Latest Updates
-
డ్రై ఫ్రూట్స్ రోజుకు ఎన్ని తినాలో తెలుసా? ఆ తప్పు చేస్తే ప్రమాదమే! -
డెలులు డేటింగ్.. మీరూ ఇలాంటి భ్రమల్లో బతుకుతున్నారా.? -
పెనంపైనే రెస్టారెంట్ స్టైల్ లో.. దూదిలాంటి మెత్తని గార్లిక్ నాన్ చేసేయండిలా! -
మీ కళ్ల ముందే ఎవరైనా కుప్పకూలిపోతే వెంటనే ఏం చేయాలి? -
నెలసరి సమయంలో వ్యాయామం చేయడం సురక్షితమేనా.. నిపుణుల సలహా ఏంటంటే.? -
ఎముకలకు బలాన్నిచ్చే సంప్రదాయ మటన్ షోర్బా.. ఒక్కసారి రుచి చూస్తే వదిలిపెట్టరు! -
వర్షాకాలం అలర్ట్.. గోడలపై ఇలా ఉంటే ఊపిరితిత్తుల వ్యాధికి దారితీస్తుందా.. డాక్టర్లు చెబుతున్న వాస్తవాలు -
మీ పిల్లలు కెరీర్లో ఉన్నతంగా ఎదగాలంటే.. స్టడీ రూమ్‌లో ఈ వాస్తు సలహాలు పాటించాల్సిందే.! -
ఈ వారం ఈ నాలుగు రాశుల వారికి తిరుగే లేదు.. అన్నింటా విజయమే, కష్టానికి తగిన ప్రతిఫలం.! -
కండల వీరుడికి ఏమైంది? సల్మాన్ ఖాన్ ఇలా అయిపోడానికి కారణం అదేనా?
అనంత్ అంబానీ అనారోగ్య సమస్యలు తెలిస్తే.. జోకులు వేయడం ఆపుతారు..!
అనంత్ అంబానీ రాధికా మర్చంట్ పెళ్లి వేడుక జరిగినంత ఘనంగా మరే పెళ్లి వేడుకను మనం చేసి వుండము. ప్రపంచంలో వున్న గొప్పవాళ్లంతా ఈ పెళ్లికి వస్తున్నారు. సెలబ్రెటీలందరినీ ఒకే చోట చూడాలనుకుంటాం. అనంత్ అంబానీ పెళ్లితో ఆ కోరిక చాలా మందికి తీరినట్టైంది. ఇప్పటికే హాలీవుడ్ స్టార్లు, బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ స్టార్లందరూ ఈ పెళ్లి వేడుకకు హాజరయ్యారు. ప్రముఖ వ్యాపారవేత్తలందరూ ఈ పెళ్లికి హాజరయ్యారు.

పెళ్లికి వచ్చే అతిథుల కోసం 100 విమానాలను అటూ ఇటూ తిప్పుతారు. ఆకాష్ అంబానీ పెళ్లి కన్నా అనంత్ అంబానీ పెళ్లిని ముఖేష్ అంబానీ చాలా ఘనంగా చేస్తున్నారు. రాబోయే చాలా సంవత్సరాల వరకు ఈ పెళ్లి గుర్తిండిపోయేలా ముఖేష్ అంబానీ పెళ్లికి ఖర్చులు చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం అనంత్ అంబానీ చిన్న వయసు నుంచే చాలా రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వస్తున్నారు.
అనంత్ అంబానీకి ఎన్ని లక్షల కోట్ల డబ్బు వున్నా చల్లని ఏసీలో పడుకునే అదృష్టం అనంత్ అంబానీకి లేదు. అనంత్ అంబానీకి వున్న ఆరోగ్య సమస్యలు ఏవి, రిలాయన్స్ ఇండస్ట్రీస్ తరువాత ఎవరి చేతుల్లోకి వెళ్తుందనేదానిపై ఇప్పుడు అంతటా ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం రిలాయన్స్ ఇండస్ట్రీస్ మొత్తం ఆస్థుల విలువ 18 లక్షల కోట్లు.
బరువు తగ్గడానికి అనంత్ అంబానీ ఒక పెద్ద తప్పు చేశారు. చాలా తక్కువ సమయంలో ఒకేసారి చాలా బరువు. 2015లో అనంత్ అంబానీ 208 కేజీల బరువున్నాడు, మళ్లీ 2017లో ఒకేసారి 88 కేజీలకు తగ్గాడు, మళ్లీ 2022లో 190 కేజీలకు వచ్చాడు. ఇదే అనంత్ అంబానీ చేసిన అతి పెద్ద తప్పు. తొందరగా బరవు తగ్గి దాన్ని మ్యానేజ్ చేసుకోలేకపోయాడు.
అనంత్ అంబానీ చిన్న వయసు నుంచే క్రోనిక్ ఆస్థమా వ్యాధితో బాధపడుతున్నాడు. ఇది ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి. ఈ వ్యాధి వున్నవాళ్లు ఊపిరి తీసుకోవడానికి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటారు. అనంత్ అంబానీకి చిన్న వయసులోనే ఈ వ్యాధి రావడం వల్ల శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా మారేది. చిన్న వయసులో క్రోనిక్ ఆస్థమా నుంచి బయటపడ్డానికి కొన్ని మందులను వాడాడు. ఆ మందుల నుంచి వచ్చే సైడ్ ఎఫెక్ట్‌ల వల్ల విపరీతంగా బరువు పెరిగాడు. దీంతో అతని శరీరంలో గ్రేలిన్ అనే హార్మోన్ విపరీతంగా పెరిగింది. ఈ గ్రేలిన్ హార్మోన్ మనలో ఆకలిని పెంచుతుంది. అనంత్ అంబానీలో ఈ గ్రేలిన్ హార్మోన్ అధికంగా వుండడం వల్ల అతను ఎక్కువగా తినేవాడు. దీని వల్ల అనంత్ అంబానీలో కొవ్వు పదార్ధాలు కూడా చాలా ఎక్కువగా పెరిగిపోయాయ్.

