Latest Updates
-
ఇడ్లీ, దోసెల్లోకి అమృతం లాంటి టమాటో పల్లీ చట్నీ..ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది! -
జేఈఈ మెయిన్ ఫలితాలు వచ్చేస్తున్నాయి.. కటాఫ్ మార్కులు చూస్తే షాక్ అవ్వాల్సిందేనా? -
ఈ వీకెండ్ మురాదాబాదీ చికెన్ పులావ్ రుచి చూడండి.. ఫిదా అవ్వాల్సిందే! -
ప్రీ డయాబెటిస్: ఇంకా షుగర్ రాలేదులే అని లైట్ తీసుకుంటున్నారా? శరీరంలో అసలేం జరుగుతుందో తెలుసా? -
కెమికల్ మామిడి పండ్లను తింటున్నారా? అసలైన పండ్లను గుర్తించడం ఇలా! -
ఇంట్లోనే స్వచ్ఛమైన చాట్ మసాలా ..ఒక్కసారి చేసి పెట్టుకుంటే 8 నెలల పాటు నిల్వ! -
అక్షయ తృతీయ రోజున బంగారం కొంటున్నారా? ఈ ముహూర్తాలు తెలిస్తే అదృష్టం మీదే! -
మేషం, సింహం, ధనస్సు రాశుల వారికి అద్భుతమైన ధనయోగం..! - శనివారం, 18 ఏప్రిల్ 2026 -
ఎండల వేళ పెళ్లి వేడుకలు.. అతిథుల ఆరోగ్యం కోసం ఈ జాగ్రత్తలు! -
ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ నుంచి తప్పించుకోవడానికి ఈ చిట్కాలు ట్రై చేయండి
తాలిబన్లతో కలిసి అఫ్తనిస్తాన్‌లో యూట్యూబర్.. వైరల్ అవుతున్న వీడియోలు..!
అఫ్గనిస్థాన్‌లో ఇప్పుడు తాలిబన్ల పాలన వుందన్న విషయం మనకు తెలిసిందే. 2021లో తాలిబన్లు అఫ్గనిస్తాన్‌ను ఆక్రిమించుకున్నారు. ఆ సమయంలో కొన్ని విమానాల్లో అఫ్గానీయులు వేరే దేశానికి వెళ్లడానికి ప్రయత్నించారు. విమానాలు కిక్కిరిసిపోయాయ్. కొందరు విమానాన్ని రన్నింగ్‌లో ఎక్కి విమానం గాల్లో ఎగురుతుండగానే పట్టుకొని పై నుంచి కిందకు పడిపోయే దారుణ స్థితిని చూసాం. తాలిబన్ల పాలనంటే ఎంత ఘోరంగా వుంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అక్కడ మహిళలకు చదువు, స్వేచ్ఛ వుండదు. రాక్షస పాలనలాగా తాలిబన్ల పాలన వుంటుంది. బహిరంగంగానే ఘోరమైన శిక్షలను వేస్తారు. అలాంటి ప్రస్తుత అఫ్గానిస్తాన్‌లో ఓ అమెరికన్ యూట్యూబర్ వీడియో చేయడానికి వెళ్లాడు. అతనికి ఎదురైన పరిస్థితులు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయ్. దీనిపై నెటిజెన్లు తీవ్రంగా మండిపడుతున్నారు.
ఎలీ స్నైడెన్ అనే యూట్యూబర్ ఇన్స్‌టాగ్రామ్‌లో తాను తిరిగిన అనేక దేశాలకు సంబంధించిన వీడియోలు పెడుతుంటారు. ఇవి బాగా వైరల్ అవుతాయ్. అలా తాలిబన్లు కంట్రోల్ చేస్తున్న అఫ్గనిస్తాన్‌కు వెళ్లాడు. అక్కడ ఎక్కడ చూసినా తుపాకులు పట్టుకొని తాలిబన్ల సైన్యం వుంటుంది. ఈ యూట్యూబర్ వెంబడి కూడా ఒక తాలిబన్ సైనికుడిని ఇప్పంచి పంపించారు. ఈ యూట్యూబర్ ఎక్కడికి వెళ్తే, ఆ తాలిబన్ సైనికుడు కూడా వెంబడి వెళ్తాడు.

