Latest Updates
-
తెలంగాణలో ఘనంగా బోనాల వేడుకలు.. ఆధ్యాత్మిక రహస్యం, చరిత్ర ఇదే.! -
మదురై స్పెషల్ మటన్ దోశ.. ఇలా చేస్తే జన్మలో ఆ రుచిని మర్చిపోలేరు! -
సూర్యగ్రహణం 2026..గ్రహణానికి ముందు, తర్వాత చేయాల్సిన పనులివే! -
డ్రై ఫ్రూట్స్ రోజుకు ఎన్ని తినాలో తెలుసా? ఆ తప్పు చేస్తే ప్రమాదమే! -
డెలులు డేటింగ్.. మీరూ ఇలాంటి భ్రమల్లో బతుకుతున్నారా.? -
పెనంపైనే రెస్టారెంట్ స్టైల్ లో.. దూదిలాంటి మెత్తని గార్లిక్ నాన్ చేసేయండిలా! -
మీ కళ్ల ముందే ఎవరైనా కుప్పకూలిపోతే వెంటనే ఏం చేయాలి? -
నెలసరి సమయంలో వ్యాయామం చేయడం సురక్షితమేనా.. నిపుణుల సలహా ఏంటంటే.? -
ఎముకలకు బలాన్నిచ్చే సంప్రదాయ మటన్ షోర్బా.. ఒక్కసారి రుచి చూస్తే వదిలిపెట్టరు! -
వర్షాకాలం అలర్ట్.. గోడలపై ఇలా ఉంటే ఊపిరితిత్తుల వ్యాధికి దారితీస్తుందా.. డాక్టర్లు చెబుతున్న వాస్తవాలు
ఇక ఆన్‌లైన్‌లో కోడిపందేలు, పోలీసుల నుండి తప్పించుకోవడానికి కొత్త ఎత్తుగడ
ఈ పందెం కోళ్లలో ఎన్నో రకాలు ఉన్నాయి. ఒక్కో కోడికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. రంగును బట్టి నైపుణ్యాన్ని బట్టి పందెంలో కోడిపై పందేలు కాస్తుంటారు. కోడి పందేల కోసం ఏవి ఉత్తమమైన జాతులో ఇప్పుడు తెలుసుకుందాం.
సంక్రాంతి అనగానే పిండి వంటలు, గంగిరెద్దులు, హరిదాసు కీర్తనలు, రంగవల్లులు, పతంగులు గుర్తుకు వస్తాయి. కానీ పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కృష్ణా జిల్లా ప్రజలకు మాత్రం కోడి పందేలు గుర్తుకు వస్తాయి. పౌరుషానికీ, రాజసానికీ పందెం కోళ్లను ప్రతీకగా భావిస్తారు. ఒకసారి పుంజు బరిలోకి దిగిందంటే చచ్చే వరకు పోరాడుతూనే ఉంటుంది. సంక్రాంతి కోడి పందేల్లో వేల కోట్లు చేతులు మారుతుంటాయి. అయితే జంతు హింస చట్టం ప్రకారం కోడిపందేలను నిర్వహించకూడదని, అది నేరమని హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో కోడి పందేలు నిర్వహించడానికి వీల్లేదని పోలీసులు నిర్వాహకులకు హెచ్చరికలు జారీ చేశారు. పోలీసుల నిఘా ఎక్కువ కావడంతో కోడిపందేల నిర్వాహకులు మరో ఎత్తుగడ వేశారు.
5జి నెట్‌వర్క్ ఉపయోగించి కోడి పందేలు ఆన్‌లైన్ ద్వారా ప్రసారం చేయనున్నారు. బెట్టింగులు పెట్టే వారికి ప్రత్యేకంగా మెసేజీలు పెట్టి వారితో బెట్టింగ్ నిర్వహించనున్నారు. ఇందుకోసం మెసేజింగ్ యాప్‌లు, లైవ్ స్ట్రీమింగ్, పేమెంట్ పోర్టల్‌ళ్లను సిద్ధం చేసుకున్నారు.