అనంత్ అంబానీకి చల్లని గాలి తగిలితే ఊపిరి ఆడకుండా చనిపోయే ప్రమాదం వుంది. రాత్రయ్యేసరికి అనంత్ అంబానీ పక్కన ఎవరో ఒకరు తోడుగా వుండాల్సిందే. లేకపోతే అనంత్ ఏమయిపోతుందోనని ఎప్పుడూ ఆందోళన చెందుతూ వుంటారు. అందుకే తల్లి నీతా అంబానీ ఎప్పుడూ అనంత్ అంబానీ వెంటే వుంటుంది. ఈ విషయాన్నే అనంత్ అంబానీ తన ప్రీవెడ్డింగ్ వేడుకలో తన తల్లిదండ్రులు దేవుడి కంటే ఎక్కువ అని చెప్పాడు. నా జీవితం పూలపాన్పు కాదు, అందరి పిల్లల్లా సంతోషంగా పెరగలేదని అన్నాడు. ఎన్నో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాను. నా కోసం నా తల్లిదండ్రులు ఎన్నో నిద్రలేని రాత్రులను గడిపారని అనంత్ అంబానీ అన్నాడు. అనంత్ అంబానీ అన్న ఈ మాటలకు ముఖేష్ అంబానీ కూడా చాలా ఏడ్చారు.
ఇన్ని కష్టాలు వున్నా కూడా అనంత్ అంబానీ ఎప్పుడూ బాధతో కుంగిపోలేదు. సోషల్ మీడియాలో అనంత్‌పై ఎన్ని జోకులు వేసినా అనంత్ వాటిని పట్టించుకోలేదు. అనంత్ అంబానీని తల్లి నీతా అంబానీ ఎప్పుడూ కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తోంది. అనంత్ అంబానీకి దేవుడంటే విపరీతమైన భక్తి. తల్లితో కలిసి ఎన్నో సేవాకార్యక్రమాలు చేపట్టాడు. జామ్ నగర్‌లో ఏనుగుల కోసం మేడువేల ఎకరాల్లో ఒక చిన్నపాటి అడవిని సృష్టించాడు. అనంత్ అంబానీకి వున్న ఈ మంచి మనసును చూసి రాధికా మర్చంట్ అనంత్ ప్రేమలో పడింది. రాధికా మర్చంట్ తండ్రి కూడా పెద్ద వ్యాపారవేత్త. రాధికా మర్చంట్ తండ్రి విరేన్ మర్చంట్‌కు చెందిన ఎన్‌కోర్ హెల్త్‌కేర్ మొత్తం ఆస్తుల విలువ 750 కోట్ల రూపాయలు. ముఖేస్ అంబానీ ఆస్థుల విలువ 7లక్షల కోట్ల వరకు వుంటుంది.



Click it and Unblock the Notifications