్నారా? శరీరంలో అసలేం జరుగుతుందో తెలుసా?
ట్రంప్ సినిమాల్లో కూడా నటించారన్న విషయం తెలుసా?.. ఆ సినిమాలు ఎక్కడ చూడాలంటే?
ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు. డెమొక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్‌పై భారీ మెజారిటీతో గెలుపొంది, సంచలన రికార్డు సృష్టించారు. అమెరికన్ రాజకీయ చరిత్రలోనే సంచలన విజయమైన ఈ విజయాన్ని.. సాధించిన ట్రంప్ పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగుతోంది.
ట్రంప్ రాజకీయ నాయకుడు మాత్రమే కాదు ఒక వ్యాపారవేత్త అన్న విషయం తెలిసిందే. అయితే ట్రంప్ సినిమాల్లో కూడా నటించారు. ఆయన రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికవడంతో ఆయన నటించిన సినిమాలు వైరల్ అవుతున్నాయి. అలాగే ఆయన నటించిన సినిమాలను చూసేందుకు ఆయన అభిమానులతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అయితే ట్రంప్ ఎన్ని సినిమాలో నటించారు? ఆయన నటించిన సినిమాలు ఏంటి? ఆయన ఏ పాత్రలో నటించారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

ట్రంప్ సినిమాల్లో ఎప్పుడు ప్రవేశించారంటే?
వ్యాపారవేత్తగానే కాకుండా విజయవంతమైన రాజకీయ నాయకుడిగా ట్రంప్ తనదైన గుర్తింపును నమోదు చేసుకున్నారు. అయితే ట్రంప్ తన సినీరంగ ప్రవేశం 1989లో ప్రారంభించారు. 1989 నుంచి సినిమాల్లో కనిపించినా కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో మాత్రమే కనిపించారు. అయితే మరికొన్ని సినిమాల్లో ముఖ్యమైన పాత్రల్లో నటించారు. ఆ సినిమాలు ఏంటంటే?
ట్రంప్ నటించిన సినిమాలు ఇవే..
అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. 1989లో "గోస్ట్ కాంట్ డూ ఇట్" అనే ఒక రొమాంటిక్ కామెడీ చిత్రంలో ఒక పాత్రలో కనిపించారు. ఈ సినిమాలో ట్రంప్ కనిపించించి చిన్న పాత్రలోనే అయినా.. ప్రేక్షకులకు ఎంతగానో గుర్తుండిపోయారు. అదే ఆయన సినీరంగ ప్రవేశానికి ప్రవేశద్వారంగా చెప్పుకోవచ్చు.
ఆ తరువాత "ది లిటిల్ రాస్కల్" అనే చిత్రంలో కూడా నటించారు. ఈ చిత్రంలో వాల్ట్ జాన్‌స్టన్ 3 పాత్రకు తండ్రిగా కనిపించి ఆకట్టుకున్నారు. ఈ చిత్రంలో ఆయన నటనకు ప్రత్యేక గుర్తింపు కూడా లభించింది. ట్రంప్ కూడా చాలా అనుభవజ్ఞమైన నటుడిగా నటించి ఆకట్టుకున్నారు.
దీంతోపాటు 1992లో క్రిస్ కొలంబస్ అనే దర్శకుడు తెరకెక్కించిన "హోమ్ అలోన్ 2" చిత్రంలో కూడా నటించారు. ఈ చిత్రంలో ట్రంప్ పాత్ర హాస్యాస్పదంగా ఉంటుంది. చాలా కామెడీగా, నవ్వు తెప్పించే విధంగా ఉంటుంది. ఈ పాత్ర ఇప్పటికీ ఆ సినిమా చూసిన వ్యక్తులకు గుర్తిండిపోతుంది. దీంతో పాటు 1995లో "ఎక్రాస్ ది సీ ఆఫ్ టైం" అనే అడ్వెంచరస్ చిత్రంలో కూడా నటించారు.
వీటితో పాటు 1996లో విడుదలైన "ది అసోసియేట్", 1998లో విడుదలైన "54", 1998లో విడుదలైన "సెలెబ్రెటీ", 2001లో విడుదలైన "జూలాండర్" అనే సినిమాల్లో ముఖ్యమైన పాత్రల్లో కనిపించి అందరినీ ఆకట్టుకున్నారు. వీటితో పాటు మరికొన్ని సినిమాల్లో నటించి ప్రేక్షకుల మెప్పు పొందారు.
2002లో విడుదలైన "టూ వీక్స్ నోటిస్", 2010లో విడుదలైన "వాల్ స్ట్రీట్: మనీ నెవర్ స్లీప్స్" అనే సినిమాల్లో నటించారు. అలాగే, "ఎడ్డి", "పీఎంఓ వండర్ఫుల్ ప్రెజెంట్స్", "స్మాల్ పొటాటోస్: హూ కిల్ USFL" సినిమాల్లో నటించి అందరి గుర్తింపు పొందారు. మొత్తానికి ట్రంప్ కేవలం వ్యాపారవేత్తగానే కాకుండా, రాజకీయ నాయకుడిగా, సినిమాల్లో నటుడిగా తనదైన గుర్తింపును సొంతం తాను ఎంచుకున్న రంగంలో విజయం సాధించి తనదైన ముద్ర వేసుకున్నారు. ప్రస్తుతం ఆయన అమెరికాకు రెండోసారి అధ్యక్షుడిగా సేవలు అందించనున్నారు.



Click it and Unblock the Notifications











