Latest Updates
-
రోడ్ సైడ్ స్టైల్ ఎగ్ శార్వా..చపాతీ, దోశ, పరోటాల్లోకి అమృతంలా! -
గ్యాస్, అజీర్తి అని ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారా? ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ముప్పు కావచ్చు, జాగ్రత్త! -
ఆడవారైనా, మగవారైనా అస్సలు తాగకూడని డ్రింక్ ఏంటో తెలుసా.. డాక్టర్ సలహా ఇదే.! -
ఇడ్లీ, దోశలతో విసిగిపోయారా? ప్రొటీన్ల నిధి,బలాన్నిచ్చే ఎగ్ పరాఠా ట్రై చేయండి! -
సైలెంట్ కిల్లర్స్: పైకి ముక్కుసూటి.. వెనుక మహా కిలాడీలు!..ఈ 3 రాశులు ఎవరో తెలుసా? -
వినాయక చవితి స్పెషల్..ఇంట్లోనే ఈజీగా నోరూరించే చాక్లెట్ మోదక్ ఎలా చేసుకోవాలంటే.. -
ఫోన్ పక్కనపెట్టి ఇది ట్రై చేయండి.. హృతిక్ చెబుతున్న హెల్త్ టిప్స్! -
నార్త్ స్టైల్ చోలే మసాలా.. పూరీ, చపాతీలోకి వేళ్లు చప్పరిస్తూ లాగించేస్తారు.! -
చికెన్, మటన్ కంటే 50 రెట్లు బలం..ఏడాది పాటు నిల్వ ఉండే బోడకాకరకాయ పచ్చడి ఇలా చేయండి -
వయసు పైబడితేనే అల్జీమర్స్ వస్తుందా.. మతిమరుపునకు దారితీసే ప్రమాదకర కారకాలివే.!
Viral Video: ఆ బుడ్డోడు మాములోడు కాదయ్యా..తానే చదివిస్తానంటూ ఆనంద్ మహీంద్రా బంపరాఫర్
ఆనంద్ మహీంద్రా..కేవలం పెద్ద వ్యాపారవేత్త మాత్రమే కాదు, మట్టిలో మాణిక్యాలను గుర్తించి వారిని వెలుగులోకి తీసుకురావడంలో ముందుండే గొప్న మనిషి. మహీంద్రా గ్రూప్ చైర్మన్ గా వ్యాపారాన్ని ఉన్నత శిఖరాలను తీసుకెళ్తూనే, దేశంలోని టాలెంట్ గల వ్యక్తులను కూడా ఎంకరేజ్ చేయడంలో కూడా ముందువరుసలో ఉంటారు.

సోషల్ మీడియా వేదికగా ఆయన ఎప్పుడూ విలక్షణమైన, స్ఫూర్తిదాయకమైన ప్రతిభ గల వ్యక్తుల కథలను ప్రపంచానికి పరిచయం చేస్తుంటారు. తాజాగా ఆయన ఉత్తరాఖండ్‌లోని అందమైన నైనిటాల్ పట్టణ వీధుల్లో గారడీ చేసే ఓ చిన్నారి ఇంద్రజాలికుడి వీడియోను తన ఎక్స్ అకౌంట్ లో షేర్ చేశారు. ఇంటర్నెట్ లో వైరల్ గా మారిన ఆ బాలుడి అద్భుతమైన ప్రతిభకు ముగ్ధుడైన ఆనంద్ మహీంద్రా, ఆ కుర్రాడిపై ప్రశంసల జల్లు కురిపించడమే కాకుండా అతడికి ఆర్థికంగా అండగా నిలుస్తానని ప్రకటించి అందరి హృదయాలను గెలుచుకున్నారు.
ఆ వైరల్ వీడియోలో.. రోడ్డు పక్కన నిలబడి తన చుట్టూ చేరిన ప్రేక్షకుల కోసం ఆ చిన్న బాలుడు చేస్తున్న మాయాజాలం ఎవరినైనా కట్టిపడేస్తుంది. తన చేతిలోని కొన్ని లోహపు కప్పులు, చిన్న ఎర్రటి బంతులతో అతడు చేసే ఇంద్రజాలం చూస్తే కళ్లు చెదరాల్సిందే. నా చేతుల శుభ్రత (చేతివాటం) మీకు నచ్చిందా? అన్నట్లుగా బంతులను కప్పుల కింద పెట్టి, తన చిట్టి చేతులతో అద్భుతమైన వేగంతో కప్పులను అటూ ఇటూ కదుపుతూ అతడు చేసే గారడీ వర్ణనాతీతం.
కప్పుల కింద ఉన్న బంతులు క్షణాల్లో మాయమైపోతాయి, మరుక్షణమే ఊహించని విధంగా మరో కప్పు కింద ప్రత్యక్షమవుతాయి. అసలు ఏ బంతి ఎటు వెళ్తుందో, ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కాక ప్రేక్షకులు ఆశ్చర్యంలో మునిగిపోతారు. వేగం, కచ్చితత్వం, వీక్షకుల దృష్టిని మరల్చే కళల కలయికగా సాగే అతని ప్రదర్శన అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది.
అయితే, ఇక్కడ అందరినీ విశేషంగా ఆకట్టుకునేది కేవలం ఆ బాలుడి ట్రిక్కులు మాత్రమే కాదు.. వయసుకు మించిన అతని ఆత్మవిశ్వాసం. ఆ చిరుప్రాయంలోనే ఎంతో పరిణతితో కూడిన ముఖ కవళికలు, ప్రేక్షకులతో అతడు మమేకమవుతూ సంభాషించే విధానం అద్భుతం. నవ్వుతూ, చమత్కరిస్తూ వందలాది మంది ముందు ఏమాత్రం బెరుకు లేకుండా ప్రదర్శన ఇస్తున్న ఆ చిన్నారి తీరు ప్రతి ఒక్కరినీ మంత్రముగ్ధులను చేస్తుంది. ఈ అద్భుతమైన వీడియో ఆనంద్ మహీంద్రా కంట పడటంతో ఆయన ఆశ్చర్యానికి అవధులు లేకుండా పోయాయి.
వెంటనే ఆ వీడియోను షేర్ చేస్తూ ఆనంద్ మహీంద్రా..ఈ కుర్రాడు ఓ అద్భుతమైన ప్రతిభావంతుడు. అతను ఇప్పటికీ నైనిటాల్ వీధుల్లో ఇలాగే ప్రదర్శనలు ఇస్తున్నాడా? ఈ బాలుడికి ఉన్నత చదువులు చెప్పించడంతో పాటు, మ్యాజిక్ పట్ల అతనికున్న ఆసక్తిని ప్రోత్సహించాలని నేను కోరుకుంటున్నాను అని తెలిపారు. అంతేకాదు సరైన మార్గదర్శకత్వం, అవకాశాలు లభిస్తే ఈ బాలుడు ప్రపంచంలోని అత్యుత్తమ ఇంద్రజాలికులలో ఒకడిగా ఎదగగలడన్నారు. ఈ చిన్నారి గురించి లేదా అతని తల్లిదండ్రుల గురించి ఏమైనా సమాచారం తెలిస్తే వారితో సంప్రదించడానికి తనకు సహాయం చేయాలని నెటిజన్లకు విజ్ఞప్తి చేశారు.
ఆనంద్ మహీంద్రా సాయం అందితే నైనిటాల్ వీధుల్లో గారడీ చేసే ఆ చిన్నారి చేతులు రేపు అంతర్జాతీయ వేదికలపై అద్భుతాలు సృష్టించడం ఖాయం అని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.



Click it and Unblock the Notifications