Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
ఈ జ్యోతిష్య పరిష్కారాలతో ప్రభుత్వ ఉద్యోగం పక్కా? కావాలంటే చదువుతూనే ట్రై చేయండి
ప్రభుత్వ ఉద్యోగం రావాలంటే రాసి పెట్టి ఉండాలంటారు చాలా మంది. ప్రభుత్వ సొమ్ము తినాలంటే బాకీ ఉండాలని మరికొందరు సామెతగా చెబుతుంటారు. ఇందులో ఎంత వరకు నిజానిజాలు ఉన్నాయన్నది పక్కన పెడితే.. కొందరికి అన్ని అర్హతలు, తెలివితేటలు ఉన్నా.. ప్రభుత్వ ఉద్యోగం మాత్రం రాదు. సంవత్సరాల తరబడి అందరికీ దూరంగా రోజూ పుస్తకాలతో కుస్తీ పడ్డప్పటికీ.. కొందరు ప్రభుత్వ ఉద్యోగం దక్కించుకోలేరు. ప్రవేశ పరీక్షలో ఒకటీ రెండు మార్కులతో ఉద్యోగం కోల్పోయే వారు చాలా మందే ఉంటారు. మరికొందరు ముఖాముఖి వరకు వెళ్లి కూడా తిరిగి వచ్చేస్తుంటారు.

ఎంత కష్టపడ్డా.. ఎక్కడో సమస్య వచ్చి మార్కులు తక్కువ రావడం లాంటివి జరుగుతుంటాయి. పోలీసు ఉద్యోగాల్లాంటి కొలువులకు ప్రవేశ పరీక్షల్లో పాస్ అయినప్పటికీ.. దేహదారుఢ్య పరీక్షల్లో సెకను వంతు తేడాతో ఉద్యోగం అందుకోలేకపోతారు.
వేదజ్యోతిష్యం ప్రకారం గ్రహాల కదలిక ప్రతి ఒక్కరిపై ఉంటుంది. గ్రహ సంచారం వల్ల ఏర్పడే శుభ అశుభ ఫలితాల వల్ల కూడా ప్రభుత్వ ఉద్యోగాలు చేజారిపోతుంటాయి. మీకూ అలాగే సర్కారు కొలువు అందకుండా పోతుంటే.. ఈ జ్యోతిష్య పరిష్కారాలు పాటించండి. వీటి వల్ల దోషాలు, అశుభాలు, ప్రతికూలతలు తొలగిపోయి ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశాలు మెరుగుపడతాయి.
* రోజూ శని యంత్రాన్ని పూజించాలి. విశ్వాసంగా, పూర్తిగా నమ్మకంగా, శ్రద్ధగా, భక్తితో చేసే పూజతో మంచి ఫలితం ఉంటుంది. శని యంత్రం ముందు ఆవనూనెతో దీపం వెలిగించాలి. స్నానం చేసిన తర్వాత శని యంత్రం ముందు ప్రతి రోజూ 108 సార్లు శని మంత్రం ఓం ప్రాంగ్ ప్రీంగ్ ప్రౌంగ్ శః శేశ్చరాయ నమః అని పఠించాలి. శీఘ్ర ఫలితాలు పొందడానికి 40 రోజుల పాటు ఇలా చేయాలి.
* శక్తి, అధికారం పొందడానికి ఆంజనేయ స్వామికి క్రమం తప్పకుండా పూజించాలి. శనిగ్రహం వల్ల కలిగే కష్టాల నుంచి బయటపడటానికి ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. రోజూ హనుమాన్ చాలీసా పఠించాలి. బలమైన సంకల్పం, శ్రద్ధ, భక్తితో చేసే చాలీసా పఠనం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. దీని వల్ల అడ్డంకులు అన్నీ తొలగిపోతాయి.
* అడ్డంకులను తొలగించడానికి, ఆశించిన ఫలితాలను సాధించడానికి శని స్తోత్రాన్ని ప్రతి రోజూ పఠించాలి. ఇలా వరుసగా 21 రోజుల పాటు చేయాలి.
* శనివారం నాడు ఆవాల నూనె, నల్ల ఉరద్, నువ్వులు, నల్ల గుడ్డను దానం చేయాలి. అవసరమైన వారికి సహాయం చేయాలి. శారీరకంగా బలహీనమైన వ్యక్తులకు సేవ చేయడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది.
* శనివారం ఉపవాసం ఉండాలి. అలాగే శనివారం రోజు దశరథ్కృత్ శని స్తోత్రాన్ని పఠించాలి.
* 14 ముఖాల రుద్రాక్షను ధరించాలి. ఈ రుద్రాక్షను ధరించిన వ్యక్తులు.. శక్తి, అధికారం, పేరు, కీర్తి పొందుతారు.
* కుడి చేతి మధ్య వేలిలో బంగారు ఉంగరంలో 4 - 6 క్యారెట్ల నీలమణిని ధరించాలి. దీని వల్ల విధి మెరుగుపడుతుంది. శని యొక్క హానికర ప్రభావం తగ్గుతుంది. జ్యోతిష్కుడిని సంప్రదించిన ఎలాంటి మణి ధరించాలో సూచనలు తీసుకోవాలి. లేదా ఎడమ చేతి మధ్య వేలికి 8 - 13 క్యారెట్ల ఫిరోజాను ధరించిన మంచి ఫలితం ఉంటుంది. లేదంటే కుడి చేతి మధ్యవేలికి వెండి ఉంగరంలో 8 - 13 క్యారెట్ల లాపిస్ లాజుల్లీ ధరించాలి.
* ఏ నివారణ చేసినా పూర్తి విశ్వాసంతో, నమ్మకంతో, శ్రద్ధగా చేస్తేనే ఫలితం ఉంటుంది అని గుర్తుంచుకోవాలి.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications