Latest Updates
-
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.!
అత్యంత పొడవైన గోళ్ల కలిగిన మహిళగా గిన్నిస్ రికార్డ్..! ఆ పనిని ఎలా చేసుకుంటారని ప్రశ్నిస్తున్న నెటిజన్లు..!
గిన్నిస్ రికార్డ్ కొట్టడం అంటే ఆశామాశీ కాదు. కొందరు ఈ రికార్డు కోసం ఎన్నో ఏళ్లు వేచి చూస్తారు. మరికొందరు ఎన్నో ఏళ్లు ప్రాక్టీస్ చేస్తున్నారు. అమెరికా మిన్నెసోటాకు చెందిన డయానా ఆర్మ్‌స్ట్రాంగ్ ఊహించని విధంగా తన చేతిగోళ్లను పెంచి గిన్నిస్ రికార్డ్‌లో చోటు దక్కించుకుంది. 27 ఏళ్ల నుంచి ఆమె గోళ్లకు కట్ చేసుకోలేదు. ఆమె గోళ్లను చూస్తే మనకు దయ్యం గోళ్లలా అనిపిస్తాయ్. డయానా ఆర్మ్‌స్ట్రాంగ్ గనుక రాత్రి సమయంలో ఎవరికంటనైనా అకస్మాత్తుగా చీకట్లో కనిపిస్తే నిజంగానే దయ్యమేమోనని భ్రమపడతారు.
ఆమె చేతి గోళ్లు భూమిని తాకడం మనం చూడవచ్చు. 1997 నుంచి ఆమె తన గోళ్లను కట్ చేసుకోవడం ఆపేశారు. డయానా గోళ్లను కొలిస్తే 13 మీటర్లు వుంటుంది. 2022లో అత్యంత పొడవైన గోళ్లున్న మహిళగా ఆమె గిన్నిస్ రికార్డును సాధించారు. ఒక స్కూలు బస్సుకన్నా డయానా చేతిగోళ్లే పొడవుగా వుంటాయంటే చూడడాలనికి ఎలా వంటాయో అర్ధం చేసుకోవచ్చు.

ఈ పొడవైన గోళ్లను చూసి అమెరికన్లు ఆమెను రకరకాల ప్రశ్నలు వేస్తున్నారు. మలవిసర్జనకు వెళ్లినప్పుడు..ఇంత పొడవైన గోళ్లు వుండి టాయిలెట్ పేపర్‌ను ఎలా ఉపయోగిస్తారని ప్రశ్నిస్తున్నారు. దీనికి ఆమె తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది. తాను టాయిలెట్ పేపర్‌ను ఎక్కువగా ఉపయోగిస్తానని చెప్పొకొచ్చింది.
ఇలా ఆమె చాలా ప్రశ్నలే ఎదుర్కొన్నారు. రోజుకు మీకు నెయిల్ పాలిష్ కోసం ఎన్ని బాటిళ్లు అవసరమౌతాయని ఒకరు ప్రశ్నించారు.
డయానా ఆర్మ్‌స్ట్రాంగ్ వ్యక్తిగత జీవితం చాలా విషాదంగా వుంది. తన 16 ఏళ్ల పాప నిద్దరలోనే కన్ను మూసినట్లు చెప్పింది. ఇది తన జీవితంలో అత్యంత విసాదకరమైన అంశంగా చెప్పొకొచ్చింది. తన చేతి గోళ్లను చనిపోయిన కూతురే క్లీన్ చేసేతన అప్పటి మధుర ఘ్నాపకాలను స్మరించుకుంది. కూతరు చనిపోయిన తరువాత 10 సంవత్సరాల వరకు డిప్రెషన్‌లో వున్నారు. చేతి గోళ్లను ఇంత పొడవుగా పెంచడానికి చనిపోయిన తను కూతురు కూడా ఒక కారణమని అంటున్నారు.
బాధలోంచి, మధుర ఘ్నాపకంలోంచి డయానా ఆర్మ్‌స్ట్రాంగ్ ఈ విజయాన్ని సాధించారు. దీని కోసం ఆమె చాలా కృషిని చేసిందనుకోవచ్చు. 27 ఏళ్లు ఓపికగా గోళ్లను కట్ చేసుకోకుండా వుండడం ఒకటైతే పెరిగిన గోళ్లు కట్ కాకుండా జాగ్రత్తగా చూసుకోవడం మరొకటి.
చేతి గోళ్లు పొడవుగా పెరగాలంటే..?
చేతి గోళ్లు అంత పొడవుగా పెరగాలంటే చాలా జాగ్రత్తలే తీసుకోవాలి. ముందుగా గోళ్లను నీటిని తాకకుండా చూసుకోవాలి. నెయిన్ పాలిష్‌లు పెట్టడం ఆపివేయాలి. గోళ్లు బాగా పెరగాలంటే వాటికి సంబంధించిన పోషకాలనే తీసుకోవాలి. ఫాలిక్ యాసిడ్,, వైటమన్ సి, ఏ, పోషకాలు గోళ్లు బాగా పెరగడానికి దోహదపడతాయ్.
ఆకుకూరలను, గుడ్లను ఎక్కువగా తీసుకోవాలి. టమాటలు ఎక్కువగా తింటే కూడా గోళ్లు బాగా పెరుగుతాయ్. పాలను కూడా ఎక్కువగా తాగాలి. గోళ్లు బాగా పెరగడంలో వైటమిన్ హెచ్ బాగా దోహదం చేస్తుంది. మష్‌రూంలు, అరటిపళ్లు, సాల్మన్ చేప, అవొకాడో లాంటి వాటిల్లో వైటమిన్ హెచ్ అధికంగా వుంటుంది.
గోళ్లు పెరగడానికి కెరాటిన్ కూడా కారణమవుతుంది. అయితే ఈ కెరాటిన్‌ను శరీరం సహజంగా ఉత్పత్తి చేసుకుంటుంది. గోళ్లను కొరికే అలవాటును తగ్గించుకుంటే, గోళ్లను బాటిళ్లను తెరవడం ఆపివేస్తే గోళ్లు పొడవుగా పెరుగుతాయ్.



Click it and Unblock the Notifications