Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
Anand Mahindra Helps : రోల్స్ చేస్తున్న బాలుడికి మహీంద్ర సాయం..
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే మహీంద్రా ఆటోమొబైల్స్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా మరో పోస్ట్‌ను షేర్ చేసి నెటిజన్లతో తన అభిమానులతో పంచుకున్నారు. సమాజంలో ఎక్కడైనా ముఖ్యంగా భారతదేశంలో ఎవరైనా కొత్తగా వింతగా అద్భుతంగా ప్రయత్నాలు చేస్తే వారిని అప్పటికప్పుడే ప్రశంసిస్తారు. ఆ విషయాన్ని సోషల్ మీడియాలో అందరితో పంచుకుంటారు. చాలా సందర్భాల్లో అలాంటి వారికి ఆయనే నేరుగా సహకారాన్ని అందించారు. ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియా అకౌంట్‌కు గమనిస్తే ఆయన సమాజంలో ఎందరినో ప్రోత్సహించిన అంశాలు దర్శనమిస్తాయి. ఈ సారి ఆయన ఏం పంచుకున్నారో చూద్దాం.
10 ఏళ్ల బాలుడు రోల్స్ తయారీ
ఢిల్లీ తిలక్ నగర్‌లో 10 ఏళ్ల బాలుడు రోల్స్ అమ్ముతున్న వీడియో సోషల్ మీడయాలో వైరల్‌గా మారింది. కేవలం 10 ఏళ్ల వయసులోనే రొల్స్‌ను తన చేతులతో స్వయంగా వండుతూ తయారు చేస్తున్న వీడియో వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రాను ఆకట్టుకుంది. ఈ వీడియోను సరబ్‌జీత్ సింగ్ అనే ఫుడ్ ఇన్‌స్టాగ్రామ్ ఫుడ్ లాగర్ దీనిని షేర్ చేసారు.
జస్‌ప్రీత్ సింగ్
రోల్స్ తయారు చేస్తున్న బాలుడి పేరు సరబ్‌జీత్ సింగ్. అంత చిన్న వయసులో తానెందుకు రోల్స్ తయారు చేస్తున్నాడో ఆ వీడియోలో చెప్పాడు. తన తండ్రి కూడా రోల్స్ చేసేవాడని, కానీ బ్రేయిన్ టీబీ రావడం వల్ల ఇటీవల అనారోగ్యంతో మరణించాడు. తండ్రి దగ్గరి నుంచి రోల్స్ చేయడం నేర్చుకున్న అతను తండ్రి తరువాత వాటిని అక్కడే తయరు చేస్తూ అమ్ముతున్నాడు. "నేను గురుగోబింద్ సింగ్ జి కొడుకును, నాలో బలం ఉన్నంత వరకు పనిచేస్తాను" అని ఆ వీడియోలో ఆ 10 ఏళ్ల బాలుడు చెప్పడం మనం చూస్తాం.
బాలుడు తయారు చేస్తున్న రోల్స్ షాపు ఢిల్లీలోని తిలక్ విహార్ పోలీస్ స్టేషన్ వద్ద వుంది. వెస్ట్ ఢిల్లీలోని తిలక్ నగర్, తిలక్ విహార్ పోలీస్ స్టేషన్ వద్ది సన్నీ జ్యూస్ సెంటర్ ఎదురుగానే ఈ 10 ఏళ్ల బాలుడి రోల్స్ షాపును మనం చూడవచ్చు.

వారం క్రితం వైరల్
వారం క్రితం ఫుడ్ వ్లాగర్ సరబ్‌జీత్ సింగ్ ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. వారంపాటు బాగా వైరల్ అయిన తరువాత మహీంద్రా దృష్టికి నిన్న రావడంతో ఆయన నిన్న ఉదయం తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ఈ విషయాన్ని నెటిజన్లతో పంచుకున్నారు. "జస్‌ప్రీత్‌కు చాలా ధైర్యం ఉంది. చాలా కష్టపడుతున్నాడు. ఆ బాలుడు చదువుకోవడానికి ఎటువంటి ఇబ్బందులను ఎదుర్కొనకూడదు. అతను ఢిల్లీ తిలక్‌నగర్‌లో ఉన్నాడని అనుకుంటున్నాను. ఎవ్వరివద్దనైనా అతని ఫోన్ నంబర్ వుంటే, నాకు పంపించగలరు. మహీంద్ర ఫౌండేషన్ జస్‌ప్రీత్ చదువుకు, కెరీర్‌కు అన్ని రకాలుగా ఎల్లప్పుడూ సహాయంగా ఉంటుంది" అని ఆనంద్ మహీంద్రా పోస్ట్ చేశారు.
మహీంద్రా పోస్ట్ చేయడంతో మరింత మందికి ఈ బాలుడి వీడియో గురించి తెలిసింది. చాలా మంది నెటిజన్లు మహీంద్రను పొగడ్తలతో, ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. మీ సేవా కార్యక్రమాలు నిజంగా చాలా గొప్పవి, వెల్ డన్ సర్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఆనంద్ మహీంద్రా ఎంతో కాలంగా సోషల్ మీడియా ద్వారా ఇలా ఎంతో మందిని వెన్నుతట్టి ప్రోత్సహించారు, వేల మందికి కెరీర్‌లో సహకారాన్ని అందించారు.



Click it and Unblock the Notifications