ఎలీ స్నైడర్ ఒక్కో వీడియోను ఇన్స్‌టాగ్రాంలో షేర్ చేశాడు. అఫ్ఘనిస్తాన్‌లో మడవ పెద్ద నగరమైన మజర్-ఈ-షరీఫ్‌లో తిరుగుతూ వీడియోలు చేశాడు. ఒక ప్రైవేట్ ట్యాక్సీని తీసుకొని కొన్న ప్రాంతాలను చుట్టాడు. ఉత్తర అఫ్గనిస్థాన్‌లో వుండే ప్రముఖ హజీ పియాదా మజీదుకు కూడా వెళ్లాడు. తాను ఎక్కడికి వెళ్లినా వెంట వున్న తాలిబన్లు తనను వదలడం లేదని చెప్పుకొచ్చాడు.
అఫ్గాన్‌లో మహిళలు, పిల్లల పరిస్థితి దారుణంగా వుందని చెప్పుకొచ్చాడు. ఈ వీడియోపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. కొందరైతే అఫ్గనిస్థాన్‌లోకి వెళ్లి సురక్షితంగా ఎలా వుంటావునుకున్నావని ఒక యూజర్ ప్రశ్నించాడు.
యూట్యూబర్ ఎక్కడికి వెళ్లినా అక్కడ తాలిబన్లు తుపాకులు పట్టుకొని ఇతని వెంట వెళ్తుండడం చూడవచ్చు. ఆడవారైతే చాలా తక్కువ సంఖ్యలో బయటకు రావడం చూస్తాం. బుర్కా పద్ధతిని చాలా కఠినంగా అమలుజరుగుతుంది. యూట్యూబర్‌తో తాలిబన్లు వీడియోలో కనిపించినా అక్కడి నియమ నిబంధనలు చాలా కఠినంగా వుంటాయ్. యూట్యూబర్‌ను ఒక్క నిమిషం కూడా స్వేచ్ఛగా వదలడం లేదంటే అప్గనిస్తాన్‌లో ప్రతి ఒక్కరి పరిస్థితి ఎలా వుంటుందో అర్ధం చేసుకోవచ్చు. మొత్తానికి ఈ ఎలీ స్నైడెన్ అనే యూట్యూబ్ ట్రావెలర్ అఫ్గనిస్థాన్ వెళ్లి పెద్ద సాహసమే చేశాడని అనుకోవచ్చు.
అధికారిక లెక్కల ప్రకారం అఫ్గనిస్తాన్ లో పరిస్థితి చాలా దారుణంగా వుంది. అప్ఘనిస్తాన్‌లో సుమారు 40 లక్షల మంది సరైన ఆహారం లేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోంటున్నారు. వీరిలో 30 లక్షల వరకు 5 ఏళ్లలోపు పిల్లలుండడం ఆందోలనకు గురి చేస్తుంది. తాలిబన్లు అఫ్గనిస్థాన్‌ను ఆక్రిమించుకున్న తరువాత ఇతర దేశాలు కూడా అఫ్గాన్‌కు సాయం అందించడానికి ముందుకు రావడం లేదు. అప్ఘాన్‌లో ఆడపిల్లలకు, మహిళలకు కనీస హక్కులు లేకుండా తాలిబన్లు నియమనిబంధనలు జారీ చేశారు. మహిళలు బయటకు వస్తే పూర్తిగా బురఖా ధరించాలని కఠిన నిబంధనలను తాలిబన్లు జారీ చేశారు.



Click it and Unblock the Notifications











