Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
సౌతిండియాలో సోలో ట్రావెలర్స్ తప్పక సందర్శించాల్సిన 7 ప్లేస్ లు ఇవే
ఈ మధ్య కాలంలో సోలో ట్రావెలర్స్ బాగా పెరిగిపోయారు. ఒంటరిగా ప్రయాణించడానికి ఇష్టపడే చాలామంది కోసం అనేక పర్యాటక ప్లేస్ లలో ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తున్నాయి. సోలో ట్రావెలర్స్ కు సౌత్ ఇండియా స్వర్గధామం అని చెప్పొచ్చు. దక్షిణభారతదేశంలో వివిధ రకాల ప్రకృతి దృశ్యాలు, పురాతన దేవాలయాలు, అందమైన బీచ్ లు ఇలా చాలానే ఉన్నాయి. సోలో ట్రావెలర్స్ కు సౌతిండియా ఎన్నో మధురమైన అనుభవాలను అందిస్తుంది. దక్షిణ భారతదేశంలో సోల్ ట్రావెలర్స్ తప్పక సందర్శించాల్సిన 7 టూరిస్ట్ ప్లేస్ లు ఏవో ఇప్పుడు చూద్దాం.
ఆంధ్రప్రదేశ్ లోని అరకు వ్యాలీ
విశాఖపట్నంకి దగ్గర్లో తూర్పు కనుమలలో ఉన్న అరకు హిల్ స్టేషన్ సోలో ట్రావెల్సర్ వెళ్లడానికి బెస్ట్ ప్లేస్. ప్రకృతి ప్రేమికులకు, సాంస్కృతిక ఔత్సాహికులకు అరకు వ్యాలీ ట్రిప్ మర్చిపోలేని అనుభవాన్నిస్తుంది. అరకు వ్యాలీ.. అందమైన ప్రకృతి దృశ్యాలు ఆహ్లాదకరమైన వాతావరణం, గొప్ప సాంస్కృతిక వారసత్వానికి ప్రసిద్ది చెందింది. కాఫీ తోటలు, స్థానిక రుచులు, అద్భుతమైన జలపాతాలు,గిరిజన తెగలు, మర్చిపోలేని ట్రైన్ జర్నీతో అరకు టూర్ జీవితాంతం గుర్తుండిపోతుంది. సోలో ట్రావెలర్స్ వైజాగ్ నుంచి రైలులో అరకు చేరుకోవచ్చు. రోడ్డు మార్గంలో కూడా అరకు చేరుకోవచ్చు.

తమిళనాడులోని కొడైకెనాల్
దిండిగల్ జిల్లాలో పశ్చిమ కనుమలలోని పళని కొండలలో సముద్రమట్టానికి 2,133 మీటర్ల ఎత్తులో ఉండే కొడైకెనాల్ ని హిల్ స్టేషన్ల యువరాణి(Princess of hill stations)అని కూడా పిలుస్తారు. సోలో ట్రిప్ చేసేవాళ్లకు కొడైకెనాల్ సురక్షితమైన ప్రదేశం. కొడైకెనాల్.. అందమైన సరస్సులు,జలపాతాలు, పచ్చని కొండలతో నిండి ఉంటుంది. ప్రకృతిలో ముగినిపోవాలనుకువారికి ఇది పర్ఫెక్ట్ ప్లేస్.
ఇటీవల రిలీజ్ అయిన సూపర్ హిట్ అయిన మళయాల సినిమా మంజుమ్మల్ బాయ్స్ సినిమాలో చూపించిన గుణ కేవ్స్ ఉన్నది కొడైకెనాల్ దగ్గరే. సోలో ట్రావెలర్స్ ఇక్కడ బోటింగ్,సైక్లింగ్, అందమైన ప్రకృతి దృశ్యాలను చూసి ఆనందించవచ్చు.
