Latest Updates
-
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.!
Valentines Day 2025: వాలెంటైన్స్ డే రోజు ఓయోకు వెళ్లాలనుకునేవారికి షాక్.. ఈ చిన్న తప్పు చేస్తే జైలుకే
ప్రేమికులకు ప్రత్యేకమైన రోజు అయిన వాలెంటైన్స్ డేలో తమ ప్రేమను వ్యక్తం చేసేందుకు జంటలు ఎంతో సృజనాత్మకంగా ప్రణాళికలు వేస్తారు. కొంత మంది పర్యటనలకు వెళ్తుంటే.. మరికొన్ని జంటలు ప్రేమను ఆస్వాదించడానికి ఓయో రూమ్స్ బుక్ చేసుకుంటారు. కానీ, ఇటీవల ఓయో రూమ్స్ బుకింగ్స్‌కి సంబంధించిన కొన్ని కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. అందువల్ల, వాలెంటైన్స్ డే కోసం రూమ్ బుక్ చేసుకునే ముందు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. ఆ జాగ్రత్తలు ఏంటంటే?
ఓయో జంటలకు కొత్త నియమాలు
సంబంధ ధృవీకరణ
ఓయో హోటల్‌లో చెక్‌ఇన్ సమయంలో జంటలు తమ సంబంధాన్ని నిర్ధారించే పత్రాలు చూపించాల్సి ఉంటుంది. అవి జాయింట్ ఐడీ లేదా మ్యారేజ్ సర్టిఫికేట్ కావచ్చు, ఏదైనా ఓయో రూమ్స్ ప్రతినిధులకు సమర్పించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా రూమ్ బుక్ చేసుకున్నా, చెక్‌ఇన్ సమయంలో అవసరమైన ఆధారాలను సమర్పించాల్సి ఉంటుంది. పెళ్లి కాని జంటల కోసం కొత్త నిబంధనలు ప్రవేశపెట్టబడ్డాయి.

హోటల్ పాలసీలు
ప్రతి ఓయో హోటల్‌కు ప్రత్యేక నియమాలు ఉంటాయి. మీరు బుక్ చేసుకునే హోటల్ ఈ నియమాలకు సరిపోతుందా లేదా అని ముందుగా తెలుసుకోండి. కొన్ని ప్రాంతాలలో, కొన్ని హోటల్స్ పెళ్లికాని జంటలకు రూమ్ ఇవ్వకుండా ఉండొచ్చు. అలాంటి హోటల్స్‌లో బుకింగ్ చేసుకునే ముందు నిబంధనలను ఖచ్చితంగా తెలుసుకోండి.
ID వెరిఫికేషన్
చెక్‌ఇన్ సమయంలో జంటలు ప్రభుత్వ ఆమోదిత ఐడీని చూపించాల్సి ఉంటుంది. భాగస్వాములిద్దరినీ వారి ఐడీలతో ఓయోలకు వెళ్లాల్సి ఉంటుంది. ఓయో హోటల్స్ వివిధ పాలసీలను అమలు చేస్తాయి. మీరు సెలెక్ట్ చేసుకునే హోటల్ అవివాహిత జంటలను అంగీకరిస్తుందా? లేదా? ముందుగా తెలుసుకోండి.
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
ఓయో హోటల్స్ అనేక ప్రాంతాలలో అందుబాటులో ఉన్నా, కొన్ని చోట్ల పెళ్లికాని జంటలకు అనుమతి లేదు. దీంతో, మీరు ముందుగానే దానికి సంబంధించిన ప్రణాళికలు వేసుకోండి. దీని కారణంగా మీ ప్లాన్స్ వృథా కావు. కొన్ని హోటల్స్ ఆన్‌లైన్ చెల్లింపులను అంగీకరించకపోవచ్చు. నగదు లేదా క్రెడిట్ కార్డును మాత్రమే అంగీకరించవచ్చు. కాబట్టి చెల్లింపుల గురించి ముందుగానే వివరాలు తెలుసుకోండి.
అవి కాకపోతే..
వాలెంటైన్స్ డే రోజు పైన పేర్కొన్నవన్నీ జరగకపోతే మీరే ప్రత్యేకమైన ఏర్పాట్లను చేసుకోండి. మీ ప్రేమను సరిగ్గా సెలెబ్రేట్ చేసుకునే విధంగా మంచి అట్మాస్పియర్‌ను సృష్టించుకోండి. ఇలా చేయడం వల్ల ఓయో హోటల్స్ క్యాన్సిల్ అయినా.. మీ ప్లాన్స్ వృథా కావు.



Click it and Unblock the Notifications