ఆన్‌లైన్‌లో కోడి పందాలు ఎలా నిర్వహిస్తారంటే..
కోడిపందాల్లో పాల్గొని బెట్టింగ్‌లు వేసే ఆసక్తి ఉన్న వ్యక్తులను ఇందులో భాగం చేయనున్నారు. మొదట బెట్టింగ్‌లు వేసే వ్యక్తులతో మెసేజింగ్ గ్రూపులను తయారు చేస్తున్నారు. పందెం ప్రారంభించే ముందు కోడి పుంజుల వివరాలను పోస్టు చేస్తారు. ఆసక్తి ఉన్న బెట్టర్‌లు తమకు ఇష్టమైన రూస్టర్ పేరుతో ఆర్గనైజర్‌కు డబ్బు జమ చేసి పందెంలో పాల్గొనవచ్చు.
పందెం తర్వాత నిర్వాహకులు వారి కమీషన్ తీసుకుని విజేతలకు డబ్బు అందజేస్తారు. ఈ ప్రక్రియ అంతా సజావుగా సాగేందుకు నిర్వాహకులు మెసేజింగ్ యాప్‌లు, లైవ్ స్ట్రీమింగ్, పేమెంట్ పోర్టల్‌ళ్లను సిద్ధం చేసుకున్నారు. కోడి పందాల్లో ఆన్‌లైన్ బెట్టింగ్ ఇప్పుడు కొత్త ట్రెండ్.
ఈ పందెం కోళ్లలో ఎన్నో రకాలు ఉన్నాయి. ఒక్కో కోడికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. రంగును బట్టి నైపుణ్యాన్ని బట్టి పందెంలో కోడిపై పందేలు కాస్తుంటారు. కోడి పందేల కోసం ఏవి ఉత్తమమైన జాతులో ఇప్పుడు తెలుసుకుందాం.

1. కాకి డేగ
కాకి యొక్క నలుపు, డేగ యొక్క ఎరుపు రంగు కలగలిపి ఉంటే దానిని కాకి డేగ అంటారు. ఈ కోళ్లు పోటీలో చాలా అగ్రెసివ్‌గా ఉంటాయి. మంచి ఎత్తు పెరుగుతాయి. మంచి పిక్కలు ఉంటాయి. కాలికి కత్తి కడితే పందేనికి సిద్ధమైపోతాయి.

2. పెరువియన్
చాలా ఎత్తు పెరుగుతుంది. పిక్క సైజు పెద్దగా ఉంటుంది. డబుల్ బాడీ కలిగి ఉంటుంది. చాలా దూకుడుగా ఉంటుంది. పోటీలోకి దిగితే ప్రత్యర్థి కోడిపై అగ్రెసివ్‌గా దాడి చేస్తుంది.

3. కోడి డేగ
కోడి డేగ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పందెంలో దిగిందంటే ఎదుటి కోడి చచ్చేంత వరకు ఇది పోరాడుతూనే ఉంటుంది. దీనికి దూకుడు ఎక్కువ. చాలా అగ్రెసివ్‌గా పోట్లాడుతుంది. కసిగా పందెంలో పాల్గొంటుంది.

4. నెమలి పింగల
మంచి ఎత్తు, బరువు ఉంటుంది. ఫైటింగ్ టెక్నిక్స్ తెలిసిన ఉంటాయి. పందెంలో తెగించి కొట్లాడుతుంది. స్పీడ్‌గా పోరాడుతుంది. దెబ్బ కచ్చితంగా ఉంటుంది.

5. సేతువా
తెల్లని రంగులో ఉంటుంది. చూడటానికి బాయిలర్ కోడిలా తెలుపు రంగులో కనిపిస్తుంది. కానీ పెద్దగా, బలంగా ఉంటుంది. పందెంలో దిగితే ఎక్కువ సేపు పోరాడగలుగుతుంది. చాలా దూకుడుగా వ్యవహరిస్తుంది.

6. కోడి సవల
పోరాడటం వీటికి చిన్నప్పటి నుండే అలవాటు అవుతుంది. పందెంలో గెలవడం వీటికి అలవాటు. దీనిని కోడి సవల అని పిలుస్తారు. కోడి సవల దెబ్బ వాటంగా ఉంటుంది.
జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టం, 1960 మరియు ఆంధ్రప్రదేశ్ గేమింగ్ చట్టం, 1974 ప్రకారం కోడి పందాలు చట్టవిరుద్ధం.



Click it and Unblock the Notifications