పాండిచ్చేరి
భారత్ కు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా కొన్నేళ్లపాటు ఫ్రెంచ్ వలసరాజ్యంగా ఉండే కేంద్రపాలిత ప్రాంతం పాండిచ్చేరి దాని ప్రశాంతమైన వాతావరణం, అందమైన బీచ్ లు,రుచికరమైన ఆహారానికి ప్రసిద్ది చెందింది. ఫ్రెంచ్, భారతీయ సంస్కృతుల సమ్మేళనానికి పాపులర్ అయిన ఈ సిటీ సోలో ట్రావెలర్స్ వెళ్లడానికి పర్ఫెక్ట్ ప్లేస్
కర్ణాటకలోని హంపి
బళ్లారికి దగ్గర్లో తుంగభద్ర నది ఒడ్డున ఉండే హంపి ఒక చారిత్రక పట్టణం. ఇది 14వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యానికి రాజధానిగా ఉండేది. శిథిలమైన పురాతన దేవాలయాలు, విజయనగర సామ్రాజ్య వైభవానికి సాక్షంగా నిలిచే రాజభవానాలు, స్మారక చిహ్నాలు ఇక్కడ ఉన్నాయి. భారతదేశంలోనా అత్యంత ప్రసిద్ద పర్యాటక ప్రదేశాలలో ఒకటైన హంపి యునెస్కో ప్రపంచవారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందింది. సోలో ట్రావెలర్స్ ఉండేందుకు అనుకూలమైన వాతావరణం, తక్కువ బడ్జెట్ లో స్టేయింగ్, స్వీయ అన్వేషణకు అనుమైన ప్లేస్ ఇది.
కేరళలోని వర్కల
తిరువనంతపురం జిల్లాలోని అరేబియా సముద్ర తీరంలో ఉన్న వర్కల..కొండలు,అందమైన బీచ్ లు,దేవాలయాలు, ఆయుర్వేద కేంద్రాలకు ప్రసిద్ది. వర్కల ప్రధాన ఆకర్షణలలో పురాతన జనార్థనస్వామి ఆలయం ఒకటి. ఆధ్యాత్మిక శక్తి,ప్రశాంతమైన బీచ్ ల కలయికతో వర్కల..శాంతి,నూతనుత్తేజం కోరుకునే సోలో ట్రావెలర్స్ కు బాగుంటుంది.
కూర్గ్
కర్ణాటకలోని పశ్చిమ కనుమలలో ఉన్న కూర్గ్ ని ఇండియా స్కాట్ లాండ్ అని పిలుస్తారు. ఇక్కడ పచ్చని కాఫీ తోటలు, పొగమంచు కొండు, అందమైన జలపాతాలు ఉంటాయి. సోలో ట్రావెలర్స్ కాఫీ తోటల సందర్శన, ట్రెక్కింగ్, ఫొటోగ్రఫీని ఆస్వాదించవచ్చు. హోమ్ స్టేలు, లోకల్ వైన్ మీ కూర్గ్ ట్రిప్ ని జీవితాంతం గుర్తుండిపోయేలా చేస్తుంది.
గోకర్ణ
కర్ణాటక రాష్ట్రంలోని ఉత్తర కన్నడ జిల్లాలో ఉండే గోకర్ణ అందమైన బీచ్ లు పురాతన దేవాలయాలకు ప్రసిద్ది. ఫేమస్ శివుడి ఆలయం ఇక్కడ ఉంది. విశ్రాంతి కోరుకునే సోలో ట్రావెలర్స్ కి ఇది అనువైన ప్లేస్. గోకర్ణ.. బీచ్ ట్రెక్స్, హోమ్ స్టేలు, ప్రశాంత వాతావరణాన్ని అందిస్తుంది. ఆయుర్వేదం, యోగాకి కూడా గోకర్ణ చాలా ప్రసిద్ది చెందింది. గోవాకి దగ్గర్లోనే గోకర్ణ ఉంటుంది.



Click it and Unblock the Notifications